ఎస్. కుమరన్
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు.
ఎస్. కుమరన్ (25 ఫిబ్రవరి 1923 - 24 డిసెంబరు 1991) కేరళ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. రాజ్యసభ మాజీ ఎంపీగా, మరారికుళం మాజీ శాసనసభ్యుడిగా పనిచేశాడు.[1][2]
ఎస్. కుమరన్ | |||
| |||
రాజ్యసభ ఎంపీ
| |||
పదవీ కాలం 1970 – 1976 | |||
పదవీ కాలం 1976 – 1982 | |||
నియోజకవర్గం | కేరళ | ||
---|---|---|---|
భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
| |||
పదవీ కాలం 1968 – 1970 | |||
ముందు | సి. అచ్యుత మీనన్ | ||
తరువాత | ఎన్.ఈ. బలరాం | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1960 – 1964 | |||
ముందు | సిజి సదాశివన్ | ||
తరువాత | ఎస్. దామోదరన్ | ||
నియోజకవర్గం | మరారికుళం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఫిబ్రవరి 25, 1923 కొచ్చుతకిడియిల్ హౌస్, ఆర్యద్, అలప్పుజా | ||
మరణం | 1991 డిసెంబరు 24 | (వయసు 68)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | శాంతాంబికా దేవి | ||
సంతానం | ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు | ||
మూలం | http://www.niyamasabha.org/codes/members/m325.htm |
జీవిత విషయాలు
మార్చుకుమరన్ 1923 ఫిబ్రవరి 25న కిట్టచన్-కొచుపారుల దంపతులకు అలప్పుజాలోని ఆర్యద్‌లోని కొచ్చుతకిడియిల్ హౌస్‌లో జన్మించాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుకుమరన్ కు శాంతాంబికా దేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయరంగం
మార్చుకాయిర్ ఫ్యాక్టరీ కార్మికులకు నాయకత్వం వహించి రాజకీయాల్లోకి వచ్చాడు. జాతీయ స్వాతంత్ర్య పోరాటంలోనూ, పున్నప్ర-వయలార్ పోరాటంలోనూ పాల్గొన్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మరారికులం మాజీ శాసనసభ్యుడు దివంగత ఎస్. దామోదరన్ ఇతని సోదరుడు.
పదవులు
మార్చు- క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా స్టేట్ కాంగ్రెస్ ప్రాంతీయ ఉద్యమంతో ప్రారంభించాడు.[3]
- 1938లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు.
- 1946లో రాష్ట్ర కమిటీలో చేరాడు.
- 1960 నుండి 1964 వరకు మరారికుళం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.
- 1966 నుండి 1970 వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించాడు.
- 1970 నుండి 1982 వరకు రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశాడు.
మరణం
మార్చుకుమరన్ 1991, డిసెంబరు 24న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "മനസ്സിൽ ഒരായിരം ഓർമ്മകളുടെ തിരയിളക്കം". February 1, 2020. Archived from the original on 2021-08-10. Retrieved 2021-09-16.
- ↑ "Members - Kerala Legislature".
- ↑ "ആര്യാട് ബ്ലോക്ക് പഞ്ചായത്ത് (Aryad Block Panchayat) » ചരിത്രം". Archived from the original on 2013-07-16. Retrieved 2021-09-16.