ఎస్. అబ్దుల్ నజీర్

సయ్యద్ అబ్దుల్ నజీర్ (జననం 1958 జనవరి 5) భారతదేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి. అతను 2023 ఫిబ్రవరి 12న ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[1][2]

సయ్యద్ అబ్దుల్ నజీర్
ఎస్. అబ్దుల్ నజీర్


పదవీ కాలం
13 ఫిబ్రవరి 2023 – ప్రస్తుతం
ముందు బిశ్వభూషణ్ హరిచందన్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
17 ఫిబ్రవరి 2017 – 4 జనవరి 2023
సూచించిన వారు జగదీష్ సింగ్ ఖేహర్

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
12 మే 2003 – 16 ఫిబ్రవరి 2017
సూచించిన వారు వి. ఎన్. ఖరే

వ్యక్తిగత వివరాలు

జననం (1958-01-05) 1958 జనవరి 5 (వయసు 65)
బెళువై, మైసూర్, కర్ణాటక, భారతదేశం

జననం, విద్యాభాస్యం సవరించు

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించాడు. అతను మంగళూరులో న్యాయవిద్య పూర్తి చేశాడు.

వృత్తి జీవితం సవరించు

అబ్దుల్ న‌జీర్ 1983లో న్యాయ‌వాదిగా క‌ర్నాట‌క హైకోర్టులో ప్రాక్టీస్ మొద‌లుపెట్టి 2003లో క‌ర్నాట‌క హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యాడు. ఆ తరువాత అతను హైకోర్టు న్యాయ‌మూర్తిగా కూడా బాధ్య‌త‌లు నిర్వహించి 2017లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి అందుకున్నాడు.

జస్టిస్ నజీర్ త్రిపుల్ తలాక్ చెల్లదంటూ 2017లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో, నోట్ల రద్దు చట్టబద్ధమని ప్రకటించిన సుప్రీం ధర్మాసనంలో, 2019లో అయోధ్య రామమందిరంపై తీర్పు వెలువరించిన రాజ్యంగ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నాడు. జస్టిస్ నజీర్ 2023 జ‌న‌వ‌రి 4న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాడు.[3]

ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియామకం సవరించు

2023 ఫిబ్రవరి 12న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి నియమించారు.[4]

మూలాలు సవరించు

  1. Sakshi (12 February 2023). "ఏపీ కొత్త గవర్నర్‌గా అబ్దుల్‌ నజీర్‌". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  2. Namasthe Telangana (12 February 2023). "మహారాష్ట్ర గవర్నర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  3. Eenadu (14 February 2023). "ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.
  4. "Retired SC Judge S. Abdul Nazeer Made Andhra Pradesh Governor, Had Delivered Ayodhya Temple Judgment". The Wire. Retrieved 2023-03-20.