తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది రాజ్యాంగం పరిధిలో ఎస్సీ, ఎస్టీ కులాలకు నిర్దేశించిన రక్షణ చర్యలను పర్యవేక్షిస్తుంది.[1]
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఒక ఛైర్మన్, 5 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సభ్యులందరూ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కృషి చేసేవారై ఉండాలి. సభ్యులు, ఛైర్మన్ పదవీకాలం 3 సంవత్సరాలు.
అధికారాలు - విధులు
మార్చు- రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కల్పించిన సదుపాయాలు, అమలు జరుగుతున్న తీరును విచారించి, నివేదికను గవర్నర్ కు సమర్పిస్తుంది. ఈ నివేదికను గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.
- ఎస్సీ, ఎస్టీ కమిషన్కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
- కమిషన్ సమక్షంలో ఉండే ఏదైనా ప్రొసీడింగ్ను ఐపీసీ ప్రకారం జ్యుడీషియల్ ప్రొసీడింగ్ భావించాలి.
- వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.
కమిషన్ సభ్యులు
మార్చుమొదటి కమిషన్
మార్చు- చైర్మన్: ఎర్రోళ్ల శ్రీనివాస్ (ఎస్సీ మాల, మెదక్)
- సభ్యులు: బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా), ఎం. రాంబాల్ నాయక్ (ఎస్టీ లంబాడా, రంగారెడ్డి జిల్లా), కుర్సం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్ జిల్లా), సుంకపాక దేవయ్య (హైదరాబాద్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా) [2]
రెండవ కమిషన్
మార్చు- చైర్మన్: బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్)
- సభ్యులు: కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ, నల్లగొండ), రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్) [3]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (22 September 2023). "ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా వెంకటయ్య". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
- ↑ Sakshi (2 January 2018). "తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.
- ↑ Eenadu (21 September 2023). "తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.