ఎస్.కె. జహంగీర్ (ఆంగ్లం:S.K.Jahangeer) తెలుగు సినిమా వర్ధమాన గీత రచయిత, సినీ దర్శకుడు. పుస్తక రచయిత[1][2][3]

S.K.Jahangeer
ఎస్.కె. జహంగీర్
Jahangeer writer
స్థానిక పేరుఎస్.కె.జహంగీర్
జననంకందుకూరు
నివాస ప్రాంతంకందుకూరు: గ్రామము

ఒంగోలు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  India ఇండియా.
తల్లిదండ్రులుషేక్ నజీర్ బాషా, రమీజ

బాల్యం, విద్య మార్చు

ఎస్.కె. జహంగీర్ ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు జిల్లా మధ్యతరగతి కుటుంబమైన ఎపిఎస్ ఆర్ టిసి డ్రైవర్ షేక్ నజీర్ బాషా, రమీజల మొదటి సంతానం, కందుకూరులో జన్మించాడు. తెలుగు భాష - సాహిత్యం, ఆంగ్ల భాష - సాహిత్యంలోనూ డబుల్ ఎం.ఏ చేసిన ఈ ఫిలిం మేకర్ తెలుగు సాహిత్యంపై మమకారంతో తెలుగు పండిత్ ట్రైనింగ్ కూడా పూర్తిచేసి జర్నలిజం స్పెషలైజేషన్ కూడా పూర్తి చేశాడు.

రచనలు, డాక్యుమెంటరీలు మార్చు

నాటకాలు మార్చు

  • యాంబిషన్
  • థాట్

నాటికలు

  • మేరీ జమీన్

బాలల నాటికలు

  • జై జవాన్
  • బడి
  • సామాన్యుడు

కథలు

  • జాస్మిన్
  • మట్టిమనిషి
  • ఆకాశమంత జ్ఞాపకం
  • ఐ యామ్ ఇన్నోసెంట్[4]

మ్యాగజైన్స్ సీరియల్స్

  • మెహందీ కథలు

కవితా సంపుటాలు

  • భూమిక[5]
  • రంగుల కళలు[6]
  • ప్రస్థానం[7]

దీర్ఘ కవితలు మార్చు

  • అమ్మ చెప్పిన కధలు దీర్ఘ కవిత
  • అసోసియేట్ ఎడిటర్ గా విశ్వనగరి అమరావతిపై ప్రత్యేక సాహితీ సంచిక
  • సాహిత్య మాస పత్రికలో  అనేక కవితలు ప్రచురణ
  • ప్రింట్, డిజిటల్ మీడియాల్లో ఆర్టికల్స్, ఫీచర్స్ ప్రచురణ
  • ప్రింట్ డిజిటల్ మాధ్యమాలలో అనేక కవితలు ప్రచురణ.[8]

షార్ట్ ఫిల్మ్స్ మార్చు

  • లక్ష్యం
  • ఫర్జ్
  • మార్పు మొదలైంది
  • మై డ్రీమ్ కం ట్రూ
  • బీ ద రియల్ విమెన్
  • మేక్ ఓవర్

డాక్యుమెంటరీస్

  • జయ జయ జయహే
  • తెలుగు రమణీయం
  • తెలుగు వైభవం
  • కహానీ ( హిందీ డాక్యుమెంటరి )
తెలుగు ఫీచర్ ఫిల్మ్ మార్చు
  • జైత్ర యాత్ర.[9]
  • వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పాదయాత్ర సందర్బంగా రూపొందించిన ప్రత్యేక  గీతాలు రాజన్న, లీడర్
  • టిడిపి నాయకురాలు గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష కోసం రాసిన ప్రత్యేక గీతం కదిలింది. కదిలింది ఒక పాదం కదిలింది గీతం.

