ఎమ్.వి.రాజమ్మ
ఎమ్.వి.రాజమ్మ దక్షిణ భారతదేశపు నటి. బహుముఖ ప్రజ్ఞాశాలి. కన్నడలోనే కాకుండా భారతదేశంలో మొదటి మహిళా నిర్మాతగా పేరుగాంచింది. తెలుగు, తమిళ, కన్నడం మూడు భాషలలో 100కు పైగా సినిమాలలో నటించి తారగా వెలుగొందింది. ఈమె రాజ్‌కుమార్తో కలిసి అనేక సినిమాలలో నటించింది, ఆ తరువాత రాజ్ కుమార్ సినిమాలలో తల్లి పాత్రలు కూడా చేసింది.
ఎమ్.వి.రాజమ్మ | |
---|---|
జననం | రాజమ్మ 1923 అగ్గండనహళ్లి, బెంగుళూరు గ్రామీణ జిల్లా |
మరణం | ఏప్రిల్ 24, 1999 చెన్నై |
నివాస ప్రాంతం | చెన్నై |
వృత్తి | నటి, నిర్మాత |
క్రియాశీలక సంవత్సరాలు | 1939 నుండి 1989 వరకు |
మతం | హిందూమతం |
భార్య / భర్త | బి.ఆర్.పంతులు |
తండ్రి | నంజప్ప |
తల్లి | సుబ్బమ్మ |
రాజమ్మ 1923 లో బెంగుళూరు గ్రామీణ జిల్లాలోని అగ్గండనహళ్లిలో జమిందారీ వంశంలో నంజప్ప, సుబ్బమ్మ దంపతులకు జన్మించింది. ఆమె మాతృభాష కన్నడ. విద్యాభ్యాసం బెంగుళూరులోని ఆర్య బాలికా పాఠశాలలో సాగింది. ఎనిమిదవ తరగతిలో ఉండగానే ఈమె నాటకాలలో నటించడం ప్రారంభించింది.[1] ఈమె ముఖ్యంగా బి.ఆర్.పంతులు సినిమాలలో కనిపించేంది. ఆయనతో కలిసి పూర్వరంగంలో చంద్రకళా నాటక మండలి స్థాపించి రంగస్థలంపై నటించింది. ఈమె కథానాయకిగా తొలి చిత్రం సింహా యొక్క సంసారనౌక. 1943లో రాధా రమణ సినిమా తీయడానికి విజయ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థని స్థాపించింది, తరువాత బి.ఆర్.పంతులు సంస్థ పద్మినీ పిక్చర్స్ తో కలిపి సినిమాలు తీశారు. రాధా రమణ ఒక మహిళా నిర్మాతచే నిర్మించిన తొలి సినిమా. ఇందులో దర్శకుడు, రచయిత జీ.వి.అయ్యర్‌ను, నటుడు బాలకృష్ణను సినిమారంగానికి పరిచయం చేసింది.[2]
ఈమె పంతులమ్మ వంటి సామాజిక పాత్రలైనా, కిత్తూరు చెన్నమ్మ మొదలైన పౌరాణిక పాత్రలైన వాటికే తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసేది. ఈమె కె.సుబ్రమణ్యం సినిమాలు అనంతశయనం, భక్త ప్రహ్లాద, గోకుల దాసి సినిమాలలో నటించింది.[3]
ఈమె 1999 ఏప్రిల్ 24న చెన్నైలో మరణించింది.
మూలాలు
మార్చు- ↑ "ಅತ್ಯುತ್ತಮ ಅಭಿನೇತ್ರಿ ಎಂ.ವಿ.ರಾಜಮ್ಮ (కన్నడం)". Archived from the original on 2014-10-24. Retrieved 2013-08-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-18. Retrieved 2013-08-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-30. Retrieved 2013-08-23.