ఎండోస్కోప్ అనగా ఎండోస్కోపీ విధానంలో శరీరం లోపల చూడటానికి ఉపయోగించే మైక్రో కెమెరా కలిగిన ఒక వెలుగునిచ్చే ఆప్టికల్, ఇది సాధారణంగా సన్నని, గొట్టపు పరికరం. ఇది గొంతు లేదా అన్నవాహిక వంటి అంతర్గత అవయవాలు పరిశీలించుటకు ఉపయోగించబడుతుంది. ఈ రకపు ప్రత్యేకమైన పరికరాలకు తరువాత ఏ అవయవ లక్ష్యంగా ఉపయోగించబడుతున్నవో ఆ అవయవ పేరు వచ్చేలా పేరు పెట్టబడ్డాయి. ఉదాహరణలుగా మూత్ర కోశ అంతర్దర్శిని (మూత్రాశయం), మూత్ర పిండ అంతర్దర్శిని (కిడ్నీ), శ్వాస నాళ అంతర్దర్శిని (శ్వాసకోశం), కీలు లోపల దర్శిని (కీళ్ళు), పెద్దప్రేగుదర్శిని (పెద్దప్రేగు) ఉన్నాయి.[1] ఇది ఆర్థ్రోస్కోపి వంటి శస్త్రచికిత్సలలో చూసి పరిశీలించుకోవడానికి, రోగనిర్ధారణ చేసుకోవడానికి లేదా శస్త్రచికిత్సలు చేయడానికి ఉపయోగించవచ్చు.

ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ (వంపులు తిరగగల కుహరాంతర దర్శిని)

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-12. Retrieved 2016-05-08.