బి.ఆర్.పంతులు
బి.ఆర్.పంతులు (బడగూర్ రామకృష్ణయ్య పంతులు) ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాల్లో పలు సినిమాలకు నిర్మాణం, దర్శకత్వం వహించారు. ఆనాటి మైసూరు రాజ్యంలో నేటి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కుప్పంకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడగూరులో జన్మించారు. గుబ్బి వీరణ్ణ ట్రూపులో నటుడిగా చేరి కన్నడ నాటక రంగంలో ప్రఖ్యాతులై, తర్వాత తమిళ చలనచిత్ర రంగంతో సినీ నిర్మాణం ప్రారంభించారు. క్రమంగా పలు భాషల్లో సినిమాల నిర్మాణం సాగించారు. పద్మినీ పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో 55 చిత్రాలను నిర్మించారు. వాటిలో కొన్ని మినహా అన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.
తెలుగు సినిమా రంగం
మార్చునిర్మాతగా/ప్రొడక్షన్ అసిస్టెంటుగా
మార్చు- భక్తిమాల
- శ్రీకృష్ణదేవరాయలు
- వీరపాండ్య కట్టబ్రహ్మన
- పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
- పెంపుడు కూతురు
- గాలిమేడలు
దర్శకుడిగా
మార్చు- శ్రీకృష్ణదేవరాయలు
- బడిపంతులు
- రాణి చెన్నమ్మ
- దొంగలు దొరలు
- వీరపాండ్య కట్టబ్రహ్మన
- పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
- కర్ణ
- విచిత్ర వీరుడు
- సెబాష్ పిల్లా
- పెంపుడు కూతురు
- గాలిమేడలు
- కథానాయకుని కథ
- రత్నగిరి రహస్యం
నటుడిగా
మార్చునేపథ్య గాయకుడిగా
మార్చుమరణం
మార్చుఇతడు హృద్రోగం వల్ల బెంగళూరులో 1974, అక్టోబర్ 8న మరణించాడు.[1]
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 November 1974). "వార్తలు". విజయచిత్ర. 9 (5): 63.