రచనల్లోని కొన్ని ప్రధాన మూల అంశాలు

  • ఇంజనీరింగ్ కాలేజీ లో జరుగుతున్న మితిమీరిన ర్యాగింగ్అంశాన్ని ఆధారం గా చేసుకుని యాంబిషన్ ప్రయోగాత్మక నాటకాన్ని 2002లో ఎస్ఆర్ నంది ఎక్స్పర్మెంటరీ డ్రామా కాంపిటేషన్లో ప్రదర్శించాడు. ఇది చూసిన న్యాయ నిర్ణేతలు మంచి రచయితగా గుర్తింపునిచ్చారు.
  • ర్యాంకుల కోసం కార్పొరేట్ కళాశాలలు పడుతున్న తాపత్రయం, ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలపై థాట్ ప్రయోగాత్మక నాటకాన్ని రూపొందించి జిల్లా స్వర్ణోత్సవాలలో ప్రద ర్శించాడు.
  • ఒక తండ్రి, తల్లి, ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యా యుడు అవినీతి పైన పోరాటం చేస్తే ఆ మాటనేదే ఉండదు అనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటను ఆదర్శంగా తీసుకుని 2004లో రూపొందించిన 'జై జవాన్' నాటిక కు రాష్ట్ర ప్రదర్శించి పురస్కారాన్ని ఇచ్చారు.
  • మాతృభాషలో విద్యాబోధన చేయడంపై 2005లో రూపొందించిన 'బడి' అనే నాటిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియం నాంపల్లి, హైదరాబాద్ లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది
  • జహంగీర్ ఒక రోజు ట్రైన్లో విజయవాడ వెళ్తున్నాడు. గుంటూరు దాటగానే పంట పొలాలను ధ్వంసం చేస్తున్న దృశ్యం కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే.. రాజధాని పేరిట ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవతంగా లాగేసుకున్నారని పంట భూములు కోల్పో యిన రైతులు పడే ఆవేదనపై ' మట్టి మనిషి అనే కథనం రచించాడు. పంట భూములతో రైతుల అనుబంధాన్ని, భూములు కోల్పోయాక వారి కన్నీటి గాథను కళ్లకు కట్టినట్లు వివరించాడు.
  • హైదరాబాద్ లో చాయ్ తాగడానికి వెళ్లి ఉగ్రవాదుల బాంబు పేలుళ్లలో తీవ్రగాయాలపాలై మంచనపడ్డాడు ఓ కుర్రాడు. ఎక్కడ నుంచో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిన ఓ వ్యక్తి ఉగ్ర దాడుల్లో మృత్యువాత పడ్డాడు. 'అసలు ఉగ్రవాదులు ఎందుకు దాడి చేస్తున్నారు. దానికి మాకు ఏంటి సంబంధం' అని ప్రశ్నించే అమాయక ప్రజల భావాలను 'ఐ యామ్ ఇన్నోసెంట్' పేరుతో కథగా మలిచాడు.
  • పాత బస్తీలో డబ్బు కోసం అమ్మాయిలను 60-70 ఏళ్ల వృద్ధులకు ఇచ్చి వివాహం చేయడం. ఆ తర్వాత అమ్మాయిలు పడే నరకం. పాతబస్తీలో అమ్మాయిలపై జరుగుతున్న అక్రమాలు, అమ్మాయిలనుఎందుకు అమ్ముకుంటున్నారు. వారి స్థితిగతులేమిటనే విషయాలను మూలాధారంగా చేసుకని 'మెహందీ' కథలు అనే మ్యాగజైన్ సీరియల్ ను పాఠకుల ముందుంచాడు.[10]
  • భూమిక విమెన్ ఒరిజినల్ పోయెట్రిస్ లోని కవితల ద్వారా మహిళల్లో ధైర్యాన్ని, పోరాట స్పూర్తిని రగిలించారు. నేటి మహిళల కవిత్వం ద్వారా మహిళలు మన సమాజంలో ఎలా భాగమై ఉన్నారో వివరిస్తూ సమాజం మహిళలకు అండగా నిలవాల్సిన బాధ్యతను అద్బుతంగా వివరించాడు. గృహిణిగా మహిళలు చేస్తున్న శ్రమ అనిర్వచనం అయినప్పటికీ సమాజంలో వారికి విలువ, గౌరవం, దొరకడం లేదు. ఈ నేపథ్యంలో 'భూమిక' కవితల ద్వారా స్త్రీల విలువ, వారికివ్వాల్సిన గౌరవాన్ని తెలియజేశాడు.
  • తెలుగు పోయెట్రీ డాక్యుమెంటరీకి గుర్తింపు 2012లో తిరుపతిలోని వెటర్నరీ యూనివర్శిటీలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా సభల్లో జహంగీర్ రూపొందించి, ప్రదర్శించిన తెలుగు రమణీయం అనే డ్యాక్యుమెంటరీని మలేషియా తెలుగు సంఘం దక్కించుకుని ప్రత్యేకంగా ఆదరించింది. 37 సంవత్సరాల తర్వాత నిర్వహించిన తెలుగు మహాసభలపై డ్యాక్యుమెంటరీని మలేషియా తెలుగు సంఘం డీ.వీ.డీ.ల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలకు ఉచితంగా పంపిణీ చేసింది.[11]
  • మనిషి జీవితంలోని ఎమోషనల్ సంఘటనలపై ప్రస్థానం కవిత్వం , నిజమైన సెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ని సృశిస్తుంది
  • రంగస్థలంలోని ఒక నటుడు సక్సెస్ సాధించేవరకు జరిగే ఆటుపోట్ల పై రంగుల కళలు కవిత్వం తన పంథాను కొనసాగిస్తుంది.
  • సమాజమే అతని ముడిసరుకు, సమాజంలోని రుగ్మతలే అతని సాహితీ వస్తువులు, మానవతా[12]వాదం అతని కవితా బలం.

