ఎ. వి. ఎస్. రాజు

భారతీయ వ్యాపారవేత్త

అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఎ. వి. ఎస్. రాజు) ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త.[1] నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుడు. వ్యాపార రంగంలో ఆయన కృషికి గాను 2010 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది.[2] 2007 లో ఆయన సత్యసాయిబాబా పై రాసిన పుస్తకం అతిపెద్ద జీవిత చరిత్రగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.[3]

ఎ. వి. ఎస్. రాజు
జననం
అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు

(1937-04-18) 1937 ఏప్రిల్ 18 (వయసు 87)
తూర్పు గోదావరి జిల్లా, అంతర్వేదిపాలెం
వృత్తిపారిశ్రామికవేత్త, రచయిత
తల్లిదండ్రులు
  • నారాయణ రాజు (తండ్రి)
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం

నాగార్జున సంస్థ తరపున హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు, ఢిల్లీ ఎయిర్ పోర్టు లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలు చేపట్టాడు.

బాల్యం మార్చు

ఎ.వి.ఎస్. రాజు ఏప్రిల్ 18, 1937 న తూర్పు గోదావరి జిల్లా, అంతర్వేదిపాలెంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి నారాయణ రాజు వ్యవసాయంతో పాటు కాంట్రాక్టు పనులు కూడా చేసేవాడు. రాజు తొమ్మిదో తరగతిలో ఉండగా తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. దాంతో ఆయన చదువుకు విరామమిచ్చి తండ్రికి సహాయపడ సాగాడు. దాదాపు రెండేళ్ళూ తండ్రికి వ్యవసాయంలోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ సహాయం చేస్తూ పోటీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ నేర్చుకున్నాడు. తరువాత కొద్ది కాలానికి తండ్రి మరణించాడు.

మూలాలు మార్చు

  1. "నెక్లెస్‌ రోడ్డు వేయలేమన్నారు... వేసి చూపించా!". ఈనాడు. 23 October 2016. Archived from the original on 24 October 2016. Retrieved 24 October 2016.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.
  3. "Largest single volume biography". guinnessworldrecords.com. Guinness world Records. Retrieved 24 October 2016.