ఎస్.నర్మద
ఎస్.నర్మద భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు.[1]
ఎస్.నర్మద | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | బెంగళూరు | 1942 సెప్టెంబరు 22
మరణం | 2007 మార్చి 30 బెంగళూరు | (వయసు 64)
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్య కళాకారిణి, భరతనాట్యం గురువు |
విశేషాలు
మార్చుఈమె 1942, సెప్టెంబరు 22న బెంగళూరులో జన్మించింది. ఈమె వి.ఎస్.కౌశిక్ వద్ద మొదట నాట్యాన్ని అభ్యసించింది. తరువాత కె.పి.కిట్టప్ప పిళ్ళై వద్ద 18 సంవత్సరాలు తంజావూరు బాణీలో భరతనాట్యాన్ని అభ్యసించింది.[2] ఈమె దేశవిదేశాలలో తన కళ గురించి అనేక ప్రదర్శనాపూర్వక ప్రసంగాలను చేసింది. అనేక డాక్యుమెంటరీలలోను, సినిమాలలోను భాగస్వామ్యం వహించింది.
ఈమె 1978లో బెంగళూరులో తన తల్లి పేరు మీద శకుంతలా నృత్యాలయ అనే డాన్స్ స్కూలును ప్రారంభించింది. ఈమె అనేక మందికి భరతనాట్యంలో శిక్షణను ఇచ్చింది. ఈమె వద్ద భరతనాట్యం నేర్చుకున్న వారిలో మంజు భార్గవి, లక్ష్మీ గోపాలస్వామి, సత్యనారాయణరాజు, నిరుపమ రాజేంద్ర, మాలతీ అయ్యంగార్, ప్రవీణ్, అనూరాధ విక్రాంత్ మొదలైన వారున్నారు.
అవార్డులు
మార్చు- సంగీత నాటక అకాడమీ అవార్డు (2006)
- శాంతల అవార్డు - కర్ణాటక ప్రభుత్వం
- కర్ణాటక సంగీత నృత్య అకాడమీ అవార్డు (1998)
- రాజ్యోత్సవ ప్రశస్థి (1996) - కర్ణాటక ప్రభుత్వం
- బెస్ట్ టీచర్ అవార్డు (1992) - మద్రాసు సంగీత అకాడమీ
- బెస్టో అవార్డ్ - కర్ణాటక కల్చరల్ అసోసియేషన్, కాలిఫోర్నియా
మరణం
మార్చుఈమె 2007, మార్చి 30వ తేదీన తన 65 యేళ్ళ వయసులో గుండెపోటుతో బెంగళూరులో మరణించింది.[2]
మూలాలు
మార్చు- ↑ web master. "S. Narmada". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
- ↑ 2.0 2.1 Anuradha Vikranth. "Guru Narmada is no more". నర్తకి. Retrieved 29 April 2021.