ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్
సోరెన్ పెడెన్ లారిట్జ్ సోరెన్‌సన్ (9 జనవరి 1868 – 12 ఫిబ్రవరి 1939) డానిష్ రసాయన శాస్త్రవేత్త. అతను pH స్కేలును పరిచయం చేసాడు. దీని వల్ల ఆమ్ల,క్షార బలాలను తెలుసుకోవచ్చు. అతను డెన్మార్క్ లోని హవ్రెబ్‌జెర్గ్ లో జన్మించాడు.
ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్ | |
---|---|
జననం | 9 జనవరి, 1868 హావ్రెబ్‌జెర్గ్, డెన్మార్క్ |
మరణం | 1939 ఫిబ్రవరి 12 కోపెన్‌హగ్, డెన్మార్క్ | (వయసు 71)
జాతీయత | డేనిష్ |
రంగములు | రసాయనశాస్త్రం |
వృత్తిసంస్థలు | కార్ల్స్‌బెర్గ్ లేబొరేటరీ |
ప్రసిద్ధి | pH |
1901 నుండి 1938 వరకు అతను కోపెన్‌హగ్ లోని కార్ల్స్‌బర్గ్ లేబొరేటరీలో ఆధిపతిగా ఉండేవాడు. [1] కార్ల్స్‌బర్గ్ లేబొరేటరీ లో పరిశోధనలు చేస్తున్నపుడు అతను ప్రోటీన్లపై అయాన్ గాఢత ప్రభావాన్ని అధ్యయనం చేసాడు. [2] హైడ్రోజన్ అయాన్ గాఢత చాలా ముఖ్యమని గుర్తించాడు. అతను 1909లో సులువు పద్ధతిలో pH-స్కేలును వివరించాడు. [3] అతను ప్రవేశ పెట్టిన pH-స్కేలుకు సంబంధించిన ఆర్టికల్ [4] ఆమ్లత్వాన్ని గణన చేయుటకు రెండు రకాల పద్ధతులను వివరించింది.[5] మొదటి పద్దతి ఎలక్ట్రోడ్ ల ఆధారంగా చెప్పబడినది. రెండవ పద్దతిలో కొన్ని సూచికలనుపయోగించి పదార్థం మారే రంగుల నమూనాల ఆధారంగా ఆమ్ల, క్షార బలాలను వివరించింది.[6]
గూగుల్ ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్ జ్ఞాపకార్థం 2018 మే 29 న డూడుల్ తయారుచేసింది.
మూలాలు
మార్చు- ↑ "Sørensen, Søren Peter Lauritz (1868-1939)". 100 Distinguished European Chemists. European Association for Chemical and Molecular Sciences. Archived from the original on 2012-04-25. Retrieved 2018-05-29.
- ↑ "Søren Sørenson". Science History Institute. Archived from the original on 22 మార్చి 2018. Retrieved 20 March 2018.
- ↑ Alberty, Robert; Silbey, Robert (1996). Physical Chemistry (second ed.). John Wiley & Sons, Inc. p. 244. ISBN 0-471-10428-0.
- ↑ Sørensen, S. P. L. (1909). "Enzymstudien. II: Mitteilung. Über die Messung und die Bedeutung der Wasserstoffionenkoncentration bei enzymatischen Prozessen". Biochemische Zeitschrift (in German). 21: 131–304.
{{cite journal}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Nielsen, Anita Kildebæk (2001). "S.P.L. Sørensen" (in Danish). Biokemisk forening. Archived from the original on 2008-12-01. Retrieved 2007-01-09.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ https://www.google.com/doodles/celebrating-spl-srensen