ఎస్. శ్రీనివాస అయ్యంగార్
శేషాద్రి శ్రీనివాస అయ్యంగార్ (తమిళం: சேஷாத்திரி ஸ்ரீநிவாச ஐயங்கார்) ( 1874 సెప్టెంబరు 11 - 1941 మే 19). శ్రీనివాస అయంగర్ లేక శ్రీనివాస అయ్యంగార్ గా కూడా ప్రసిద్ధిచెందాడు. ఇతను భారత భారతీయ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అయ్యంగార్ 1916 నుండి 1920 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి అడ్వకేట్ జనరలుగా పనిచేసాడు.1912 నుండి 1920 వరకు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. 1916 నుండి 1920 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ న్యాయ సభ్యుడిగా, స్వరాజ్య పార్టీ వర్గానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1923 నుండి 1930 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెసు సభ్యుడుగా పనిచేసాడు. శ్రీనివాస అయ్యంగార్ ప్రఖ్యాత న్యాయవాది, మద్రాసు మొదటి భారత అడ్వకేట్ జనరల్ అయిన సర్ వి. భాష్యం అయ్యంగార్ అల్లుడు. అయ్యంగార్ అనుచరులు అయనను " లయన్ ఆఫ్ ది సౌత్ " అని పిలిచారు.
శేషాద్రి శ్రీనివాస అయ్యంగార్ | |
---|---|
మద్రాసు గవర్నర్ కార్యనిర్వాహక సభలో చట్ట విషయ సభ్యుడు | |
In office 1916–1920 | |
గవర్నర్ | John Sinclair, 1st Baron Pentland, Freeman Freeman-Thomas, 1st Marquess of Willingdon, |
మద్రాసు ప్రసిడెన్సీ ముఖ్య న్యాయాధికారి | |
In office 1912–1920 | |
అంతకు ముందు వారు | P. S. Sivaswami Iyer |
తరువాత వారు | C. P. Ramaswami Iyer |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 11 సెప్టెంబరు 1874 రామనాథపురం జిల్లా, బ్రిటీషు భారతదేశం |
మరణం | 1941 మే 19 మద్రాసు | (వయసు 66)
కళాశాల | Presidency College, Madras |
నైపుణ్యం | న్యాయవాది |
శ్రీనివాస అయ్యంగార్ మద్రాస్ ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లాలో జన్మించాడు. ఇతను న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడై మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి 1916 లో అడ్వకేట్ జనరల్ అయ్యాడు. తరువాత ఇతను బార్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. గవర్నరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ న్యాయ సభ్యుడిగా ప్రతిపాదించబడ్డాడు. 1920 లో జల్లియన్‌వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా గవర్నరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలులో తన అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసి తన సి.ఐ.ఇ.ను తిరిగి ఇచ్చి భారత జాతీయ కాంగ్రెసులో చేరి సహకారేతర ఉద్యమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ 1923 లో ఎన్నికలలో పాల్గొనడం గురించి మహాత్మా గాంధీతో విభేదాల కారణంగా మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వంటి ఇతర నాయకుల నుండి విడిపోయాడు. విడిపోయిన తరువాత స్వరాజ్య పార్టీని ఏర్పాటు చేసాడు. అయ్యంగార్ మొదట తమిళనాడు కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా, తరువాత మద్రాసు ప్రావిన్సు స్వరాజ్య పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1926 ఎన్నికలలో మెజారిటీ సాధించినప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించినప్పుడు పార్టీ నాయకుడిగా ఉన్నారు. తరువాతి జీవితంలో ఇతను ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా లీగును స్థాపించాడు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించాడు. డొమినియన్ హోదా లక్ష్యం మీద ఇతర కాంగ్రెస్ రాజకీయ నాయకులతో విభేదాల కారణంగా అతను రాజకీయాల నుండి విరమించుకున్నాడు. అయినప్పటికీ తరువాత కొంతకాలం 1938 లో రాజకీయాలకు తిరిగి వచ్చాడు. 1941 మే 19 న అయ్యంగార్ మద్రాసులోని తన ఇంట్లో మరణించాడు.
