ఎస్.ఏ.పీ. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్

ఎస్.ఏ.పీ.లో ఇది కూడా ఒక మాడ్యూల్. HCM అనగా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్. దీనినే HR (హ్యూమన్ రిసోర్సెస్) అనీ, HRMS (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్) అనీ వ్యవహరిస్తుంటారు.

సంస్థలలోని మానవ వనరుల నిర్వహణలో HR మేనేజర్ కి సమయాన్ని ఆదా చేస్తుంది, శ్రమని తగ్గిస్తుంది, తన పనితీరుకి మరిన్ని మెరుగులు అద్దుతుంది. ఎచ్.సీ.ఎంలో ఈ క్రింది సబ్-మాడ్యూళ్ళు ఉన్నాయి.

కోర్ HR సబ్ మాడ్యూల్ లు

మార్చు

కోర్ మాడ్యూళ్ళు ఆది నుండి ఉన్నాయి. ఇవి అత్యంత ప్రాథమిక మాడ్యూళ్ళు. కాలానుగుణంగా మార్పులు వస్తున్ననూ ట్యాలెంట్ మేనేజ్ మెంట్ మాడ్యూళ్ళలో స్థూలంగా వస్తున్న మార్పులతో పోలిస్తే వీటిలో వచ్చిన మార్పులు తక్కువే.

ఆర్గనైజేషనల్ మేనేజ్ మెంట్

మార్చు

ఉద్యోగం (Job), ఉద్యోగ వివిరణ (Job Description), ఉద్యోగ స్థాయి (Position), బాధ్యతలు (Tasks), విభాగం (Departments), ఉద్యోగ సంబంధాలు(Relationships) మొదలగునవి నిర్ణయించే మాడ్యూలు. వివిధ ప్రణాళికల ప్రకారం సంస్థాగత నిర్మాణం చేసి వాటిలో సంస్థకు ఏది సరిగా సరిపోతుందో పోల్చుకొని ఆ నిర్మాణాన్నే అమలు చేయవచ్చును. ఉత్తమ ఆచరణల (Best Practices) లో భాగంగా ఉద్యోగ సంబంధాలు వ్యక్తుల (Persons) మధ్య కాకుండా Positions మధ్య నెలకొల్పటం జరుగుతుంది. (ఉద్యోగులు మారినా Positions మధ్య సంబంధాలు అలాగే కొనసాగుతాయి.) కార్య ప్రవాహం (Workflow) అనగా సాధారణ/ప్రత్యేక సెలవు దరఖాస్తుల ఆమోద తిరస్కారాలు దీని ఆధారంగానే సాగుతాయి. విభాగాల అధినేతలను (Chief Positions) కూడా ఈ మాడ్యూల్ ద్వారానే నిర్ణయించవచ్చును.

పర్సనల్ అడ్మినిస్ట్రేషన్

మార్చు

ఈ మాడ్యూల్ ఉద్యోగుల యొక్క డేటాబేస్ గా పని చేసుంది. ఉద్యోగి యొక్క సమాచారం కాలమానం ప్రకారం స్టోర్ చేయబడతాయి. ఉదా:

  • వ్యక్తిగత వివరాలు (పేరు, పుట్టిన తేది మొ.)
  • సంస్థాగత వివరాలు (ఎవరు ఏ విభాగంలో, ఏ స్థాయిలో పనిచేస్తున్నారు?)
  • అడ్రసు (తాత్కాలిత, శాశ్వత)
  • కుటుంబ వివరాలు (వివాహం, సంతానం)
  • గత ఉద్యోగాల అనుభవ వివరాలు
  • విద్యార్హతలు

సంస్థలోని ఉద్యోగులు, వారి ఎంప్లాయీ ఐడిలు (Personnel Numbers), ఉద్యోగుల చలనాలు (Employee Movements), ఉద్యోగుల గమనాలు (Hiring, Probation, Transfer, Promotion వంటి Personnel Actions), వారి పనివేళలు (Time Schedules), పనివేళల పైన ఆధారపడిన జీతభత్యాలు (Basic Pay) ఈ మాడ్యూల్ ద్వారా నిర్ణయింపబడతాయి.

