ఎక్స్‌పోజర్ కాంపెన్సేషన్ (ఫొటోగ్రఫీ)

బహిర్గత పరిహారం (ఆంగ్లం:Exposure Compensation) ఛాయాచిత్రకళలో బహిర్గతాన్ని ఛాయాచిత్ర బహిర్గత కొలబద్ద (Photographic Exposure Meter) చే సరిచేయు ఒక సాంకేతికాంశం. ఛాయాచిత్రం కావలసినంత కాంతివంతంగా రాకుండా ఉండే కారకాలని (ఉదా: అసాధారణ కాంతి ప్రసరణ, కెమెరా వ్యవస్థలోని తేడాలు, ఫిల్టర్లు, అప్రమాణీక ప్రక్రియలు, ఉద్దేశ్యపూర్వక అతిబహిర్గతం/అల్పబహిర్గతం వంటి వాటిని) దృష్టిలో ఉంచుకొని బహిర్గతం సరిచేయబడుతుంది. సినిమాటోగ్రఫిలో బహిర్గత పరిహారాన్ని షట్టరు కోణం, ఫిలిం వేగం, బహిర్గత సూచిక, ఇతరాలలోని తేడాల వలన బహిర్గతాలలో కలగే వ్యత్యాసాలని సరిచేసేందుకు ఉపయోగిస్తారు.

బహిర్గత పరిహారం లేని మంచు కొండల ఛాయాచిత్రం
+2EV బహిర్గత పరిహారంతో అదే మంచు కొండల ఛాయాచిత్రం

చాలా డిజిటల్ కెమెరాలు డిస్ప్లే సెట్టింగ్‌ను కలిగి ఉంటాయి. భౌతిక డయల్‌ను కలిగి ఉంటాయి, దీని ద్వారా ఫోటోగ్రాఫర్ కెమెరాను 1/3 స్టాప్ వ్యవధిలో మూడు ఎఫ్-స్టాప్‌ల (ఎఫ్-నంబర్లు) వరకు బహిర్గతం చేయవచ్చు. స్కేల్‌లోని ప్రతి సంఖ్య (1,2,3) ఒక ఎఫ్-స్టాప్‌ను సూచిస్తుంది, ఎక్స్‌పోజర్‌ను ఒక ఎఫ్-స్టాప్ ద్వారా తగ్గించడం సెన్సార్‌కు చేరే కాంతి మొత్తాన్ని సగానికి తగ్గిస్తుంది. సంఖ్యల మధ్య చుక్కలు f- స్టాప్‌లో 1/3 ని సూచిస్తాయి.[1]

మూలాలు మార్చు

  1. Exposure Compensation. "By Geoff Lawrence"