కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించాడు.

కె. లక్ష్మణ్
కె. లక్ష్మణ్


మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలము
1994 - 1999, 2014 - 2018
నియోజకవర్గము ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 3, 1956
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జీవిత భాగస్వామి ఉమా
సంతానము ఇద్దరు కుమార్తెలు (శ్వేతా, శృతి), ఒక కుమారుడు (రాహుల్)
నివాసము అశోక్ నగర్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

జననం - విద్యాభ్యాసంసవరించు

కె. లక్ష్మణ్ 1956, జూలై 3న హైదరాబాదులో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని పి.సి. సెంటర్ నుండి ఎం.ఎస్సీ, జియోలజీ శాఖలో పిహెచ్.డి. పూర్తిచేశాడు.

వివాహంసవరించు

లక్ష్మణ్ కు ఉమాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు (శ్వేతా, శృతి), ఒక కుమారుడు (రాహుల్).[1]

రాజకీయ జీవితంసవరించు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ అనుబంధమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరాడు. 1980లో బిజెపిలో చేరి, హైదరాబాద్ నగరంలో వివిధ పదవులను నిర్వర్తించి, 1995 నుండి 1999 వరకు హైదరాబాద్ బిజెపి శాఖకు అధ్యక్షులుగా పనిచేశాడు. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2016 నుండి 2020 మార్చి 10వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.

1994 లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1994 లో అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో లక్ష్మణ్‌ ఓటమిపాలయ్యాడు.[2]

మూలాలుసవరించు