భౌగోళిక పరిస్థితులను బట్టి, ఇంకా ఇతర అంశాలను బట్టి Personnel Numbers యొక్క కేటాయింపును చేసుకొనవచ్చును. వీటి సంఖ్య ఎనిమిది అంకెలు గలదై ఉంటుంది. (అంటే Personnel Number యొక్క గరిష్ఠ సంఖ్య 9,99,99,999 అయి ఉండవచ్చును. ఇంత వరకూ ఇంత కంటే ఎక్కువ ఉద్యోగులు గల సంస్థ ఏదీ SAP దృష్టిలో పడలేదు.) Personnel Numbers లో అంకెలు కాక వేరే ఏ అక్షరాలను, SAP అనుమతించదు. అటువంటి సంఖ్యలు ఏవైనా ఉంటే అవి భద్రపరచుకోవటానికి ఇతర టేబుళ్ళు, ఫీల్డులను కేటాయించింది.

రిక్రూట్ మెంట్

మార్చు

సంస్థలోని నియామకాల నిర్వహణకి వినియోగించే మాడ్యూలు. జాబ్ పోర్టల్ లతో అనుసంధానం అవసరం లేనిచో రిక్రూట్ మెంట్ ని వినియోగించుకొనవచ్చును. జాబ్ పోర్టల్ లతో అనుసంధానం కావలసిన (సంస్థ లోని ఉద్యోగాలని జాబ్ పోర్టల్ లో ప్రకటించాల్సిన అవసరం ఉన్న) యెడల ఈ-రిక్రూట్ మెంట్ ని వినియోగించుకొనవచ్చును. ప్రస్తుత కాలాన్ని బట్టి ఈ-రిక్రూట్ మెంట్ కాదని రిక్రూట్ మెంట్ మాడ్యూలు పై మొగ్గు చూపే సంస్థలు తక్కువే.

పర్సనల్ డెవలప్ మెంట్

మార్చు

ఉద్యోగుల పనితనాన్ని నిర్ణయించి దానిని పెంపొందించటానికి దోహద పడే మాడ్యూలు. ఒక ఉద్యోగికి ఉన్న అర్హతలు, నైపుణ్యాలను బట్టి అతని ఉద్యోగ ప్రస్థానం (Career Planning), లేదా ఒక ఉద్యోగానికి కావలసిన అర్హతలు, నైపుణ్యాలను బట్టి ఒక ఉద్యోగిని వెదకటం (Succession Planning) చేయవచ్చును. ఒకవేళ ఉద్యోగి/అభ్యర్థికి అర్హత లేక పోయినా, ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నా, అతడు తీసుకొనవలసిన శిక్షణని నిర్ణయించేటట్లు సిస్టంని రూపొందించవచ్చును.

ట్రైనింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్ మెంట్

మార్చు

ఉద్యోగుల శిక్షణా నిర్వహణకి ఉపయోగ పడే మాడ్యూలు. ఉద్యోగులు ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి వారికి కావలసిన శిక్షణను, ఈ శిక్షణకు కావలసిన వనరులను నిర్ధారించుకొనవచ్చును. SAP FI/CO (Financials and Controlling) తో అనుసంధానం చేసి, శిక్షణకయ్యే ఖర్చులు సిస్టంలో నమోదయ్యేలా చేయవచ్చును. ఉద్యోగులను శిక్షణకు దరఖాస్తు చేసేలా అయితే ట్రైనింగ్ అం డ్ ఈవెంట్ మేనేజ్ మెంట్ ను, ఉద్యోగులు తామే శిక్షణను వెతుక్కొని తమంతట తామే దరఖాస్తు చేసుకొనేలా చేయాలంటే ఈ-లర్నింగ్/ఎల్ ఎస్ ఓ మాడ్యూలు వాడుకొనవచ్చును.

టైం మేనేజ్ మెంట్

మార్చు

పనివేళలని నిర్ణయించే మాడ్యూలు. పని దినాలు, సెలవు దినాలు, విరామాలు వగైరాలు ఈ మాడ్యూలులోనే నిర్ణయిస్తారు. ఒక ఉద్యోగి ఒక రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని విరామాలు ఎంత నిడివితో తీసుకొనవచ్చును, ఓవర్ టైం అనేది ఎలా నిర్ధారించాలి, ఒక వేళ ఓవర్ టైం చేసినట్లయితే ఉద్యోగికి జీతంతో బాటు అదనంగా వేరే భత్యం ఇవ్వాలా, గరిష్ఠంగా ఒక ఉద్యోగి ఎంత ఓవర్ టైం చేయవచ్చును, ఉద్యోగుల షిఫ్ట్ లు, షిఫ్ట్ అలోవెన్స్ లు వంటి వాటిని నిర్ధారించవచ్చును.

