ఎర్రోళ్ల శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా పని చేశాడు. ఎర్రోళ్ల శ్రీనివాస్ న తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా 15 డిసెంబర్ 2021న నియమితుడయ్యాడు.

ఎర్రోళ్ల శ్రీనివాస్‌
ఎర్రోళ్ల శ్రీనివాస్


తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 డిసెంబర్ 15 - 07 డిసెంబర్ 2023[1]

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 నుండి 2021

వ్యక్తిగత వివరాలు

జననం 5 మే
గంగాపూర్
చిన్న కోడూరు మండలం
సిద్దిపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం
భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ
మతం హిందూ మతము

జననం, విద్యాభాస్యం మార్చు

ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం, గంగాపూర్ గ్రామంలో మే 5న జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయ‌కుడిగా కీలకంగా పని చేశాడు. ఆయన 2001లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ విద్యార్థి విభాగం తొలి అధ్యక్షుడిగా నియమితుడై, 2003లో ఓయూ ఆర్ట్స్ కళాశాల టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా, 2004లో జంటనగరాల టీఆర్‌ఎస్వీ విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2005-07 వరకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2007-2010 వరకు టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా, టిఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా 4 జనవరి 2018న నియమితుడయ్యాడు.[2][3] ఆయన తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌గా 15 డిసెంబర్ 2021న నియమితుడై,[4] 22 డిసెంబర్ 2021న భాద్యతలు చేపట్టాడు.[5][6]

మూలాలు మార్చు

  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. HMTV (4 January 2018). "తెలంగాణ ఎస్సీ-ఎస్టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా ఎర్రోళ్ల". Archived from the original on 4 August 2020. Retrieved 14 November 2021.
  3. Deccan Chronicle (3 January 2018). "K Chandrasekhar Rao picks aide from OU for SC, ST panel" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
  4. Namasthe Telangana (15 December 2021). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ". Archived from the original on 15 December 2021. Retrieved 15 December 2021.
  5. Eenadu (22 December 2021). "ముగ్గురు చైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  6. HMTV (22 December 2021). "తెలంగాణ మెడికల్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.