లక్ష్మీనారాయణ వైద్యనాథన్ (1942 ఏప్రిల్ 9 – 2007 మే 19) సంగీత దర్శకుడు, గాయకుడు.[1] కర్ణాటక సంగీతంలో నిష్ణాతుడు. తమిళ కన్నడ భాషల్లో సుమారు 170 సినిమాలకుపైగా పని చేశాడు. ఈయన ఆర్. కె. నారాయణ్ రచించిన మాల్గుడి కథల ఆధారంగా దూరదర్శన్ లో ప్రసారమైన మాల్గుడి డేస్ ధారావాహికకు సంగీతం అందించాడు.[2]

ఎల్. వైద్యనాథన్
దస్త్రం:L.VaidyanathanImg.jpg
జననం
లక్ష్మీనారాయణ వైద్యనాథన్

(1942-04-09)1942 ఏప్రిల్ 9
మరణం2007 మే 19(2007-05-19) (వయసు 65)
చెన్నై
వృత్తివయొలిన్ వాయిద్యకారుడు, సంగీత దర్శకుడు
పిల్లలు2
తల్లిదండ్రులువి. లక్ష్మీనారాయణ
సంగీత ప్రస్థానం

జీవిత విశేషాలు

మార్చు

వైద్యనాథన్ చెన్నైలో లక్ష్మీనారాయణ, సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. వీరిద్దరూ పేరొందిన సంగీతజ్ఞులు. వయొలిన్ వాయిద్యంలో పేరు గాంచిన సంగీత ద్వయం ఎల్. శంకర్, ఎల్. సుబ్రమణియం ఈయన తమ్ముళ్ళు. వీరు ముగ్గురూ తండ్రి నుంచి సంగీతంలో శిక్షణ పొందారు.[3]

కెరీర్

మార్చు

ఈయన మొదట్లో జి. కె. వెంకటేష్ దగ్గర సహాయకుడుగా పని చేశాడు. తమిళ కన్నడ భాషల్లో సుమారు 170 సినిమాలకుపైగా పని చేశాడు.

2003 లో తమిళనాడు ప్రభుత్వం ఈయనకు కళైమామణి పురస్కారం ప్రధానం చేసింది.[4]

మూలాలు

మార్చు
  1. "Juries for the selection of films for National Awards set up". Press Information Bureau, Govt of India. Retrieved 2009-07-28.
  2. "Music director L. Vaidyanathan dead". The Hindu. 20 May 2007. Archived from the original on 21 May 2007. Retrieved 2009-07-28.
  3. "We need sweet memories…". The Hindu. 25 May 2007. Archived from the original on 23 September 2007. Retrieved 2009-07-28.
  4. "Kalaimamani awards announced". Frontline. 11 October 2003.