పేరోల్

మార్చు

బోనస్ లు, వేజ్ టైప్ లు, మినహాయింపులు నిర్ణయించే మాడ్యూలు. పే-స్లిప్ ని జనరేట్ చేయవచ్చును. ఆయా దేశాలను బట్టి పేరోల్ నడుస్తుంది. అక్కడి స్థానిక చట్టాలకు అనుగుణంగా పేరోల్ రూపొందించబడింది. స్థానిక పేరోల్ SAP లో గనుక లేకపోతే, ఇంటర్నేషనల్ పేరోల్ ను ఉపయోగించి దానిని తదనుగుణంగా మార్చుకొనవచ్చును. (మధ్యప్రాచ్య దేశాలు, భూటాన్, నేపాల్ వంటి చిన్న చిన్న దేశాలకు ఇంటర్నేషనల్ పేరోల్ నే వాడతారు.) స్థానిక పేరోల్ ఉదాహరణలు

  • ఇండియన్ పేరోల్
  • యూ ఎస్ పేరోల్
  • యూ కే పేరోల్
  • జర్మన్ పేరోల్

బెనిఫిట్స్

మార్చు

సంస్థ విధివిధానాలని బట్టి ఉద్యోగులకి వర్తించే బెనిఫిట్ ప్లాన్లను నిర్ణయించవచ్చును. ఉదా: హెల్త్ ప్లాన్స్, సేవింగ్స్ ప్లాన్స్, ఇన్ష్యురెన్స్ ప్లాన్స్. ఈ మాడ్యూల్ ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉపయోగిస్తాయి. భారతదేశంలో ఈ మాడ్యూల్ వినియోగం తక్కువే.

కాంపెన్జేషన్

మార్చు

వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగుల, అత్యల్ప, అత్యధిక పారితోషికాలను రూపొందించవచ్చును. సరి అయిన పారితోషికాల రూపకల్పన ద్వారా, ఉద్యోగులు వేరే సంస్థల వైపు ఆకర్షితులు కాకుండా ఉండే లా చూసొకొనవచ్చును. ఈ మాడ్యూల్ ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉపయోగిస్తాయి. భారతదేశంలో ఈ మాడ్యూల్ వినియోగం తక్కువే.

ట్రావెల్ మేనేజ్ మెంట్

మార్చు

ఉద్యోగుల ప్రయాణాలని, వాటికి కావలసిన టిక్కెట్ బుకింగ్ విధి విధానాలని నిర్ణయించే మాడ్యూలు. ప్రయాణాల తర్వాత అయిన ఖర్చులను ఉద్యోగికి తిరిగి ఇచ్చివేయటం వంటివి నిర్ధారించవచ్చును. సాంకేతికంగా ఇది FI/CO క్రిందకు వచ్చిననూ, విస్తరిస్తోన్న HR పరిధి వలన ఇది HR క్రిందకే వచ్చింది.

ట్యాలెంట్ మ్యానేజ్ మెంట్ మాడ్యూల్ లు

మార్చు

ఆధునిక కాలంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా SAP తన HR మాడ్యూల్ లలో తెచ్చిన మార్పులు ట్యాలెంట్ మ్యానేజ్ మెంట్ మాడ్యూళ్ళకు శ్రీకారం చుట్టినది. నవీన ధోరణులక్ సరిపోయేలా ఈ మాడ్యూళ్ళు రూపుదిద్దబదినవి.

ఈ-రిక్రూట్ మెంట్

మార్చు

రిక్రూట్ మెంట్ లో లాగా ఒక్క ఉద్యోగానికి కొంత మంది అభ్యర్థులనే కాకుండా, ఎన్ని ఉద్యోగాలకైనా ఎంత మంది అభ్యర్థులనైనా పరిగణలోకి తీసుకొనవచ్చును. జాబ్ పోస్టింగులను జాబ్ పోర్టల్ లో కనబడేలా చేసి, అర్హులైన అభ్యర్థులను ఆకర్షించవచ్చును. అభ్యర్థిని సంస్థ యొక్క ఈ-రిక్రూట్మెంట్ పోర్టల్ లో సైన్ అప్ చేసేలా చేయవచ్చును. అభ్యర్థి పోర్టల్ ద్వారా జాబ్ సెర్చ్ చేయవచ్చును. తన రెజ్యుమెను అప్లోడ్ చేయవచ్చును. తనకు సరిపడే ఉద్యోగము ప్రచురించబడినచో, నోటిఫికేషన్ మెయిల్ వచ్చేలా అభ్యర్థి జాబ్ ఏజెంట్ లను సృష్టించుకొనవచ్చును.

