ఊర్ధ్వ ముఖ పీడనం

(ఊర్ధ్వ పీడనం నుండి దారిమార్పు చెందింది)

ఊర్ధ్వ ముఖ పీడనం ను ఊర్ధ్వ పీడనం అని కూడా అంటారు. దీనిని ఇంగ్లీషులో Upper Pressure (ఊర్ధ్వ పీడనం) అంటారు. ఇది నిలువు ఒత్తిడిలో (Vertical pressure) ఒక భాగం అనవచ్చు. ఊర్ధ్వ అనగా పైన అని అర్ధం. ఊర్ధ్వ పీడనం అనగా ఒత్తిడి ద్వారా పైకి నెట్టడం అని అర్ధం. గాలికి ఉండే మూడు రకాల పీడనాలలో ఊర్ధ్వ ముఖ పీడనం ఒకటి.

ప్రాథమిక సూత్రం

మార్చు

నిలువు ద్రవ పీడన వైవిధ్యం యొక్క సాపేక్షంగా సరళమైన సంస్కరణ[1] అంటే రెండు ఎత్తుల మధ్య ఒత్తిడి వ్యత్యాసం ఎలివేషన్ మార్పు, గురుత్వాకర్షణ, సాంద్రత యొక్క ఉత్పత్తి. సమీకరణం క్రింది విధంగా ఉంది:[వాక్యాన్ని సహజమైన భాషలో రాయాలి]

 ,

ఇక్కడ
P అనేది ఒత్తిడి,
ρ అనేది సాంద్రత,
g అనేది గురుత్వాకర్షణ త్వరణం,
h అనేది ఎత్తు.

వాటర్ గ్లాస్ మేజిక్

మార్చు

ఈ వాటర్ గ్లాస్ మేజిక్ ప్రయోగంలో పని చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. వాతావరణ పీడనం లేదా మన చుట్టూ ఉన్న చిన్న గాలి అణువులు నీటితో నింపిన గ్లాసును బోర్లా తిప్పినను అడ్డుపెట్టిన కార్డు కింద పడకుండా అడ్డుపడుతూ పైకి నెట్టుతుంటాయి. ఈ విధంగా గాలి పైకి నెట్టబడే ఒత్తిడిని గాలికి ఉండే ఊర్ధ్వ ముఖ పీడనం అంటారు. ఇక్కడ గ్లాసులోనికి గాలి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూవుంటుంది. ఆ విధంగా కార్డు కింద పడిపోకుండా గ్లాసుకు మరింత గట్టిగా అనుకుంటూవుంటుంది. అయితే గ్లాసును మరింతగా వాల్చినపుడు లేదా కార్డు ముడతలుగా మారేటప్పుడు వెంటనే గాలి గ్లాసులోనికి ప్రవేశించి నీరు వెంటనే కిందపడుతుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "The Barometric Formula".