ఎం.కె.సరోజ
మద్రాస్ కదిరవేలు సరోజ ఒక భరతనాట్య కళాకారిణి, గురువు.
ఎం.కె.సరోజ | |
---|---|
జననం | మద్రాస్ కదిరవేలు సరోజ 1931 ఏప్రిల్ 7 |
వృత్తి | నాట్య కళాకారిణి |
జీవిత భాగస్వామి | మోహన్ ఖోకర్ |
పిల్లలు | హరిహరన్ నందన్ ఆశిష్ వివేక్ |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు కళైమామణి |
జీవిత విశేషాలు
మార్చుఈమె 1931, ఏప్రిల్ 7వ తేదీన చెన్నైలో జన్మించింది. ఈమె తన 5వ యేట తన సోదరితో కలిసి ముత్తుకుమారన్ పిళ్ళై వద్ద శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది.[1]తన గురువు బెంగళూరుకు వెళ్ళడంతో ఈమె అక్కడికి వెళ్ళి నాట్యాన్ని అభ్యసించింది.[2]
ఈమె 1940లో తన తొలి నాట్యప్రదర్శనను ఇచ్చింది. తక్కువ సమయంలోనే మంచి నర్తకిగా పేరు గడించింది. 1946లో జెమినీ స్టూడియో సినిమాలలో నటించడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఐతే ఈమె దానిని తిరస్కరించింది. 1949లో ఈమె చరిత్రకారుడు, నాట్యకళాకారుడు మోహన్ ఖోకర్‌ను వివాహం చేసుకుంది.[1][3][4]ఈమె తన భర్త మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా, నాట్య విభాగానికి అధిపతిగా నియమించబడటంతో అతనితో బాటు బరోడా వెళ్ళింది.[2] అక్కడ ఆమె సుందర్‌లాల్ గంగానీ, కుందన్ లాల్ గంగానీల వద్ద కథక్ నృత్యం నేర్చుకుంది.
1961లో మోహన్ ఖోకర్ కేంద్ర సంగీత నాటక అకాడమీకి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించబడటంతో ఈమె న్యూఢిల్లీకి తన మకాం మార్చింది. అక్కడ ఈమె నాట్య గురువుగా తన ప్రస్థానాన్ని ప్రారంభింబింది. ఈమె రాష్ట్రపతి భవన్‌లో సౌదీ అరేబియా రాజు సమక్షంలో తన నృత్యాన్ని ప్రదర్శించింది. 1970 నుండి ఈమె 1970 నుండి 2000 వరకు ప్రతియేట ప్యారిస్‌లోని "సెంటర్ మండప" దర్శించి అక్కడి విద్యార్థులకు భరతనాట్యం నేర్పించిందై.[2]
ఈమె 40 యేళ్ళ సుదీర్ఘమైన నాట్యవృత్తిని తన భర్త మరణానంతరం 2000లో విరమించింది.[2] ఈమెకు నలుగురు కుమారులున్నారు. మూడవ కొడుకు ఆశిష్ మోహన్ ఖోకర్ చరిత్ర కారుడిగా, కళావిమర్శకుడిగా, రచయితగా రాణించాడు.[5] ప్రస్తుతం ఈమె చెన్నైలో నివసిస్తున్నది.[2]
ఈమె జీవితంపై యూనివర్సిటీ ఆఫ్ రోమ్, నాటక విభాగం ఒక డాక్యుమెంటరీని నిర్మించింది.[2]
శిష్యులు
మార్చుఈమె వద్ద భరతనాట్యం నేర్చుకున్న వారిలో నర్గిస్ కట్పిటియా, ప్రతిభా పండిట్, సుధా పటేల్, లక్ష్మి వల్రాణి, ఇంద్రాణి రెహమాన్, యామినీ కృష్ణమూర్తి, రొమానా ఆగ్నెల్, [6] శోభన రాధాకృష్ణ, రసికా ఖన్నా, అరుప్ ఘోష్, లూసియా మలోని, మిలెన సల్విని, విద్య మొదలైన వారున్నారు.
పురస్కారాలు, గుర్తింపులు
మార్చు- పద్మశ్రీ పురస్కారం - భారత ప్రభుత్వం - 2011[7]
- సంగీత నాటక అకాడమీ టాగూర్ రత్న - 2011[8]
- సంగీత నాటక అకాడమీ అవార్డు - 1995
- కళైమామణి - "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"[9][10]
- నాట్య కళానిధి - అసోసియేషన్ ఆఫ్ భరతనాట్యం ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా (ABHAI) - 2007[11][12]
- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ - [13]
- ఈ.కృష్ణ అయ్యర్ మెడల్ - శృతి ఫౌండేషన్ - 2000[10]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Staff Reporter (28 July 2008). "M.K. Saroja, a model for younger generation". The Hindu. Retrieved 21 August 2014.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Narthaki Bio". Narthaki.com. 28 March 2010. Retrieved 19 August 2014.
- ↑ Suanshu Khurana (21 July 2011). "Mohan Khokar". The New Indian Express. Retrieved 21 August 2014.
- ↑ "Mohan Khokar Dance Archives". Dance Archives of India. 2000. Archived from the original on 30 ఏప్రిల్ 2004. Retrieved 21 August 2014.
- ↑ "Ashish Mohan Khokar". Web article. Attendance-India. 2013. Archived from the original on 22 ఆగస్టు 2014. Retrieved 21 August 2014.
- ↑ "Romana Agnel". Festival of Anthropology of Dance. 2012. Archived from the original on 26 August 2014. Retrieved 21 August 2014.
- ↑ "Padma". Government of India. 25 January 2011. Retrieved 21 August 2014.
- ↑ "Tagore Akademi Ratna". Sangeet Natak Akademi. 2011. Archived from the original on 7 July 2014. Retrieved 21 August 2014.
- ↑ "Award for Dancer". The Hindu. 15 December 2000. Archived from the original on 22 August 2014. Retrieved 22 August 2014.
- ↑ 10.0 10.1 "E. Krishna Iyer Medal". Sruthi Foundation. Retrieved 21 August 2014.
- ↑ "Natya Kalanidhi 2". Association of Bharatanatyam Artistes of India. Archived from the original on 26 ఆగస్టు 2014. Retrieved 21 August 2014.
- ↑ "Natya Kalanidhi 1". Lakshmanasruthi.com. 2007. Archived from the original on 26 ఆగస్టు 2014. Retrieved 21 August 2014.
- ↑ "Life Time Achievement award". Merrinews. Archived from the original on 26 ఆగస్టు 2014. Retrieved 21 August 2014.
గ్రంథసూచీ
మార్చు- Padma Subramanyam (2008). Bharatanatyam Bhakta Guru M. K. Saroja. Delhi: Printways. p. 211. ISBN 9788186773802.
- Two doyens of classical dance: M.K. Saroja and Kanak Rele. Sruti Foundation. April 2014.