ఎస్.ఏ.పీ. (SAP)

(ఎస్.ఏ.పీ. నుండి దారిమార్పు చెందింది)
sap అరిన చిత్రం

పరిచయం

మార్చు

ఎస్.ఏ.పీ. (ఆంగ్లం: SAP) అనగా సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్. జర్మన్ భాషలో ఇదే Systeme, Anwendungen und Produkte. భారీ, మధ్య తరహా సంస్థలలో సాఫ్ట్ వేర్ అవసరాలను తీర్చే ఒక ఇంటెగ్రేటెడ్ ERP enterprise resource planning. సంస్థల్లోని వివిధ విభాగాల అనుసంధానం SAP ప్రత్యేకత.

ఉచ్ఛారణ

మార్చు

కేవలం S, A, P అయితే "ఎస్ ఏ పీ" అని, వాటి ప్రక్కన మరేదయినా ఉంటే సాప్ అనీ ఉచ్ఛరించాలి. ఉదా: SAP HCM (సాప్ ఎచ్ సీ ఎం)

చరిత్ర

మార్చు

1972వ సంవత్సరంలో IBM పూర్వ ఉద్యోగులైన డీయాత్మార్ హాప్, హాసో ప్లాట్నర్, హన్స్-వెర్నర్ హెక్టర్, క్లాస్ టిశిర, క్లాస్ వెలిన్రైతర్ లచే జర్మనీలో ఎస్.ఏ.పి ప్రారంభించబడింది.

పని తీరు

మార్చు

ఎస్.ఏ.పీ. మాడ్యూల్ ల ప్రకారం పనిచేస్తుంది. ఈ మాడ్యూల్ లు అన్నీ ఒకే డాటాబేసును వినియోగిస్తున్నప్పటికీ వీటిని ఒక్కొక్కటిగా కానీ, కొన్నింటిని కలిపిగానీ కొనవచ్చును, ఇన్స్టాల్ చేసుకుని నడిపించకొనవచ్చును. సంస్థల్లో, ఈ క్రింది విభాగాల కొరకు ఎస్.ఏ.పీ.ని వినియోగించకొనవచ్చును.

  • ఫైనాన్షియల్స్ (SAP ERP Financials)
  • లాజిస్టిక్స్ (SAP ERP Logistics)
  • మానవ వనరులు (ఎస్.ఏ.పీ. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ SAP ERP Human Captial Management)
  • ప్రాజెక్ట్ సిస్టమ్శ్
  • డాక్యుమెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ (DMS)
  • సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (SD)
  • కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ (CRM)
  • ప్రొడక్షన్ ప్లానింగ్ (PP)
  • మెటీరియల్స్ మేనేజ్ మెంట్ (MM)


2005 లో SAP AG SAP ECC 6.0 (SAP Enterprise Central Component) ని విడుదల చేసింది.

బయటి లింకులు

మార్చు