ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

ఎన్ ఆర్  ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఆర్ఐఐఎంఎస్) విశాఖపట్నంకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో భీమునిపట్నం, సంగివలసలో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ ను అనిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు  2012 సంవత్సరంలో స్థాపించారు[1].

అవలోకనం మార్చు

ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఆర్ఐఐఎంఎస్) భారత ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి)  వారిచే గుర్తింపు పొంది, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడకు అనుబంధంగా ఉంది. ఈ వైద్య కళాశాల 16 విభాగాల్లో ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 150 సీట్లను అందిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తమ 5 వైద్య సంస్థలలో ఒకటి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఆర్ఐఐఎంఎస్) 40 ఎకరాల స్థలంలో, క్యాంపస్ లో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణంతో ఉంది. క్రమశిక్షణ గల అధ్యాపకులచే విద్యార్థులకు కొత్త ఆలోచన, ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడానికి అనుకూల మైన వాతావరణాన్ని ఈ కళాశాలలో చదివే విద్యార్థులకు అందిస్తున్నారు[2].

వసతులు మార్చు

10.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ లో కళాశాల, ఆసుపత్రి, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్లు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో 15,000 పుస్తకాలతో అత్యాధునిక లైబ్రరీ, ఇ లైబ్రరీ, మూల్యాంకన కేంద్రం ఉన్నాయి.ఎంబీబీఎస్ లో 150 సీట్లు, పీజీ కోర్సుల్లో 66 సీట్లు ఈ కళాశాలలో అర్హులైన వారికీ అందుబాటులో ఉన్నాయి. అనిల్ నీరుకొండ ఆస్పత్రిలో 980 పడకలు, 200 మందికి పైగా వైద్యులు, అధునాతన ల్యాబ్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి [3].

అర్హతలు మార్చు

ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్/ బీడీఎస్ కోర్సులో చేరే నాటికి అడ్మిషన్ సమయానికి 17 ఏళ్లు నిండి ఉండాలి లేదా ఆ వయసును డిసెంబరు 31 లోపు పూర్తి చేసి ఉండాలి.

యూజీ కోర్సులు అభ్యర్థులు నీట్ యూజీ స్కోర్ తో పాటు 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.

పీజీ కోర్సులు నీట్ పీజీ స్కోర్ తో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ (ఎంబీబీఎస్ ) లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఆల్ ఇండియా కోటా ( ఏఐక్యూ), స్టేట్ కౌన్సెలింగ్ కోర్సులకు కనీసం 40శాతంతో సమానమైన మార్కులు, రిజర్వేషన్ లేని విద్యార్థులు  కనీసం 50 శాతం మార్కులు సమానమైన పొంది ఉండాలి[4]

మూలాలు మార్చు

  1. "NRI Institute of Medical Sciences, Visakhapatnam (AU)". tabindia.org. Retrieved 2023-12-19.
  2. "NRI Institute of Medical Sciences, Visakhapatnam - Admission, Course, Fees, Cutoff, Seats, Eligibility - MedicalneetPg". www.medicalneetpg.com (in ఇంగ్లీష్). Retrieved 2023-12-19.[permanent dead link]
  3. "NRI Institute of Medical Sciences | Best UG/PG Programmes In Visakhapatnam". NRI Institute of Medical Sciences | Best UG/PG Programmes In Visakhapatnam (in ఇంగ్లీష్). Archived from the original on 2023-06-30. Retrieved 2023-12-19.
  4. mdmsadmission (2022-09-13). "NRI Institute of Medical Sciences Visakhapatnam: EduEnquiry". MD MS MBBS Admission 2023 (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-12-19.