అద్దంకి
అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పట్టణం (నగర పంచాయితీ), మండల కేంద్రము. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.
అద్దంకి | |
---|---|
పట్టణం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.9738°ECoordinates: 15°48′40″N 79°58′26″E / 15.811°N 79.9738°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | అద్దంకి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 25 కి.మీ2 (10 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 43,850 |
• సాంద్రత | 1,800/కి.మీ2 (4,500/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08593 ![]() |
పిన్(PIN) | 523201 ![]() |
జాలస్థలి | https://addanki.cdma.ap.gov.in/ ![]() |
అద్దంకి చరిత్రసవరించు
ఒక కథ ప్రకారం, అద్దంకిలో అద్దడు, అంకి అనే ఇద్దరు వడ్డి కులం వారు తమ రాజుగారి కోట నిలవడానికి కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినవిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు[1]. ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందే తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. క్రీ.శ. 849లో అద్దంకి పండరంగడు తనకు గురువైన ఆదిత్య భట్టారకుడికి 8 పుట్లు భూమిని దానమిచ్చిన వివరాలు తెలిపే శాసనమిది. ఇది చెన్నై మ్యూజియంలో భద్రపరచబడింది. దీని నకలు ప్రతిని అద్దంకిలో సృజనసాహితీప్రియుులు ప్రతిష్ఠించారు.[2]
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణం.[3] గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో ప్రోలయ వేమారెడ్డి వారి మంత్రులైన దేశ పాండ్యులతో కలసి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు. తరువాత వారు తమ రాజధాని కొండవీటికి మార్చారు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రెగడ మహాభారతా న్ని ఇక్కడే పూర్తిచేశాడు.
టంగుటూరి ప్రకాశం పంతులు బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
భౌగోళికంసవరించు
2011 జనగణన ప్రకారం జనాభా 43,850 జన సాంద్రత1,800/కి.మీ2 (4,500/చ. మై.).[4]
విద్యసవరించు
ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బధిరుల ఆశ్రమ పాఠశాల కొన్ని విశిష్ట పాఠశాలలు.
సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
రాళ్ళపల్లి చెరువు.
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
- చారిత్రక దేవాలయాలు
- 1000 స్తంభాల దేవాలయం ( భవానీ సెంటర్ దగ్గర)
- ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, సింగరకొండ అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం (5కిమీ), ఇతర దేవాలయాలున్నాయి. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014, మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ ప్రభాకరశాస్త్రి, వేటూరి (1955). సింహావలోకనము. ముక్త్యాల: మణిమంజరి. Retrieved 2020-07-10.
- ↑ "ప్రకాశం జిల్లాచరిత్ర". ఈనాడు. Archived from the original on 2012-05-24.
- ↑ ఆంధ్రప్రదేశ్ దర్శిని. 1982. p. 80.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడులో జనగణన గణాంకాలు".
Wikimedia Commons has media related to Addanki. |