శ్రీనివాసా అయ్యంగార్ మద్రాస్ బార్‌లో అడ్వకేట్ జనరల్‌గా నియమించబడిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు సంపాదించాడు. స్వాతంత్ర్య సమరయోధులు యు. ముత్తురామలింగం దేవర్, సత్యమూర్తిలకు శ్రీనివాస అయ్యంగార్ గురువు. తరువాత తమిళనాడు కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడై 1954 నుండి 1962 వరకు మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేసిన కె. కామరాజ్ ఇతను కనుగొన్న గొప్ప వ్యక్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. శ్రీనివాస అయ్యంగార్, జాన్ డి మేన్స్ తో రచించి 1939 లో ప్రచురించబడిన ప్రముఖ హిందూ చట్టాల పుస్తకం[1] చాలా ప్రశంసలు పొందిన, అత్యధికసంఖ్యలో చదవబడిన పుస్తకంగా ప్రశంశలు అందుకుంది.
పెరియారు, జస్టిస్ పార్టీ రాజకీయ నాయకులు తరచుగా అయ్యంగారు నాయకుడిగా ఉన్న కాలంలో కాంగ్రెసును బ్రాహ్మణుల ఆధిపత్య పార్టీగా విమర్శించారు. అయ్యంగార్, సత్యమూర్తి, సి. రాజగోపాలచారి వంటి కాంగ్రెస్ అగ్ర నాయకులు అందరూ బ్రాహ్మణులవటమే దీనికి ప్రధాన కారణం.
ఆరంభ కాల జీవితం
మార్చు1874 సెప్టెంబరు 11 న శ్రీనివాస అయ్యంగారు రామనాథపురం జిల్లాకు చెందిన ప్రముఖ భూస్వామి శేషాద్రి అయ్యంగారుకు జన్మించాడు. [2][3][4] అతను తల్లిదండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన సాంప్రదాయ శ్రీ వైష్ణవ బ్రాహ్మణవంశానికి చెందినవారు.[2] శ్రీనివాస అయ్యంగారు పాఠశాల విద్యను మదురైలోఅభ్యసించాడు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో పట్టభద్రుడయ్యాడు.[3][5] అతను ప్రారంభ పాఠశాల విద్య మాతృభాష అయిన తమిళంలో జరిగింది.[6]
న్యాయవాద వృత్తి
మార్చుశ్రీనివాస అయ్యంగార్ 1898 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు.[3][4][5] అతనుకు హిందూ ధర్మశాస్త్రం గురించి విస్తృతమైన జ్ఞానం ఉంది. అది అతనుకంటూ ఒక ముద్ర వేయడానికి సహాయపడింది.[4] తరువాత అయ్యంగార్ శిగ్రగతిలో సి. శంకరన్ నాయరుకు కుడిచేయిగా అయ్యాడు.[7] ఈ సమయంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్. సత్యమూర్తి అయ్యంగారికి జూనియరుగా పనిచేశాడు.[8] తరువాత అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెసు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అయ్యంగారిని అనుసరించాడు. సత్యమూర్తి స్వరాజ్య పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అయ్యంగారు అతను ఆధ్వర్యంలో పనిచేశాడు.[9] అతను అయ్యంగారిని తన "రాజకీయ గురువు"గా పేర్కొన్నాడు.[9] 1911 లో ఇంపీరియల్ శాసనసభలో భూపేంద్రనాథ్ బసు పౌర వివాహాల బిల్లును ప్రవేశపెట్టారు.[10] ఈ బిల్లు తీవ్రంగా విమర్శించబడింది. అయ్యంగారు బిల్లు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు నాయకత్వం వహించాడు. వి. కృష్ణస్వామి అయ్యర్ మరణం తరువాత ఉగ్రవాదులు అతనును విమర్శించినప్పుడు అయ్యంగారు అతనును సమర్థించాడు.[7]
1912 లో, అయ్యంగార్ మద్రాస్ బార్ కౌన్సిలులో నియమించబడి అతను 1912 నుండి 1916 వరకు బార్ కౌంచిలులో పనిచేశాడు. [11] 1916 లో అతను మద్రాసు ప్రెసిడెన్సీ అడ్వకేట్ జనరలు అయ్యాడు. ఈ పదవిని ఆక్రమించిన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందాడు.[2][3][12] అతను 1912 నుండి 1916 వరకు మద్రాసు సెనేట్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[12]
అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1920 నూతన సంవత్సర గౌరవాలలో శ్రీనివాస అయ్యంగారిని కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (సి.ఐ.ఇ) గా నియమించారు.[13][14] అయ్యంగారు 1916 నుండి 1920 వరకు మద్రాసు గవర్నరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలులో న్యాయ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[14]
రాజకీయ కార్యకలాపాలు
మార్చుభారత స్వతంత్ర పోరాటం
మార్చురాజకీయాలలో క్రమంగా ఆసక్తిని ప్రదర్శించారు. 1907లో సూరతులో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెసు చారిత్రాత్మకంగా నిర్వహించిన ముఖ్యమైన సమావేశానికి అతను హాజరయ్యాడు. ఇది మితవాదులు, ఉగ్రవాదుల మధ్య చీలికను గుర్తుచేస్తుంది.[15] 1908 లో వి. కృష్ణస్వామి అయ్యరు రాష్ బిహారీ బోసుకు సర్ వి. భాష్యం అయ్యంగారి అల్లుడిగా అతనును పరిచయం చేశాడు.[15] అయినప్పటికీ జల్లియన్వాలా బాగ్ సంఘటన తరువాత మాత్రమే అయ్యంగారు రాజకీయాలను తీవ్రంగా పరిగణించారు.[15]
1920 లో శ్రీనివాస అయ్యంగారు మద్రాసు అడ్వకేట్ జనరల్ పదవికి జలియన్ వాలా బాగ్ ఊచకోతను నిరసిస్తూ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు.[3][16] 1921 ఫిబ్రవరిలో అతను నిరసనగా తన సి.ఐ.ఇ.ని హోదాను కూడా తిరిగి ఇచ్చాడు. [3][16] భారత జాతీయ కాంగ్రెసులో చేరి సహకారేతర ఉద్యమంలో పాల్గొన్నారు. 1927 లో శ్రీనివాస అయ్యంగారు మద్రాసులో సమావేశమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెసు 29 వ సెషన్ రిసెప్షన్ కమిటీకి అధ్యక్షత వహించారు.[17]
టిన్నెవెలీలో జరిగిన 1920 మద్రాసు ప్రావిన్షియలు సదస్సుకు అయ్యంగారు అధ్యక్షత వహించాడు. అహ్మదాబాదు (1921), గయా (1922), కాకినాడ (1923), ఢిల్లీ (1923), బెల్గాం (1924), కాన్పూరు (1925), గౌహతిలలో (1926), పాల్గొన్నాడు. మద్రాసు (1927), కలకత్తా (1928), లాహోరు (1929) జరిగిన కాంగ్రెసు సమావేశాలలో. అతను చేసిన పని సుమారు పదిసంవత్సరాల కాలం మద్రాసులో కాంగ్రెసు అసమానమైన ఆధిక్యాన్ని ఇచ్చిందని నమ్ముతారు.
శ్రీనివాస అయ్యంగారు 1926 లో కాంగ్రెసు గౌహతి సమావేశానికి అధ్యక్షత వహించాడు. హిందూ-ముస్లిం ఐక్యతను సమర్థిస్తూ ఒక తీర్మానాన్ని ఇవ్వడానికి అయ్యంగారు తీవ్రంగా కృషి చేశాడు. రెండు వర్గాల రాజకీయ నాయకుల మధ్య తాత్కాలిక రాజకీయ ఒప్పం తీసుకునిరాబడింది. 1927 లో భవిష్యత్తు భారతదేశం కోసం ప్రభుత్వ సమాఖ్య పథకాన్ని వివరిస్తూ అతను చేత స్వరాజ్ రాజ్యాంగాన్ని ప్రచురించబడింది.
మద్రాసు ప్రొవింసు స్వరాజ్యపార్టీ
మార్చు1923 లో గాంధేయులు, కౌన్సిలు ఎంట్రీ మద్దతుదారుల మధ్య విడిపోయినప్పుడు శ్రీనివాస అయ్యంగారు గాంధేతర శిబిరంలో ఉండి మద్రాసు ప్రావిన్సు స్వరాజ్య పార్టీని స్థాపించారు. 1923 1923 సెప్టెంబరు నవంబరు 10 జరిగిన ప్రాంతీయ శాసనసభ ఎన్నికలలో మద్రాసు ప్రావిన్సు స్వరాజ్య పార్టీ పోటీ చేసింది.[18][19] అందరూ ఊహించినట్లుగా స్వరాజ్య పార్టీ పనితీరు ఏ విధంగానూ గొప్పది లేదు. 1920 ఎన్నికలతో పోల్చితే జస్టిస్ పార్టీ అదృష్టం మీద ఇది ప్రభావాన్ని చూపింది.[18] స్వరాజ్ పార్టీ 98 సభ్యుల అసెంబ్లీలో 20 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష పార్టీలో ప్రాధాన్యత సంతరించుకుంది. 1923 ఎన్నికలలో జస్టిస్ పార్టీ కేవలం 44 సీట్లను గెలుచుకుంది. 1920 ఎన్నికలలో అది పోలిస్తే 64 స్థానాలు గెలుచుకుంది.[18] పనగల్ రాజా రెండవసారి ప్రీమియరుగా ఎన్నికయ్యారు. శ్రీనివాస అయ్యంగారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు.
