ఎయిర్ క్రాప్ట్ మ్యూజియం (విశాఖపట్నం)

విశాఖపట్నంలోని మ్యూజియం

ఎయిర్ క్రాప్ట్ మ్యూజియం, విశాఖపట్నంలో ఉంది. దీనిని టియు-142 విమాన మ్యూజియం అని కూడా అంటారు. ఇందులో టుపోలెవ్ టు 142 విమానం భద్రపర్చబడి ఉంది. వైజాగ్ నగర పర్యాటక ప్రచారంలో భాగంగా టియు -142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియానికి 2017, అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు[1] శంకుస్థాపన చేశాడు. 2017, డిసెంబరులో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధికారికంగా ప్రారంభించాడు.[2]

ఎయిర్ క్రాప్ట్ మ్యూజియం
స్థాపితండిసెంబరు 8, 2017 (2017-12-08)
ప్రదేశంపాండురంగపురం, విశాఖపట్నం
భౌగోళికాంశాలు17°43′05″N 83°19′47″E / 17.718002°N 83.329812°E / 17.718002; 83.329812
రకంఏవియేషన్ మ్యూజియం, ట్రాన్ స్పోర్ట్ మ్యూజియం
ఓనర్విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ
 
ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ముందు లవ్ వైజాగ్

భారత నావికా దళంలో 29 సంవత్సరాలపాటు పనిచేసిన ఈ విమానం 2017, మార్చి 29న అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలిలో విరమణ చేయబడింది. ప్రమాదం ఎరగని ఈ విమానం విరమణ సమయానికి 30,000 గంటలు ఎగిరినదై ఉంది.[3]

ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం

మార్చు

ఈ విమానాన్ని మ్యూజియంలో భద్రపరచాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాదాపు 14 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిధులు సమకూర్చింది.[4]

మూలాలు

మార్చు
  1. Sarma, Ch RS. "Vizag gets aircraft museum". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2020-04-14.
  2. "TU 142 Aircraft Museum inaugurated". 8 December 2017 – via www.thehindu.com.
  3. "TU 142M Aircraft Museum at Visakhapatnam". Indian Navy. Retrieved 2018-10-30.
  4. "President to open Aircraft Museum today". The Hans India.