ఎలెక్ట్రోస్టాటిక్స్
ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది భౌతికశాస్త్రమునకు సంబంధించిన ఒక విభాగం, ఇది నిశ్చిలస్థితి వద్ద సంభవించే విద్యుదావేశాలను అధ్యయనం చేస్తుంది. బొచ్చుతో రుద్దబడిన ఒక ప్లాస్టిక్ రాడ్ లేదా పట్టుతో రుద్దబడిన ఒక గాజు రాడ్ చిన్న చిన్న కాగితపు ముక్కలను ఆకర్షిస్తున్నట్లయితే అది ఎలక్ట్రిక్ ఛార్జ్ చేయబడిందని చెప్పవచ్చు. ఈ ఛార్జ్ బొచ్చుతో రుద్దబడిన ప్లాస్టిక్ పై నెగటివ్ ఛార్జీగా నిర్వచించబడుతుంది, సిల్క్ తో రుద్దబడిన గ్లాసుపై పాజిటివ్ ఛార్జీగా నిర్వచించబడుతుంది.
భౌతికశాస్త్రంలో ఎలెక్ట్రోస్టాటిక్స్ అనేది స్థిరమైన లేదా నెమ్మదిగా కదిలే విద్యుత్ ఆవేశాల దృగ్విషయం, దాని లక్షణాలను గురించి వివరిస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్స్ ను తెలుగులో విద్యుత్ స్థితిశాస్త్రము అంటారు. ఎలక్ట్రోస్టాటిక్ దృగ్విషయం అనేది విద్యుత్ ఆవేశాలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపు దానిని బట్టి ఉత్పన్నం అవుతుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ దృగ్విషయం కూలుంబ్ యొక్క నియమములచే (కూలుంబ్ లా) వివరించబడ్డాయి. విద్యుద్విశ్లేషణ ప్రేరిత శక్తులు బలహీనంగా ఉన్నట్టువంటివి కూడా కూలుంబ్ నియమములలో వివరించబడ్డాయి.