ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా భారతదేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థ. దీని చట్టసభలలో 175 శాసనసభ్యులు ఐదు సంవత్సరాల పదవికాలంతో ప్రజలచే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు, వివిధ శాసనమండలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే 58 మంది శాససమండలి సభ్యులు వుంటారు.[2] ఈ ప్రభుత్వానికి రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలకు బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ముఖ్యమంత్రి,మంత్రివర్గం చేతిలో చట్టాలు చేసే అధికారం వుంటుంది. శాసనవ్యవస్థతో పాటు శాసనాల అమలుకు కార్యనిర్వాహకవ్యవస్థ, హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ వున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Emblem of Andhra Pradesh.svg
పరిపాలన కేంద్రంవిశాఖపట్నం
చట్ట వ్యవస్థ
శాసనసభ
సభాపతితమ్మినేని సీతారాం
శాసనసభ్యుల సంఖ్య175
శాసనమండలిఆంధ్రప్రదేశ్ శాసనమండలి
అధ్యక్షుడుకొయ్యే మోషేన్‌రాజు
ఉప అధ్యక్షుడుజకియా ఖానమ్
శాసనమండలి సభ్యులసంఖ్య58
కార్యనిర్వహణ వ్యవస్థ
గవర్నర్సయద్ అబ్దుల్ నశీద్
ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
ఉపముఖ్యమంత్రులు
ప్రధాన కార్యదర్శిసమీర్ శర్మ, IAS[1]
న్యాయవ్యవస్థ
ఉన్నత న్యాయస్థానంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
ప్రధాన న్యాయమూర్తిప్రశాంత్ కుమార్ మిశ్రా
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం

కార్య నిర్వహణసవరించు

గవర్నర్సవరించు

2023 ఫిబ్రవరి 12న బిశ్వభూషణ్ హరిచందన్ [3]స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి నియమించారు.[4]

ముఖ్యమంత్రిసవరించు

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, 2019 మే 30 న నవ్యాంధ్ర రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రి కార్యాలయం [5] ముఖ్యమంత్రి కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.

మంత్రివర్గంసవరించు

ప్రధాన వ్యాసం:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసవరించు

  • జవహర్ రెడ్డి

డి. జి.పిసవరించు

ప్రభుత్వ శాఖలుసవరించు

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు 30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు ఉన్నాయి.

జిల్లా స్ధాయి పరిపాలనసవరించు

జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్ర స్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుంటారు.[6]

రాజ పత్రంసవరించు

శాసనాలు వెబ్ సైట్ [7] లో లభ్యం.

ప్రభుత్వ ఆదేశాలుసవరించు

రహస్యం కానివి ప్రభుత్వ ఆదేశాలు జాలంలో అందుబాటులో వున్నాయి.[8]

డిజిటల్ సేవలుసవరించు

2001 లో ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి ఏర్పడింది. As of 2021, దీనిని అన్ని ప్రభుత్వ డిజిటల్ సేవల కొరకు విస్తరించి మైఎపి (myap) అనే జాలస్థలి (గవాక్షం) ఏర్పడింది.[9]

చట్ట సభలుసవరించు

శాసనసభసవరించు

చూడండి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)

శాసనమండలిసవరించు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి [10] 2007 మార్చి 30 న పునరుద్ధరించబడింది.

న్యాయవ్యవస్థసవరించు

అమరావతిలో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభించబడింది. దీనికి ప్రతి జిల్లాలో పౌర, నేర వివాదాల న్యాయస్థానాలు వున్నాయి.[11] హైకోర్టు తీర్పులు అంగీకరించని కక్షిదారులు భారత సుప్రీమ్ కోర్టులో వివాదం కొనసాగించవచ్చు.

ప్రధాన న్యాయమూర్తిసవరించు

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Adityanath Das to be next Chief Secretary of Andhra Pradesh". @businessline. 23 December 2020. Retrieved 9 January 2021.
  2. "AP State portal". Archived from the original on 2017-08-03. Retrieved 2018-09-12.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-16. Retrieved 2019-07-16.
  4. "Retired SC Judge S. Abdul Nazeer Made Andhra Pradesh Governor, Had Delivered Ayodhya Temple Judgment". The Wire. Retrieved 2023-03-20.
  5. "ముఖ్యమంత్రి కార్యాలయము". Archived from the original on 2020-10-22. Retrieved 2021-04-11.
  6. "జిల్లాకలెక్టర్ల వివరాలు". Archived from the original on 2020-10-22. Retrieved 2021-04-11.
  7. "రాజపత్రము (గెజెట్) జాలస్థలమ". CGG. Retrieved 2021-09-08.
  8. "ప్రభుత్వ ఆదేశాలు జాలస్థలము". Retrieved 2021-01-24.
  9. "myAP: ONE PORTAL for all Government SERVICES (AP)". e-pragati. Retrieved 2021-01-24.
  10. "శాసనమండలి". Archived from the original on 2012-11-04. Retrieved 2010-10-03.
  11. "Judicial Directory". Retrieved 9 January 2012.
  12. Deccan Chronicle (9 October 2021). "Prashant Kumar Mishra is new Chief Justice of AP High Court" (in ఇంగ్లీష్). Archived from the original on 11 అక్టోబరు 2021. Retrieved 11 October 2021.