కొంతకాలం తరువాత జస్టిస్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖ సభ్యులు విడిపోయి యునైటెడ్ నేషనలిస్ట్ పార్టీని స్థాపించి తమను తాము "డెమొక్రాట్లు"గా ప్రకటించుకున్నారు.[20] వ్యతిరేకులకు జస్టిస్ పార్టీ నాయకుడు సి. ఆర్. రెడ్డి నాయకత్వం వహించాడు.[19][20][21] వీరు రాజా నియంతృత్వ పాలన, అతను సున్నితమైన, అనూహ్యమైన విధానాల గురించి విమర్శించారు.[22] శ్రీనివాస అయ్యంగారు, స్వరాజపార్టీ సభ్యుల మద్దతుతో రెడ్డి [23] 1923 నవంబరున 23 న పనగల్ రాజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.[19][20] అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.[24]
1926 ఎన్నికలలో స్వరాజ్య పార్టీ 44 సీట్లు గెలుచుకుని ఒకే అతిపెద్ద పార్టీగా అవతరించింది.[25] జస్టిస్ పార్టీ కేవలం 20 సీట్లు గెలుచుకుంది.[25] పనగల్ రాజా ప్రీమియర్ పదవి నుంచి తప్పుకున్నాడు.[25] గవర్నరు లార్డు గోస్చెన్ శ్రీనివాస అయ్యంగారును ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించారు.[25] అయినప్పటికీ శ్రీనివాస అయ్యంగారు ఆ ప్రతిపాదనను నిరాకరించాడు.[25] పర్యవసానంగా గవర్నరు పి. సుబ్బరాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి మద్దతుగా 34 మంది సభ్యులను అసెంబ్లీకి ప్రతిపాదించారు.[26][27]
గవర్నర్ చేత సుబ్బారాయణ పాలన నియమించబడి అధికంగా నియంత్రించబడినందున ఇది జస్టిస్, స్వరాజ్ పార్టీ సభ్యుల తీవ్రమైన విమర్శలకు గురైంది.[28] 1927 మార్చిలో జస్టిస్ పార్టీకి చెందిన పి. మునుస్వామి నాయుడు ప్రభుత్వ మంత్రులకు వేతన కోతలను సిఫార్సు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాడు. అయినప్పటికీ వారి సిఫార్సు 41 ఓట్ల తేడాతో ఓడిపోయారు. [28] 1927 ఆగస్టున 23 న అవిశ్వాస తీర్మానం ఆమోదించబడినప్పటికీ గవర్నరు, అతను ప్రతిపాదించిన సభ్యుల మద్దతుతో ఓడిపోయింది.[29]
1927 లో మోంటాగు-చెల్ముసుఫోర్డు సంస్కరణల పురోగతి గురించి నివేదించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేత సైమన్ కమిషన్ నియమించబడింది.[29] కమిషనును బహిష్కరించాలని స్వరాజ్య పార్టీ తీసుకున్న తీర్మానం ఆమోదించబడింది.[30] సుబ్బరాయణ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. కాని అతను మంత్రివర్గంలోని మంత్రులు రంగనాథ ముదలియారు, ఆరోగ్యస్వామి ముదలియారు దీనికి మద్దతు ఇచ్చారు. [30] సుబ్బారాయణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అదే సమయంలో అతను తన మంత్రులను కూడా వారి రాజీనామాలను సమర్పించాలని ఒత్తిడి చేశారు.[30] స్వరాజ్య పార్టీ-జస్టిస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని గవర్నరు భయపడ ప్రతిపక్షాల మద్య ఐక్యతను చెదరగొట్టడానికి ప్రయత్నించాడు. పనగల్ రాజా మద్దతు పొందటానికి అతను జస్టిస్ పార్టీ ప్రముఖ సభ్యుడు కృష్ణన్ నాయరును తన లా సభ్యుడిగా నియమించాడు.[30] పనగల్ రాజా నేతృత్వంలో జస్టిస్ పార్టీ సుబ్బారాయణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. వెంటనే జస్టిస్ పార్టీ సైమన్ కమిషన్ను స్వాగతించే తీర్మానాన్ని ఆమోదించింది.[31] 1928 ఫిబ్రవరిన, [31] 1929 ఫిబ్రవరి 18 న సైమన్ కమిషన్ మద్రాసును సందర్శించింది. [32] స్వరాజ్య పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెసు సైమన్ కమిషనును బహిష్కరించాయి. అయినప్పటికీ జస్టిస్ పార్టీ సభ్యులు, సుబ్బారాయణ ప్రభుత్వం సైమన్ కమిషనుకు ఆత్మీయ స్వాగతం పలికాయి.[32]
