ఎం.కె.కళ్యాణకృష్ణ భాగవతార్

కర్ణాటక సంగీత విద్వాంసుడు, వైణికుడు, సంగీత గురువు

ఎం.కె.కళ్యాణకృష్ణ భాగవతార్ కేరళకు చెందిన వైణిక విద్వాంసుడు.

ఎం.కె.కళ్యాణకృష్ణ భాగవతార్
వ్యక్తిగత సమాచారం
జననం1908
వృత్తివైణికుడు

విశేషాలు మార్చు

ఇతడు 1908లో కేరళ రాష్ట్రం, ఎర్నాకుళం జిల్లా, మంజప్ర గ్రామంలో ఒక వీణ విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు.[1] ఇతడు వీణ వాదనను తన తండ్రి ఎం.కె.కృష్ణభాగవతార్ వద్ద నేర్చుకున్నాడు. చిన్ననాటి నుండే తన తండ్రితో కలిసి కచేరీలలో పాల్గొన్నాడు. ఇతడు తిరువాంకూరు సంస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. తిరువాంకూరు రాజకుటుంబానికి వీణ నేర్పించాడు. స్వాతి తిరుణాళ్ సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1985లో కేరళ సంగీత నాటక అకాడమీ ఇతడిని సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీత వాద్య పరికరాల విభాగంలో ఇతడు చేసిన కృషికి గుర్తింపుగా సంగీత నాటక అకాడమీ అవార్డును 1992లో ప్రదానం చేసింది.

మూలాలు మార్చు

  1. web master. "M. K. Kalyanakrishna Bhagavathar". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 26 March 2021.[permanent dead link]