పద్మశ్రీ పురస్కారం

భారత ప్రభుత్వ పురస్కారం

పద్మశ్రీ భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం.పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. ఈ పురస్కారాన్ని 1954 జనవరి 2 న స్థాపించారు. ఫిబ్రవరి 2023 నాటికి, మొత్తం 3421 మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.[1] ఏటా గణతంత్ర దినోత్సవం నాడు భారత ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తుంది.[2]

పద్మశ్రీ
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2023
మొత్తం బహూకరణలు 3421
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి ...
వివరణ ...
రిబ్బను

తిరస్కరణలు

మార్చు

సంగీతకారుడు హేమంత కుమార్ ముఖర్జీ, సితార్ వాద్యకారుడు విలాయత్ ఖాన్,[3] విద్యావేత్త, రచయిత మమోని రైసోమ్ గోస్వామి,[4] పాత్రికేయుడు కనక్ సేన్ దేకా,[5] ప్రముఖ బాలీవుడ్ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్‌తో సహా పలువురు ప్రతిపాదిత గ్రహీతలు వివిధ కారణాల వల్ల పద్మశ్రీని తిరస్కరించారు.[6] పర్యావరణ కార్యకర్త సుందర్‌లాల్ బహుగుణ,[7] ఇంగ్లీష్ బిలియర్డ్స్ ఛాంపియన్ మైఖేల్ ఫెరీరా[5] వంటి కొందరు ప్రతిపాదిత గ్రహీతలు ఈ గౌరవాన్ని తిరస్కరించాక, ఆ తర్వాత పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్ వంటి మరింత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని స్వీకరించారు. చలనచిత్ర నిర్మాత అరిబమ్ శ్యామ్ శర్మ,[8] రచయిత ఫణీశ్వర్ నాథ్ 'రేణు',[9] పంజాబీ రచయిత దలీప్ కౌర్ తివానా,[10] ప్రముఖ కవి జయంత మహాపాత్ర[11] వంటి కొందరు ఈ గౌరవాన్ని మొదట స్వీకరించి, ఆ తర్వాత తిరిగి ఇచ్చేసారు.

2022లో, బెంగాలీ గాయని "గీతశ్రీ" సంధ్యా ముఖోపాధ్యాయ, 90 ఏళ్ల వయస్సులో, 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారం కోసం ఆమెను ప్రతిపాదించగా ఆమె తిరస్కరించింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ ప్రముఖ గాయని తన ఎనిమిది దశాబ్దాల కెరీర్‌లో పద్మశ్రీ కంటే ఉన్నతమైన పురస్కారానికి తాను అర్హురాలినని భావించినందున ఆమె దాన్ని తిరస్కరించింది. "జూనియర్ ఆర్టిస్ట్‌కి పద్మశ్రీ మరింత నప్పుతుంది" అని ఆమె కుమార్తె చెప్పింది.[12] ఆమె తిరస్కరణ కారణంగా, 2022 పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో ఆమె పేరును చేర్చలేదు.

పద్మశ్రీ గ్రహీతలు జాబితాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. [http://mha.nic.in/awards_medals Padma Shri Award recipients list Error in Webarchive template: Invalid URL. Government of India
  2. "Padma award's schema" (PDF). Ministry of Home Affairs. Retrieved 13 August 2014.
  3. Kaminsky, Arnold P.; Long, Roger D. (2011). India Today: An Encyclopedia of Life in the Republic. ABC-CLIO. p. 411. ISBN 978-0-313-37462-3. Archived from the original on 21 September 2017.
  4. "Artistes' angst". The Hindu. 19 January 2003. Retrieved 18 June 2018.[dead link]
  5. 5.0 5.1 "Refusal question mark on awards". The Telegraph – India. 28 January 2005. Archived from the original on 13 March 2005. Retrieved 18 June 2018.
  6. "Salim Khan declines to receive Padma Shri". The Indian Express. 27 January 2015. Retrieved 18 June 2018.
  7. "Noted activist Sunderlal Bahuguna turns 90". The Pioneer. 10 January 2017. Retrieved 18 June 2018.
  8. Choudhury, Ratnadip; Dutta Roy, Divyanshu (3 February 2019). "Veteran Manipuri Filmmaker Returns Padma Shri To Protest Citizenship Bill". NDTV. Retrieved 2 March 2022.
  9. "Aura Virtual Campus". Archived from the original on 3 March 2016. Retrieved 18 June 2018.
  10. "Punjabi writer Tiwana to return Padma Shri". The Tribune. 14 October 2015. Archived from the original on 18 జూన్ 2018. Retrieved 18 June 2018.
  11. "Jayanta Mahapatra returns Padma Shri protesting 'intolerance'". The Hindustan Times. 23 November 2015. Retrieved 18 June 2018.
  12. "Padma Shri More Deserving For Junior Artiste". 26 January 2022. Retrieved 26 January 2022.
  13. "Vyoma Telugu Current Affairs articles". www.vyoma.net (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-24. Retrieved 2020-09-06.
  14. "పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్". BBC News తెలుగు. Retrieved 2020-09-06.

వెలుపలి లంకెలు

మార్చు