ప్రధాన మెనూను తెరువు

ఎమోజీ

ఎమోజీలు (Japanese: 絵文字えもじ?, ఆంగ్లము: emoji; English /ɪˈmi/; Japanese: [emodʑi][2]) ఎలక్ట్రానిక్ సందేశాలు మరియు వెబ్ పేజీలలో ఉపయోగించే ఐడియోగ్రామ్స్ మరియు స్మైలీలు.

ఎమోజీ
చిహ్న గుంపులుఎమోజీ
వాడినవి1,146 సంకేత బిందువులు(కోడ్ పాయింట్స్)
యూనికోడ్ వెర్షన్ చరిత్ర
1.0.079 (+79)
3.081 (+2)
3.289 (+8)
4.097 (+8)
4.1113 (+16)
5.1117 (+4)
5.2144 (+27)
6.0860 (+716)
6.1873 (+13)
7.0977 (+104)
8.01,018 (+41)
9.01,090 (+72)
10.01,146 (+56)
గమనిక: [1]

విషయ సూచిక

చరిత్రసవరించు

మొదటిసారి ఎమోజీని అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1862లో తన ప్రసంగంలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అప్పట్లో కొందరు టైపోగ్రాఫర్లు లింకన్ ప్రసంగంలో వ్యంగ్యాస్త్రాల పక్కన కన్నుగీటే సైగ ఎమోజీని పెట్టారు. అందుకే ప్రపంచంలో మొట్టమొదటిసారి అబ్రహాం లింకనే ఎమోజీని వాడారని తెలుస్తోంది.నేటి కాలంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్స్‌లో ఈ ఎమోజీలను ఉపయోగిస్తారు.మ‌నలో క‌లిగే అనేక భావాల‌ను ఎదుటి వారికి స్ప‌ష్టంగా తెలియ‌జేసేందుకు ఇవి ఉపయోగ‌ప‌డ‌తాయి.1999లో జ‌పాన్‌కు చెందిన షిగెట‌క కురిత అనేబ‌డే ఓ డిజైన‌ర్ తొలిసారిగా 175 పిక్స‌ల్స్ సైజ్ ఉన్న ఓ ఎమోజీని డిజైన్ చేశారు. దాన్ని మొబైల్ ఇంట‌ర్నెట్ ప్లాట్‌ఫాంపై త‌రువాత వాడారు. అప్ప‌టి నుంచి అనేక ఎమోజీలు మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఒక అంచనా ప్రకారం రోజుకు 6 బిలియన్ల ఎమోజీలను ఒకరికొకరు పంపుకుంటారని తేలింది. [3][4] [5][6]

అధికంగా ఉపయోగించి ఎమోజీసవరించు

2014లో ప్రపంచవ్యాప్తంగా బాగా వాడబడిన ఎమోజీ హార్ట్‌ ఎమోజీ.ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీ 2015 వర్డ్‌ ఆఫ్‌ ఇయర్‌’గా సంతోషంలో కళ్ల వెంట నీళ్ళు వచ్చే ఎమోజీని ఎంపిక చేసింది.

 
సంతోషంలో కళ్ల వెంట నీళ్ళు వచ్చే ఎమోజీ

[7]

సెన్సారింగ్‌సవరించు

కొన్ని నిషిద్ధ పదాలు ఆయా దేశాల సంస్కృతి , సంప్రదాయాలకు భంగం కలిగించే విధంగా ఉంటాయి. అలాంటి పదాలను సోషల్‌ మీడియా సర్వీసులు కూడా కొంతవరకూ నిషేధిస్తూ ఉంటాయి. కొన్ని ఎమోజీలను నిషేధించారు.వంకాయ’ ఆకారంలో ఉన్న ఎమోజీ, మిడిల్‌ ఫింగర్‌ పైకి చూపించే ఎమోజీని వినియోగదారులు వాడకుండా నిషేధించింది. దానికి అభ్యంతరకరమైన అర్థం ఉండటం వల్ల.

ప్రపంచ ఎమోజీ దినంసవరించు

2014లో లండ‌న్‌కు చెందిన జెరెమీ బ‌ర్గ్‌ అనే ఓ వ్య‌క్తి ఈ వ‌ర‌ల్డ్ ఎమోజీ డేను ప్రారంభించారు.ఎమోజీల‌కు ఒక రోజు ఉండాల‌నే నేప‌థ్యంలో ప్ర‌తి ఏటా జూలై 17వ తేదీని వ‌ర‌ల్డ్ ఎమోజీ డేగా పాటిస్తున్నారు. జూలై 17వ తేదీనే ఎందుకంటే యాపిల్‌కు చెందిన ఐఫోన్ల‌లో క్యాలెండ‌ర్ ఎమోజీలో తేదీ జూలై 17 అని ఉంటుంది. అందుక‌నే దాన్ని ఆ రోజున ప్రారంభించాన‌ని జెరెమీ బ‌ర్గ్ చెబుతున్నాడు.

భాష పై ప్రభావంసవరించు

ఎమోజీల వాడకం వల్లన పరోక్షంగా భాషని చంపేస్తోంది అనే భయాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయి. టైప్‌ చేయడం ఇబ్బందిగా భావించి చాలామంది ఎమోజీలను వాడడం వల్ల ఆయా భాషలకు ముప్పు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

కొన్ని ఎమోజీలుసవరించు

😀 నవ్వుతున్న ముఖం 🙃 తలక్రిందులుగా ఉన్న ముఖం 😘 ముద్దు ముఖం 😛 నాలుకతో ముఖం
😶 నోటి లేకుండా ముఖం 🤮 వాంతులతో ముఖచిత్రం 🤯 పేలుతున్న తల 😢 ఏడుపు ముఖం
😱 భవ్యమైన ముఖం 😖 గందరగోళ ముఖం 😣 పట్టుదలతో ఉన్న ముఖం 😩

అలసిపోయిన ముఖం

🤬 నోటిపై చిహ్నాలతో ముఖం 😈 కొమ్ములతో నవ్వుతున్న ముఖం 👏 చప్పట్లు కొట్టడం 👱 రాగి జుట్టు

మనిషి

👩‍🌾 మహిళా రైతు 👨‍🍳 మగ వంట మనిషి 👩‍🍳 ఆడ వంట మనిషి 👨‍🔧 మెకానిక్

మూలాలుసవరించు

  1. "Enumerated Versions of The Unicode Standard". The Unicode Standard. Retrieved August 17, 2016.
  2. "emoji Meaning in the Cambridge English Dictionary". Retrieved March 30, 2017.
  3. https://www.andhrajyothy.com/artical?SID=692404
  4. "Happy 30th Birthday Emoticon!". Independent. September 8, 2012. Retrieved November 30, 2017.
  5. "Why Do We Use Emojis Anyway? A Fascinating History of Emoticons". Readers Digest. Retrieved November 30, 2017.
  6. "Emoji 101". Overdrive Interactive. October 14, 2015. Retrieved November 30, 2017.
  7. Wang, Yanan (November 17, 2015). "For first time ever, an emoji is crowned Oxford Dictionaries' Word of the Year". The Washington Post. Retrieved January 20, 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎమోజీ&oldid=2706760" నుండి వెలికితీశారు