ఎం. కోదండ రెడ్డి

ఎం. కోదండ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఎం.కోదండ రెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1999
నియోజకవర్గం ముషీరాబాద్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1945
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితంసవరించు

ఎం. కోదండ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా దళ్ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి పై 12367 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఎం. కోదండ రెడ్డి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా దళ్ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి పై 4931 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కె. లక్ష్మణ్ చేతిలో 18567 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఎం. కోదండ రెడ్డి అనంతరం పార్టీలో కాంగ్రెస్ కిసాన్‌సెల్ ఛైర్మన్‌గా[1], టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా పనిచేసి 2021 ఆగస్టు 29న పదవికి రాజీనామా చేశాడు.[2]

మూలాలుసవరించు

  1. Sakshi (23 July 2014). "'తెలంగాణ సీఎం స్పష్టత ఇవ్వాలి'". Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.
  2. Sakshi (29 August 2021). "టీపీసీసీకి షాక్‌.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా". Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.