నెహ్రు నివేదిక
మార్చు1927 నవంబరులో నాగ్పూరులో జరిగిన కాంగ్రెసు సమావేశంలో "భవిష్యత్తు భారత ప్రభుత్వ కార్మిక రాజ్యాంగాన్ని" రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాడు.[33] మోతిలాల్ నెహ్రూ రాజ్యాంగ ముసాయిదా కమిటీ కన్వీనరుగా ఎన్నికయ్యాడు.[34] 1928 ఆగస్టు 10 న కమిటీ తన నివేదికను ఆధిపత్య హోదాను కాంగ్రెసుకు కట్టబెట్టినట్లు ప్రకటించింది.[34] 1928 1928 ఆగస్టు 28 ఆగస్టు 31 మధ్య జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెసు లక్నో సెషన్లో ఈ నివేదిక సమర్పించబడింది.[34]
1928 ఆగస్టు 30 న జవహర్లాల్ నెహ్రూ, శ్రీనివాస అయ్యంగారు, సుభాస్ చంద్రబోసు ఇండియన్ ఇండిపెండెన్సు లీగు ఏర్పాటు చేశారు.[34] ఈ లీగు ఆధిపత్య హోదాను నిరాకరిస్తూ పూర్ణ స్వరాజ్ లేదా బ్రిటిషు పాలన నుండి పూర్తి స్వాతంత్ర్యాన్ని దాని అంతిమ లక్ష్యంగా ప్రకటించింది.[34] శ్రీనివాసా అయ్యంగారు లీగు అధ్యక్షుడిగా నెహ్రూ, బోసు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.[34]
1928 లో డొమినియన్ హోదా పరంగా భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని వివరిస్తూ అఖిలపక్ష నివేదిక (నెహ్రూ నివేదిక అంటారు) ప్రచురించబడినప్పుడు శ్రీనివాస అయ్యంగారు అధ్యక్షుడుగా స్వయంగా జవహర్లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోసు సభ్యులుగా ఇండిపెండెన్సు లీగును నిర్వహించారు.
అయ్యంగారు కాంగ్రెసు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా సుభాస్ చంద్రబోసు కార్యదర్శిగా ఎన్నికయ్యారు.[35] అయినప్పటికీ శ్రీనివాస అయ్యంగారు 1930 ప్రారంభంలో చురుకైన ప్రజా జీవితం నుండి విరమించుకున్నట్లు ప్రకటించాడు.[35]
తరువాత జీవితం
మార్చురాజకీయంగా విరమిస్తున్నానని ప్రకటించిన తరువాత కాంగ్రెసు అధ్యక్షుడిగా సుభాస్ చంద్రబోసుకు మద్దతు ఇచ్చాడు. ఏదేమైనా బోస్ ఫార్వర్డు బ్లాకును ఏర్పాటు చేసినప్పుడు అతను దానిని "లీకైన పడవ"గా అభివర్ణించాడు."[36] రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడంతో అతను కలత చెందాడు.[36] 1938 లో త్యాగరాజ బక్తజన సభ సమావేశానికి అధ్యక్షత వహించిన సమయంలో శ్రీనివాస అయ్యంగారు మాట్లాడారు:
న్యాయవాదులు సంగీతకారులను వారి చర్చలకు అధ్యక్షత వహించమని అడగరు కాని సంగీతం గురించి ఏమీ తెలియని వ్యక్తిని నా లాంటి వారిని సంగీత కార్యక్రమాలకు అధ్యక్షత వహించమని ఆహ్వానించడం ఒక ఫ్యాషంగా మారింది. స్వీయ-గౌరవనీయ పురుషులు, మహిళలు, సంగీతకారులు తమ వ్యవహారాలను బయటి జోక్యం లేకుండా, మత రాజకీయాలు లేకుండా నిర్వహించాలి.[37]
మరణం
మార్చురెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత భారతీయులు బ్రిటీషు ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలా, స్వాతంత్ర్యం ఇచ్చిన తరువాత ప్రజల ప్రయోజనాల మీద దృష్టిసారించాలా లేదా భారత సైన్యం యుద్ధంలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించాలా, భారతీయ ప్రజలతో సంప్రదింపులు జరపకుండా వారిని యుద్ధంలో పాల్గొనేలా చేయడాన్ని వ్యతిరేకించాలా అనే చర్చలలో పాల్గొనడానికి 1939 లో అయ్యెంగారు రాజకీయ జీవితానికి కొంతకాలం తిరిగి వచ్చారు. 1941 మే 19 న అతను మద్రాసులోని తన నివాసంలో అకస్మాత్తుగా మరణించాడు.
