మాటూరి వెంకట శ్రీథర్ ( 1966 ఆగస్టు 2 - 2017 అక్టోబరు 30) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.[1] ఆయన 1988/89, 1999/2000 లలో హైదరాబాద్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. ఆయన తన కెరీర్ లో 21 శతకాలతో, 48.21 రన్ రేటుతో మొత్తం 6701 పరుగులను చేసాడు. ఆయన 1993-94 రంజీ ట్రోఫీలో ఆంధ్రాజట్టుతో ఆడిన ఆటలో అత్యధిక స్కోరు 366 ను నమోదు చేసాడు. ఆ ఆటలో హైదరాబాదు జట్టు 944/6 తో డిక్లేర్ చేసింది.[2] ఆయన చేసిన 850 రన్స్ స్కోరు ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ బ్యాట్స్ మన్ గా చరిత్రలో నిలిచాడు.[3] ఆయన ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, హైదరాబాదుకు సెక్రటరీగా ఉండేవాడు.[4]

2017 అక్టోబరు 30 న తన స్వగృహంలో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.[5]

మూలాలు

మార్చు
  1. "In Memoriam 2017". International Cricket Council. Retrieved 2 January 2018.
  2. Acharya, Shayan. "Sridhar and the memories of 944". sportstarlive.com. Retrieved 3 December 2017.
  3. Frindall, Bill (1998). The Wisden Book of Cricket Records (Fourth ed.). London: Headline Book Publishing. pp. 91. ISBN 0747222037.
  4. "MV Sridhar passes away aged 51". Wisden India. Archived from the original on 30 అక్టోబరు 2017. Retrieved 30 October 2017.
  5. "Former Hyderabad cricketer MV Sridhar passes away". ESPN Cricinfo. Retrieved 30 October 2017.

ఇతర లింకులు

మార్చు