ఎ.రాజశేఖర్ రెడ్డి
అడవల్లి రాజశేఖర్ రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 1989 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించి 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]
ఎ.రాజశేఖర్ రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2 జనవరి 2019 - ప్రస్తుతం | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 4 మే 1960 సిరిసినగండ్ల గ్రామం, పెద్దవూర మండలం నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
తల్లిదండ్రులు | ఎ.రామానుజరెడ్డి, జయప్రద | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
జననం, విద్యాభాస్యం
మార్చుఎ.రాజశేఖర్ రెడ్డి 1960 మే 4లో తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలం, సిరిసినగండ్ల గ్రామంలో ఎ.రామానుజరెడ్డి, జయప్రద దంపతులకు జన్మించాడు. ఆయన మిర్యాలగూడలోని సెయింట్ మేరీస్ హైస్కూల్, నల్గొండలోని సెయింట్ అల్ఫోన్సుస్ హైస్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, న్యూ సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ ఏజీ కాలేజీ నుంచి డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీ నుండి బీఎల్ పూర్తి చేశాడు.[2]
వృత్తి జీవితం
మార్చుఎ.రాజశేఖర్ రెడ్డి 1985లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని సీనియర్ న్యాయవాది మహమూద్ అలీ వద్ద జూనియర్ గా చేరి, 1989లో సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, రాజ్యాంగపరమైన కేసులు వాదించాడు. ఆయన 2004లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఎ.రాజశేఖర్ రెడ్డి 2005 నుంచి 2009 వరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేసి, 2013 ఏప్రిల్ 12న న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[3]
జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి 2014 సెప్టెంబరు 08న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై, 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.
మూలాలు
మార్చు- ↑ The Times of India (2 January 2021). "13-judge strong Telangana HC will sit from Wednesday" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
- ↑ Telangana High Court (2021). "HONOURABLE SRI JUSTICE A.RAJASHEKER REDDY". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
- ↑ Sakshi (2 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్టు". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.