1941 మే 29 న అయ్యంగారు మద్రాసులోని తన నివాసంలో మరణించాడు. మరణించే సమయంలో అతనికి 66 సంవత్సరాలు.
కుటుంబం
మార్చుశ్రీనివాస అయ్యంగారు సర్ వి. భాష్యం అయ్యంగారి మూడవ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.[7] అతనుకు ఎస్. పార్థసారథి అనే కుమారుడు జన్మించాడు.[38][39] అలాగే శ్రీనివాస గాంధీ నిలయం స్థాపకురాలు అంబూజమ్మాళ్ అనే కుమార్తె జన్మించింది.[39] పార్థసారథి వ్యవస్థాపకుడు కావడానికి ముందు న్యాయవిద్యను అభ్యసించి న్యాయవాదిగా పనిచేసాడు.[39] అతను మద్రాసు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కమిషన్ వ్యవస్థాపకుడుగా, డైరెక్టరుగా పనిచేశాడు. పృథ్వీ బీమా సంస్థను స్థాపించాడు.[39] తన తరువాతి జీవితంలో అతను హిందూ సన్యాసి అయిన తరువార స్వామి అన్వానంద అనే పేరును స్వీకరించాడు.[39]
రాజకీయ వారసత్వం
మార్చుశ్రీనివాస అయ్యంగారికి చట్టంతో ఇతర ఆసక్తులలో విద్య, సామాజిక సంస్కరణ, రాజకీయాలు ప్రాధాన్యత వహించాయి.[4] అతను ప్రారంభ ప్రభావాలలో సర్ శంకరన్ నాయరు, సి. విజయరాఘవచారియారు, ఇద్దరు మాజీ కాంగ్రెసు నాయకులు ఉన్నారు.[4] అతను గోపాల కృష్ణ గోఖలే (అతను పేరు మీద బహుమతిని ఇచ్చాడు), తరువాత మహాత్మా గాంధీ ఆరాధకుడు.[4] అయ్యంగారు వ్యక్తిగత న్యాయవాది, ముత్తురామలింగం దేవరు కుటుంబ స్నేహితుడు. అతను శ్రీనివాస అయ్యంగారిని 1927 లో మద్రాసులో జరిగిన కాంగ్రెసు సమావేశంలో పాల్గొనమని ప్రోత్సహించారు.[40] దేవరు చివరికి కాంగ్రెసు వైపు ఆకర్షితుడయ్యాడై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలలో పాల్గొన్నాడు.[40] అయ్యంగారు స్వామి శుద్ధానంద భారతికి మద్య కూడా సాన్నిహిత్యం ఉంది.[41]
ఒక బ్రిటిషు సిఐడి అధికారి అయ్యంగారిని "రాజకీయ ఆలోచనల కర్మాగారం"గా అభివర్ణిండు.[42] అతను ముక్కుసూటి మనిషిగా ఉదారంగా వర్ణించబడ్డాడు.[43] అతను రాజకీయ ఆలోచనలకు సరికొత్త, నూతన ఉత్తేజం తీసుకుని వచ్చాడు. అతను గవర్నరు లేదా ప్రభుత్వ అధికారుల మీద ధైర్యంగా, బహిరంగంగా వినర్శించేవాడని ప్రఖ్యాతి చెందాడు.[43][44] అయ్యంగారు అభిప్రాయాలు అతను చట్టపరమైన వాదనల వలె స్పష్టంగా ఉన్నాయని సమకాలీనులు వ్యాఖ్యానించారు.[42] న్యాయవాద వృత్తిలో అతను నైపుణ్యం అతను ప్రారంభ రోజుల నుండే గుర్తించబడింది.[43] జాతీయ రాజకీయాలలో మద్రాసు రాజకీయాల్లో అయ్యంగారు మైలాపూరు సమూహంలో విజేతగా పరిగణించబడ్డాడు.[43] అయ్యంగారు భారతీయ సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అతను సమాజంలోని అణగారిన వర్గాల ఉన్నతి కొరకు పనిచేశాడు. తన సొంత ఖర్చుతో బలహీనవర్గాల పిల్లలను చదివించాడు.[44] అతను మంచి రచయిత, ది హిందూ, స్వదేశమిత్రన్, ఇండియన్ పేట్రియాట్ కోసం తరచూ తన రచనలు అందించాడు.[45] దక్షిణ భారతదేశంలో గ్రామ స్థాయిలో కాంగ్రెసుకు ప్రాచుర్యం కలిగించిన ఘనత అయ్యంగారికి దక్కింది.[4] అతనుకు "అనుసంధాన నాయకత్వం" అనే భావన మీద గట్టి నమ్మకం ఉండేది.[4] భారత జాతీయ కాంగ్రెసులో కె. కామరాజు, ముత్తురామలింగ దేవరులను ప్రవేశపెట్టడానికి అతను బాధ్యత వహించారు.[4] అయ్యంగారి అనుచరులు, సహచరులు అతనును "లయన్ ఆఫ్ ది సౌత్" అని పిలిచారు.[6]
