ఎలిజబెత్ బ్లాక్‌వెల్

ఎలిజబెత్ బ్లాక్‌వెల్ ( 1821 ఫిబ్రవరి 3 – 1910 మే 31) అమెరికా తొలి మహిళా వైద్యురాలు. అమెరికాలో మెడికల్ డిగ్రీ పొందిన వ్యక్తి. ఆమె అమెరికా, బ్రిటన్ లలో సామాజిక కార్యకర్త. ఆమె సోదరి ఎమిలి బ్లాక్‌వెల్ అమెరికాలో మెడిసన్ డిగ్రీ పొందిన మూడవ మహిళ.

ఎలిజబెత్ బ్లాక్‌వెల్, M.D.
జననం(1821-02-03)1821 ఫిబ్రవరి 3
మరణం1910 మే 31(1910-05-31) (వయసు 89)
Hastings, Sussex, England, UK
జాతీయతబ్రిటిష్
పౌరసత్వంBritish and American
విద్యాసంస్థGeneva Medical College
వృత్తి

సాంఘిక అవగాహన, నైతిక సంస్కర్తగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ రెండింటిలో బ్లాక్‌వెల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వైద్యంలో మహిళలకు విద్యను ప్రోత్సహించడంలో ఆమె ముందుంది. ఆమె చేసిన సేవలకు గాను వైద్యంలో మహిళల అభివృద్ధికి విశేష కృషి చేసిన స్త్రీకి ఏటా ఎలిజబెత్ బ్లాక్‌వెల్ పతకం ప్రదానం చేస్తారు.[1] బ్లాక్‌వెల్ మొదట్లో వైద్య వృత్తిపై ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ఆమె పాఠశాల ఉపాధ్యాయుడు బోధనోపకరణంగా ఉపయోగించడానికి ఎద్దుల కన్ను తీసుకువచ్చిన తరువాత ఆమె ఆసక్తి చూపలేదు.[1] అందువల్ల, ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి పాఠశాల ఉపాధ్యాయురాలిగా మారింది. ఈ వృత్తి 1800 లలో మహిళలకు అనువైనదిగా భావించబడింది. అయినప్పటికీ, త్వరలోనే అది ఆమెకు అనుచితమైనదని గుర్తింపు తెచ్చింది. ఆమె స్నేహితురాలు అనారోగ్యానికి గురైనప్పుడు ఒక వైద్యురాలు ఆమెను చూసుకుంటే ఆమెకు ఉపశమనం కలుగుతుందనే వ్యాఖ్యతో బ్లాక్‌వెల్‌కు వైద్య వృత్తి పట్ల ఆసక్తి ఏర్పడింది.[1] బ్లాక్‌వెల్ వైద్య పాఠశాలలకు దరఖాస్తు చేయడం ప్రారంభించింది. లింగ వివక్ష కారణంగా ఏ పాఠశాలలో చేరలేక పోయింది. కానీ జెనీవా మెడికల్ కళాశాల విద్యార్థులు స్వాగతించారు.[2] 1847 లో, ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వైద్య పాఠశాలలో చేరిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆమె పట్టభద్రుడైన కొద్దికాలానికే, యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక మహిళా విద్యార్థి ప్రచురించిన మొదటి వైద్య వ్యాసంగా "టైఫాయిడ్ జ్వరం" పై వ్యాసిన పరిశోధనా వ్యాసం 1849 లో బఫెలో మెడికల్ జర్నల్ లో ప్రచురితమైంది.

ప్రారంభ జీవితం

మార్చు

బాల్యం , కుటుంబం

మార్చు

ఎలిజబెత్ ఇంగ్లాండు లోని బ్రిస్టోల్ లోని డిక్సన్ వీధిలో శామ్యూల్ బ్లాక్‌వెల్, హన్నా బ్లాక్‌వెల్ దంపతులకు జన్మించింది.[3] ఆమె సహోదరులలో అన్న, మారియన్ లు తనకంటే పెద్దవారు. ఆరుగురు చిన్నవారు ఉన్నారు. వారిలో సామ్యూల్, హెన్రీ, ఎమిలి బ్లాక్‌వెల్, సరా, జాన్, జార్జిలు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Stevenson, Kiera (2017). Elizabeth Blackwell. Great Neck Publishing.
  2. Krasner, Barbara (2018). "Elizabeth Blackwell: Doctor". Cobblestone. 39: 20 – via EBSCO Collection.
  3. Sahli, Nancy Ann (1982). Elizabeth Blackwell, M.D., (1871–1910): a biography. New York: Arno Press. ISBN 0-405-14106-8.
  4. Blackwell, Elizabeth, and Millicent Garrett Fawcett. Pioneer Work in Opening the Medical Profession to Women. London: J. M. Dent & Sons, 1914. Print.

ఇతర లింకులు

మార్చు