సంస్కృతి
సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.[1] ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.[2]


ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును.[3] ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి
సంస్కృతి నిర్వచనం సవరించు
ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.[4] ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.[5] వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.
1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు , సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును. ("సంస్కృతి లేదా నాగరికత, దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది , ఏ ఇతర సామర్థ్యాలు , అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం") [6]
ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే.[7] ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్, క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ[8] సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు
సంస్కృతి, నాగరికత సవరించు
సంస్కృతిలో మార్పులు సవరించు
భారతీయ సంస్కృతి సవరించు
ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సనాతనమైనది
తెలుగువారి సంస్కృతి (తెలుగుదనం) సవరించు
- తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు
వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Harper, Douglas (2001). Online Etymology Dictionary.
- ↑ Findley, Carther Vaughn and John Alexander Rothney (2006). Twentieth-century World. Sixth edition, p. 14. ISBN 978-0-618-52263-7.
- ↑ Williams, Raymond. Keywords, "Culture"
- ↑ [[:en:Raymond Williams|]] (1976) en:Keywords: A Vocabulary of Culture and Society. Rev. Ed. (NewYork: Oxford UP, 1983), pp. 87-93 and 236-8.
- ↑ John Berger, Peter Smith Pub. Inc., (1971) Ways of Seeing
- ↑ Tylor, E.B. 1874. Primitive culture: researches into the development of mythology, philosophy, religion, art, and custom.
- ↑ UNESCO. 2002. [1] Universal Declaration on Cultural Diversity.
- ↑ Culture: A Critical Review of Concepts and Definitions అనే Kroeber, A. L. and C. Kluckhohn, 1952. Culture: A Critical Review of Concepts and Definitions.
బయటి లింకులు సవరించు
- Define Culture A compilation of over 100+ user submitted definitions of culture from around the globe.
- Centre for Intercultural Learning
- Detailed article on defining culture
- Dictionary of the History of Ideas "culture" and "civilization" in modern times
- Global Culture Essays on global issues and their impact on culture
- Reflections on the Politics of Culture by Michael Parenti
- What is Culture? - Washington State University