విమర్శలు
మార్చు1920 లో తమిళనాడు కాంగ్రెసు కమిటీ సమావేశంలో కాంగ్రెసు నాయకుడు ఇ. వి. రామసామి విద్య, ఉపాధిలో మత ప్రాతినిధ్యాన్ని ప్రవేశపెట్టే తీర్మానాన్ని ప్రతిపాదించాలని కోరారు.[46] సెషనుకు అధ్యక్షత వహించిన అయ్యంగారు అనవసరమైన మత ఉద్రిక్తతకు కారణమవుతుందనే కారణంతో దీనిని అనుమతించలేదు.[46] పెరియారు కాంగ్రెసు మిగిలిన బ్రాహ్మణ నాయకత్వంతో పాటు అయ్యంగారిని విమర్శించాడు. బ్రాహ్మణేతరులు కాంగ్రెసు నుండి న్యాయం పొందలేరని ప్రకటించాడు.[47]
కృతులు
మార్చు- S. Srinivasa Iyengar; John D. Mayne (1939). Mayne's Treatise on Hindu Law and Usage. Madras: Higginbotham's.
ఇతర మూలాలు
మార్చు- Some Madras Leaders. 1922.
జీవిత కథలు
మార్చు- K. R. Srinivasa Iyengar (1939). S. Srinivasa Iyengar: the story of a decade in Indian politics. Basel Mission Press (Canarag, Ltd.).
- Kadayam Ramachandra Ramabhadra Sastry (1972). S. Srinivasa Iyengar. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India.
మూలాలు
మార్చు- ↑ Sastry, Pg 100
- ↑ 2.0 2.1 2.2 Vijaya Ramaswamy (2007). Historical Dictionary of the Tamils. The Scarecrow Press. pp. 93. ISBN 0810853795, ISBN 978-0-8108-5379-9.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Sayed Jafar Mahmud (1994). Pillars of Modern India. APH Publishing. p. 61. ISBN 8170245869, ISBN 978-81-7024-586-5.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 "Indian National Congress-Past Presidents:S Srinivasa Iyengar, President-Gauhati, 1926". Indian National Congress. Archived from the original on 28 సెప్టెంబరు 2007.
- ↑ 5.0 5.1 The Times of India directory and year book, including who's who. Bennett, Coleman & Co. 1923. p. 813.
- ↑ 6.0 6.1 The great Indians. One India One People Foundation. p. 204. ISBN 8172733186, ISBN 978-81-7273-318-6.
- ↑ 7.0 7.1 7.2 Some Madras Leaders, Pg 11
- ↑ Saroja Sundararajan (1983). S. Satyamurti, a political biography. Satvahan. p. 15.
- ↑ 9.0 9.1 Saroja Sundarrajan (1989). March to freedom in Madras Presidency, 1916–1947. Lalitha Publications. p. 358.
- ↑ K. Subrahmanyam (1984). The press and the national movement in South India, Andhra, 1905–1932. New Era Publications. p. 127.
- ↑ M. Naeem Qureshi (1999). Pan-Islam in British Indian Politics: A Study of the Khilafat Movement, 1918–1924. Brill. pp. 468. ISBN 9004113711, ISBN 978-90-04-11371-8.