ప్రత్యేక గుర్తింపు మార్చు

  • ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ కోసం యువవాణి  ప్రోగ్రామ్ లో ప్రత్యేక గెస్ట్  ఇంటర్వ్యూ ద్వారా  గుర్తింపు.
  • ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ కృష్ణవేణి రైయిన్ బో ఎఫ్.ఎమ్  ఛానల్ 102.2లో గెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రత్యేక గుర్తింపు.[13]

పురస్కారాలు మార్చు

  • 2006 వ సంవత్సరం లో గర్ల్ చైల్డ్ అంశం మీద ప్రసారభారతి - యూనిసెఫ్ నిర్వహించిన జాతీయస్థాయి చిత్రోత్సవాలలో లక్ష్యం లఘు చిత్రం మూడవ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని పొందినది. 2006 వ సంవత్సరం లో భారత రాష్ట్రపతి నుంచి బ్రేవ్ గర్ల్ అవార్డు పొందిన బాలిక నుంచి అవార్డు అందుకున్నాడు.[14]
  • 2006 సంవత్సరంలో డిజిటల్ ఫోరమ్స్ ఫర్ ఇండియా నిర్వహించిన చిత్రోత్సవాలలో లక్ష్యం లఘు చిత్రం ఉత్తమ జ్యూరీ చిత్ర పురస్కారాన్ని పొందినది. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వి.వి సత్యనారాయణ నుంచి అవార్డు అందుకున్నాడు.[15]
  • 2006 సంవత్సరంలో లక్ష్యం లఘు చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేక మెమోంటోని బహుకరించింది .
  • 2007 సంవత్సరంలో హైదరాబాద్ లో నిర్వహించిన అంతర్జాతీయ చిత్రోత్సవాలకు లక్ష్యం లఘు చిత్రం ఎంపికై విమర్శకుల ప్రశంసలు పొంది విశేష ఆదరణ పొందింది. దీనిని ఓ ప్రముఖ టీవీ ఛానల్ ప్రత్యేకం గా ప్రసారం చేసింది .
  • కొన్ని జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాలకు లక్ష్యం లఘు చిత్రం ప్రదర్శనలకు ఎంపికైంది.
  • 2007 సంవత్సరం లో గర్ల్ చైల్డ్ అంశం మీద ప్రసారభారతి - యూనిసెఫ్ నిర్వహించిన జాతీయస్థాయి చిత్రోత్సవాలలో ఫర్జ్ లఘు చిత్రం మూడవ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని పొందినది అప్పటి ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నుంచి అవార్డు అందుకున్నాడు.[16]
  • 2017 సంవత్సరంలో స్వచ్ఛ్ భారత్ మీద రూపొందించిన మార్పు మొదలైంది. లఘు చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రం గా పురస్కారాన్ని పొందినది అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు నుంచి అవార్డు అందుకున్నాడు.[17]
  • 2005వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఉత్తమ రచయితగా ఇంచార్జ్ కలెక్టర్ అప్పటి డీ.ఆర్.డీ.ఏ పీడీ రామారావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు[18]
  • ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని సాహితి సంస్థల నుంచి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాలను వివిధ విశిష్ఠ వ్యక్తుల నుంచి స్వీకరణ జరిగింది.
  • 2017 సంవత్సరంలో రూడ్ సెటి నుంచి ఎమర్జింగ్ ఎంటర్ ప్రైనీర్ గా పురస్కారం అవార్డు అందుకున్నాడు.[19]

మూలాలు మార్చు

  1. "Bhoomika cover Page.pdf". Google Docs. Retrieved 2021-07-18.
  2. "AMARAVATI-CITY-TAB-Amv-Tab-page-1.pdf". Google Docs. Retrieved 2021-07-18.
  3. "మనతోనే మార్పు మొదలవ్వాలి". ఈనాడుపేపర్ లింక్.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "కథానాయకుడు". సాక్షి పేపర్ లో వచ్చిన కథనం.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "భూమిక". భూమిక పుస్తకం.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "రంగుల కలలు". రంగుల కలలు పుస్తకం. కవితా సంపుటి.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Prastanam e-book.pdf". Google Docs. Retrieved 2021-07-18.
  8. "భూమిక". ఒంగోలు రౌండప్ స్టేట్ మ్యాగజిన్ మాస పత్రిక.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "నెరవేరిన యువకుడి లక్ష్యం". సాక్షి పేపర్లో.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "మెహందీ".{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "TELUGU RAMANAIYAM DOCUMENTARY FOR MALAYSIA TELUGU ASSOCIATION ITEM NO 2012.jpg". Google Docs. Retrieved 2021-07-18.
  12. "సలాం జహంగీర్". సాక్షి పేపర్ లో ప్రత్యేక కథనం.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. "Fm. Air proof for guest interview.pdf". Google Docs. Retrieved 2021-07-18.
  14. "Unicef award brave girl 2006.jpg". Google Docs. Retrieved 2021-07-18.
  15. "005.jpg". Google Docs. Retrieved 2021-07-18.
  16. "unicef awrd 2007.jpg". Google Docs. Retrieved 2021-07-18.
  17. "swachh bharath.jpg". Google Docs. Retrieved 2021-07-18.
  18. "Best writer.tif". Google Docs. Retrieved 2021-07-18.
  19. "best enterprenuear rudseti.jpeg". Google Docs. Retrieved 2021-07-18.