వచ్చిన దరఖాస్తులను రిక్రూటర్ లు సిస్టంలోనే క్రోడీకరించుకొనవచ్చును. నియామకాలలో ఉన్న వివిధ దశల ద్వారా అభ్యర్థిని ఎంపిక చేసుకొనవచ్చును. ఈ-రెక్రూట్ మెంట్ లో అభ్యర్థికి ఆన్ లైన్ టెస్టులు పెట్టవచ్చును. అందులో ఉత్తీర్ణులైతేనే అతని అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకొనవచ్చును. రిక్రూట్ మెంట్ లోనూ వెబ్ లింక్ సౌలభ్యము ఉన్ననూ, అది ఈ-రిక్రూట్ మెంట్ అందించినన్ని సౌకర్యాలని అందించదు.

ఇంటర్నెట్ యుగం కావటం మూలాన SAP రిక్రూట్ మెంట్ కు బదులుగా ఈ-రెక్రూట్ మెంట్ నే సిఫారసు చేస్తోంది.

(ఆబ్జెక్టివ్ సెట్టింగ్స్, అప్రైజల్స్, క్యారీర్/సక్సెషన్, డెవలప్ మెంట్ ప్లానింగ్)

మార్చు

పనితీరు ముదింఫు నిర్ధారించే మాడ్యూలు. అప్రైజల్ డాక్యుమెంట్లు సృష్టించవచ్చును. ఉద్యోగుల గమ్యాలను నిర్దేశించి వాటిని వారు ఎంతవరకు చేరుకోగలిగారో తెలుసుకోవచ్చును. అప్రైజల్ లను పోర్టల్ తో అనుసంధానం చేయవచ్చును.

LSO (ఎల్.ఎస్.ఓ - లర్నింగ్ సొల్యూషన్స్)

మార్చు

ప్రస్తుత కాలంలో ఉద్యోగులు పోర్టల్ ద్వారానే కార్య కలాపాలను చేయటానికి మొగ్గు చూపుతుండటంతో, లర్నింగ్ సొల్యూషన్స్ లో SAP ట్రైనింగ్ అండ్ ఈవెంట్ మ్యానేజ్ మెంట్ తో ఈ అనుసంధానానిని ప్రవేశ పెట్టింది. శిక్షణ జరిగే వేదిక, కావలసిన వనరులు, హాజరు అవ్వబోయే ఉద్యోగులు, వీటన్నిటికీ అయ్యే ఖర్చు మొదలగునవి నిర్వహించవచ్చును. ఉద్యోగులు శిక్షణ కై పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చును. ఉన్నతాధికారి ఈ దరఖాస్తును ఆమోదించవచ్చును/తిరస్కరించవచ్చును. శిక్షణ పొందిన తర్వాత అర్హత ఏ స్థాయి వరకు సంపాదించారో నిర్ణయించవచ్చును. శిక్షణకు అయిన ఖర్చులను, అభ్యర్థులవారీగా కానీ, శిక్షణా తరగతుల వారీగా కానీ, కొన్ని అలా, కొన్ని ఇలాగా కానీ నమోదు చేయవచ్చును.

ఈ-కాంపెన్జేషన్

మార్చు

పోర్టల్ తో అనుసంధింప బడ్డ కాంపెన్జేషన్ మాడ్యూలు. స్టాక్ లలో ఉద్యోగులకు షేర్ లు ఇవ్వటం, వాటిని క్యాష్ గా ఉద్యోగులు ఎప్పుడు మార్చుకోగలరో నిర్ధారణ చేసే మాడ్యూలు. భారతదేశంలో దీని వినియోగం తక్కువే.

ESS/MSS (ఈ.ఎస్.ఎస్/ఎమ్.ఎస్.ఎస్ - ఎంప్లాయీ సెల్ఫ్-సర్వీస్/మేనేజర్ సెల్ఫ్-సర్వీస్)

మార్చు

కార్యాలయంలో ఉద్యోగులు/మేనేజర్ లు తమ కార్యకలాపాలని చేసుకోవటానికి ESS/MSS ఉపయోగిస్తారు. ఉదా: ఉద్యోగి సెలవులకి/శిక్షణా తరగతులకి ESS ద్వారా దరఖాస్తు చేసుకొంటే, మేనేజర్ లు వాటిని MSS ద్వారా సమ్మతించవచ్చును/తిరస్కరించవచ్చును.

ఇవి కూడా చూడండి

మార్చు