- ↑ 12.0 12.1 G. C. Sondhi (1948). To the gates of liberty: Congress commemoration volume. G. C. Sondhi. pp. 204.
- ↑ "No. 31712". The London Gazette (Supplement). 30 డిసెంబరు 1919. p. 5.
- ↑ 14.0 14.1 K. R. Srinivasa Iyengar, Pg 5
- ↑ 15.0 15.1 15.2 Sastry, Pg 5
- ↑ 16.0 16.1 Sastry, Pg 102
- ↑ Sastry, Pg 25
- ↑ 18.0 18.1 18.2 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 184. ISBN 978-81-7488-865-5.
- ↑ 19.0 19.1 19.2 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 185. ISBN 978-81-7488-865-5.
- ↑ 20.0 20.1 20.2 Muthiah, S. (25 అక్టోబరు 2004). "When the postman knocked". The Hindu. Archived from the original on 24 జనవరి 2005. Retrieved 30 మే 2020.
- ↑ Rao, Narasimha (27 ఏప్రిల్ 2004). "Go-betweens left in the lurch". The Hindu. Archived from the original on 23 జూన్ 2004. Retrieved 30 మే 2020.
- ↑ Parthasarathi, R. (1971). S. Satyamurti. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. p. 41.
- ↑ Anjaneyulu, D. (1973). Dr. C. R. Reddy. Sahitya Akademi. p. 16.
- ↑ Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 186. ISBN 978-81-7488-865-5.
- ↑ 25.0 25.1 25.2 25.3 25.4 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 189. ISBN 978-81-7488-865-5.
- ↑ "Kumaramangalam family's role in development remembered". The Hindu. 17 అక్టోబరు 2004. Archived from the original on 19 జనవరి 2005. Retrieved 30 మే 2020.
- ↑ "Rajya Sabha Who's Who". Rajya Sabha. Archived from the original on 18 ఆగస్టు 2007. Retrieved 4 జనవరి 2009.
- ↑ 28.0 28.1 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 190. ISBN 978-81-7488-865-5.
- ↑ 29.0 29.1 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 191. ISBN 978-81-7488-865-5.
- ↑ 30.0 30.1 30.2 30.3 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 192. ISBN 978-81-7488-865-5.
- ↑ 31.0 31.1 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 193. ISBN 978-81-7488-865-5.
- ↑ 32.0 32.1 Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. p. 194. ISBN 978-81-7488-865-5.
- ↑ Harkishan Singh Surjeet (2005). History of the communist movement in India. LeftWord Books. p. 122. ISBN 8187496495, ISBN 978-81-87496-49-6.
- ↑ 34.0 34.1 34.2 34.3 34.4 34.5 Harkishan Singh Surjeet (2005). History of the communist movement in India. LeftWord Books. p. 123. ISBN 8187496495, ISBN 978-81-87496-49-6.
- ↑ 35.0 35.1 Sastry, Pg 47
- ↑ 36.0 36.1 Sastry, Pg 65
- ↑ "Concerted support for carnatic music". The Hindu. 13 సెప్టెంబరు 2003. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 31 మే 2020.
- ↑ "Book Review:On men and matters". The Hindu. 31 ఆగస్టు 2004. Archived from the original on 4 నవంబరు 2012. Retrieved 31 మే 2020.
- ↑ 39.0 39.1 39.2 39.3 39.4 "Sri Vaishnavi shrine, Aavadi". Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 31 మే 2020.
- ↑ 40.0 40.1 "One Hundred Tamils of the 20th century: Pasumpon Muthuramalingam Thevar". tamilnation.[permanent dead link]
- ↑ S. R. (16 అక్టోబరు 2001). "Pilgrim of eternity". The Hindu. Archived from the original on 14 మే 2011.
- ↑ 42.0 42.1 Some Madras Leaders, Pg 12
- ↑ 43.0 43.1 43.2 43.3 Some Madras Leaders, Pg 13
- ↑ 44.0 44.1 Some Madras Leaders, Pg 14
- ↑ Some Madras Leaders, Pg 15
- ↑ 46.0 46.1 Louis Anthony. "Political Philosophy of Periyar" (PDF). Archived from the original (PDF) on 24 అక్టోబరు 2018. Retrieved 31 మే 2020.
- ↑ Ka Ilakkumi Nārāyaṇan̲; T. Gangadharan; N. Chandrasekar (1999). Salem City: An Ethnohistory (1792–1992). Vysya College. p. 93.