జస్టిస్ ఎన్.కుమారయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధానన్యాయమూర్తి.

ఎన్.కుమారయ్య

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
పదవీ కాలము
1969 – 1971
ముందు పింగళి జగన్మోహనరెడ్డి
తరువాత కె.వి.ఎల్.నరసింహం

వ్యక్తిగత వివరాలు

జననం (1909-06-15) 1909 జూన్ 15
మరణం 2005 9జనవరి
సికింద్రాబాదు

కుమారయ్య 1909, జూన్ 15న కరీంనగర్ జిల్లా, కొడిమ్యాలలో, మధ్యతరగతి కుమ్మరి కుటుంబంలో జన్మించాడు. కరీంనగర్ మాధ్యమిక పాఠశాలలో, వరంగల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య పూర్తిచేసుకొని, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడయ్యాడు. 1931 జూలై 26న హైదరాబాదు సివిల్ సర్వీసులో చేరాడు. 1935 లో మున్సిఫ్ మాజిస్ట్రేటుగా, 1943లో జిల్లా అదనపు న్యాయవాదిగా, 1946 జిల్లా న్యాయమూర్తిగా, 1948లో సెషన్సు న్యాయవాదిగా అంచెలంచెలుగా వృత్తిలో ఎదిగాడు.

1955లో హైదరాబాదు హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. తిరిగి 1956లో అదనపు న్యాయమూర్తిగా నియమించబడి, 1957, అక్టోబరు 22న శాశ్వత న్యాయమూర్తి అయ్యాడు. హైకోర్టు న్యాయమూర్తిగా 14 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1969లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితుడై, ఆ హోదాలో 1971, జూన్ 15న పదవీ విరమణ చేశాడు. నాలుగు సంవత్సరాలు ప్రపంచబ్యాంకు ట్రిబ్యునల్లో న్యాయవాదిగా పనిచేశాడు. కాకతీయ విశ్వవిద్యాలయం జస్టిస్ కుమారయ్యకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది.[1]

కుమారయ్య 2005, జనవరి 9న ఈస్ట్ మారేడుపల్లిలోని తన స్వగృహంలో కొంతకాలం పాటు ఆస్వస్థతకు గురై మరణించాడు.[1] ఈయనకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Ex-Chief Justice of HC dead". The Hindu. Jan 10, 2005. Retrieved 16 October 2017.