ఎరెబుని సంగ్రహాలయం (అర్మేనియన్:Էրեբունի թանգարան) 1968 వ సంవత్సరంలో ఏర్పడింది. ఈ సంగ్రహాలయాన్ని యెరెవాన్ యొక్క 1750వ వార్షికోత్సవాన్న ప్రారంభించాలనుకున్నరు. ఈ సంగ్రహాలయం అరిన్ బెర్డ్ పర్వతం క్రింద ఉంటుంది, అదే పర్వతంపైన రెర్బుని ఉరేర్షియన్ కోట క్రీ.పూ. 782 నుండి ఉంది. ఈ కోటను త్రవ్వి, కొన్ని నిర్మాణభాగాలను రీన్ఫోర్స్ చేసి దానిని ఒక బహిరంగ సంగ్రహాలయంగా మార్చారు.

ఎరెబుని సంగ్రహాలయం
Էրեբունի թանգարան
2014 Erywań, Erebuni, Muzeum Erebuni, Budynek muzeum (02).jpg
స్థాపితం1968
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
రకంచారిత్రక సంగ్రహాలయం
పురావస్తు సంగ్రహాలయం
సేకరణ పరిమాణం12,235
వెబ్‌సైటుofficial website

ఒక కునీఫార్ం ప్రకారం ఈ నగరాన్ని యురార్టాకు చెందిన అర్గిష్టి 1 చక్రవర్తి క్రీ.పూ. 782 వ సంవత్సరంలో నిర్మించారు. కోటలోని ఎక్కువ భాగాన్ని ఇటుక రాళ్ళతో నిర్మించారు. ఈ కోటను చుట్టుకొని ద్వారా బలమైన గోడలు ఉన్నవి, కొన్ని ప్రదేశాల్లో వాటిని మూడు వరుసలుగా నిర్మించారు. ఖల్ది అనే దేవుని యొక్క గుడి ఇక్కడున్నటివంటి ఒక ముఖ్యమైన ప్రదేశం. ఆలయ గోడలను ఎన్నో ఫ్రెస్కోలతో అలంకరించారు. పురావస్తు పరిశోధనా శాఖ అధికారులు ఇక్కడ ఎన్నో పెద్ద కరాసులను (మధ్యాన్ని నిల్వచేసే మైదానాలను) భూగర్భంలో కనుగొన్నారు. సెరామిక్స్, కుమ్మరుల యొక్క చక్రాలు మరియు రోజువారీ జీవితంలో వారు ఉపయోగించే ఇతర వస్తువులను కూడా త్రవ్వకాల సమయంలో కనుగొన్నారు. ఇక్కడ అనేక రకములైన కళాఖండాలు, సప్స్, జాడిలు, కాంస్య కంకణాలు, గాజు, గోమేధికం పూసలు మరియు అనేక ఇతర వస్తువులు ఈ కోటలోని నివాసితుల యొక్క అభిరుచులను మరియు అలవాట్లు తెలియజేస్తున్నయి. 12,235 వస్తువులను ప్రదర్శించే సంగ్రహాలయ భవనాన్ని ఆర్కిటెక్టులు బఘ్దశార్, ష్మవన్ మరియు శిల్పి ఎ.హరుతునియన్ డిజైన్ చేశారు. ఈ సంగ్రహాలయనికి షెంగావిత్ మరియు కర్మిర్ లలో 5,288 మరియు 1,620 ప్రదర్శనలతో రెండు శాఖలు ఉన్నవి.

ఈ సంగ్రహాలయానికి గాగిక్ గ్యుర్జ్యాన్ డైరెక్టరుగా 2009 వ సంవత్సరం నుండి పనిచేస్తున్నారు.

గ్యాలరీసవరించు

బాహ్య లింకులుసవరించు