ఎన్.ఎస్.కృష్ణమూర్తి (స్నేహితుల్లో ఎన్.ఎస్.కె.గా పేరొందాడు) (1910 ఏప్రిల్ 16 - ) సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు, చరిత్రకారుడు. న్యాయవాదిగా పనిచేస్తూనే విస్తృతమైన అధ్యయనంతో పరిశోధన సాగించాడు. అధ్యయనం ఎక్కువగానూ, రచన తక్కువగానూ చేయడం అతని పద్ధతి. సాహిత్యం, భారతీయ కళ, చరిత్ర వంటి సామాజిక శాస్త్రాలన్నిటిలోనూ విస్తారమైన ఆసక్తితో అధ్యయనం సాగించాడతను.అన్నామలై విశ్వవిద్యాలయం లో 1934లో బి.ఏ.పూర్తి చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం లో ఎం.ఏ.బి.ఎల్.చదివి నెల్లూరు కోర్టులో న్యాయవాదవృత్తిని చేపట్టారు.

1949లో నేలనూతల కృష్ణమూర్తి

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

నేలనూతల శ్రీకృష్ణమూర్తి 1910 ఏప్రిల్ 16న అద్దంకిలో శ్రీరామనవమి పండుగ నాడు నెల్లూరుకు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు శ్రీరాములు, జానకమ్మ. కృష్ణమూర్తి తండ్రి శ్రీరాములు పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో పనిచేసేవాడు. అతని ఉద్యోగంలో తరచు బదిలీలు రావడంతో ఎన్.ఎస్.కె. బాల్యం కోస్తాంధ్ర ప్రాంతంలోని పలు పట్టణాల్లో సాగింది. దీనితో పదో తరగతి వరకూ అతని విద్యాభ్యాసం పలు పట్టణాల్లో సాగింది. చివరకు శ్రీరాములు స్వంత ప్రాంతమైన నెల్లూరు వచ్చి స్థిరపడి, అక్కడే ఉద్యోగ విరమణ చేయడంతో కృష్ణమూర్తి ఇంటర్మీడియట్ 1927-29 మధ్యకాంలో నెల్లూరు వి.ఆర్.కళాశాలలో సాగింది. చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రధానమైన సబ్జెక్టుగా తీసుకుని చదివి 1932లో డిగ్రీ పాసయ్యాడు. 1932-1934 మధ్యకాలం నెల్లూరులోనే ఖాళీగా ఉన్నాడు. ఈ కాలంలో ఇష్టమైన పుస్తకాలు చదువుతూ, వివిధ అంశాలు అధ్యయనం చేస్తూ గడిపాడు.1934లో మద్రాసు విశ్వవిద్యాలయం లో ఎం.ఏ.బి.ఎల్. చదివి నెల్లూరులో న్యాయవాదవృత్తిలో స్థిరపడ్డాడు. సహన్యాయవాది, విద్వాంసులు ఒంగోలు వెంకటరంగయ్య పరభావంలో వారి సహచర్యంలో భరతుని నాట్యశాస్త్రం అధ్యయనం చేశాడు. అప్పుడే సుప్రసిద్ధ ఇండాలజిస్టు ఇనందకుమారస్వామి రచనలు చదివి ప్రరభావితుడయ్యాడు.

సాహిత్యసేవసవరించు

  • తెలుగులో ప్రచురించబడిన వ్యాసరచనలకు ఒక బృహత్సూచిక వీరి సంపాదకత్వంలో రూపుదిద్దుకున్నది.[1]
  • ఆంధ్ర సదుక్తి కర్ణామృతము (ఆంధ్రేతరులు ఆంధ్రుల గురించి, వారి సాంస్కృతిక జీవనవిధానాన్ని గురించిన చెప్పిన ప్రశంసావాక్యాల సంకలనం)[2]

మూలాలుసవరించు

  • Sri N.S.Krishna Murthy: An appriciation and memoir - Vedam Venkatraman