1868
1868 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 20: బెంగాలీ దినపత్రిక అమృతబజార్ పత్రిక ప్రారంభం.
- ఆగస్టు 13: పెరూ, ఈక్వడార్, బొలీవియా దేశాలలో భూకంపం, సునామీ వచ్చి 25,000 మంది మరణించారు. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం జరిగింది.
- ఆగస్టు 18: పియర్ జాన్సన్ అనే ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక సూర్య గ్రహణం పరిశోధన సమయంలో హీలియం కనుగొన్నాడు.
- అక్టోబర్ 16: నికోబార్ దీవులపై హక్కులను డెన్మార్క్ బ్రిటన్‌కు అమ్మివేసింది.
తేదీ వివరాలు తెలియనివి
మార్చు- ఆక్లాండ్ గ్రామర్ స్కూలు: న్యుజీలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ప్రారంభం.
- హైదరాబాద్ రేస్ క్లబ్ ప్రారంభం.
- కార్లోస్ గ్లైడన్, క్రిస్టోఫర్ లాథం షోలెస్ అనే అమెరికన్ శాస్త్రవేత్తలు టైపురైటర్ను కనిపెట్టారు.
జననాలు
మార్చు- జనవరి 9: ఎస్.పి.ఎల్.సోరెన్సన్, డానిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1939)
- మార్చి 22: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మ.1953)
- మార్చి 28: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత. (మ.1936)
- మే 6: రష్యా జారు చక్రవర్తి రెండో నికొలస్ జన్మించాడు.
- జూన్ 14: ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కార్ల్ ల్యాండ్ స్టినేర్.
- ఆగష్టు 4: మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు. (మ.1922)
- అక్టోబర్ 24: అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ మతావలంబి, రచయిత్రి. (మ.1969)
- డిసెంబర్ 9: ఫ్రిట్జ్ హేబర్, రసాయన శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1934)
తేదీ వివరాలు తెలియనివి
మార్చు- జెట్టి తాయమ్మ: నాట్యకళాకారిణి. (మ.1957)
- మధిర సుబ్బన్న దీక్షితులు: కాశీ మజిలీ కథల రచయిత. (మ.1928)
- మోచర్ల రామచంద్రరావు: స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు. (మ.1936)
- ముత్యాల గోవిందరాజులు నాయుడు: హైదరాబాదుకు చెందిన వైద్యుడు. సరోజినీ నాయుడు భర్త. (మ.1949)
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 11: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819)
- మార్చి 27: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794)
- జూన్ 1: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
తేదీ వివరాలు తెలియనివి
మార్చు- గాజుల లక్ష్మీనర్సు శెట్టి:వ్యాపారి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1806)
- భానుభక్త ఆచార్య: నేపాల్‌కు చెందిన సాహిత్యవేత్త. (జ.1814)