ఎం.ఎస్. రామచందర్ రావు

(ఎం.ఎస్‌. రామచందర్‌ రావు నుండి దారిమార్పు చెందింది)

మామిడన్న సత్యరత్న రామచందర్‌ రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 27 ఆగష్టు 2021న తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[1]

ఎం.ఎస్‌. రామచందర్‌ రావు

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
31 ఆగష్టు 2021
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు హిమా కోహ్లీ

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
29 జూన్ 2012
సూచించిన వారు ఎస్.హెచ్. కపాడియా
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-08-07) 1966 ఆగస్టు 7 (వయసు 58)
హైదరాబాద్
తల్లిదండ్రులు ఎం. జగన్నాథరావు
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎం.ఎస్‌. రామచందర్‌రావు 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించాడు. ఆయన హైదరాబాద్ లోని సెయింట్‌ పాల్స్‌ పాఠశాలలో పదవ తరగతి, లిటిల్‌ ఫ్లవర్స్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, భవన్స్‌ న్యూసైన్స్‌ కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్‌), ఉస్మానియా వర్సిటీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. రామచందర్‌రావు 1991లో లండన్‌ లోని కేంబ్రిడ్జి వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశాడు. రామచందర్‌రావు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ తండ్రి జస్టిస్‌ ఎం. జగన్నాథరావు కుమారుడు.[2]

కుటుంబ నేపథ్యం

మార్చు

ఎం.ఎస్‌. రామచందర్‌ రావు తండ్రి జస్టిస్‌ ఎం. జగన్నాథరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తి (1997-2000) గా పదవీ విరమణ చేశారు. ఆయన తాతయ్య జస్టిస్‌ రామచందర్‌రావు 1960-61లో హైకోర్టు జడ్జిగా , వీరి తాతయ్య సోదరుడు జస్టిస్‌ ఎం.క్రిష్ణారావు 1966-1973 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశాడు.

వృత్తి జీవితం

మార్చు

ఎం.ఎస్‌. రామచందర్‌రావు 1989 సెప్టెంబరు 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన సమయంలో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, డీసీసీ బ్యాంక్, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్, ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)తో పాటు పలు కంపెనీలు, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ సంస్థలకు న్యాయవాదిగా పని చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సివిల్, ఆర్బిట్రేషన్, కంపెనీలా, అడ్మినిస్ట్రేటివ్, కాన్సిస్ట్యూషనల్‌ లా, లేబర్, సర్వీస్‌ లా కేసులను వాదించాడు.

జస్టిస్‌ రామచందర్‌రావు 29 జూన్‌ 2021న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. ఆయన 4 డిసెంబర్‌ 2013న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు 27 ఆగష్టు 2021న హైకోర్టు ఇన్ ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశాడు.[3][4]ఆయన 05 అక్టోబర్ 2021న పంజాబ్‌-హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Justice MS Ramachandra Rao appointed acting Chief Justice of TS High Court". News Meter. 27 August 2021. Retrieved 27 August 2021.
  2. TSHC (2021). "HONOURABLE SRI JUSTICE M.S.RAMACHANDRA RAO". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
  3. Eenadu (27 August 2021). "తెలంగాణ హైకోర్టు ఇన్‌ఛార్జ్‌ సీజేగా జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచంద్రరావు". Archived from the original on 31 August 2021. Retrieved 31 August 2021.
  4. Sakshi (27 August 2021). "హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు". Archived from the original on 31 August 2021. Retrieved 31 August 2021.
  5. Namasthe Telangana (6 October 2021). "తాత్కాలిక సీజే ఎమ్మెస్సార్‌ బదిలీ". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  6. Eenadu (22 September 2024). "ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రామచంద్రరావు". Archived from the original on 22 September 2024. Retrieved 22 September 2024.