ఏందిరా ఈ పంచాయితీ
ఏందిరా ఈ పంచాయితీ 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన ఈ సినిమాకు గంగాధర.టి దర్శకత్వం వహించాడు. భరత్, విషికా లక్ష్మణ్, కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 11న[2], సెప్టెంబర్ 30న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 06న విడుదల చేశారు.[3]
ఏందిరా ఈ పంచాయితీ | |
---|---|
దర్శకత్వం | గంగాధర.టి |
రచన | గంగాధర.టి |
మాటలు | వెంకట్ పాల్వాయి ప్రియాంక ఎరుకల |
నిర్మాత | ప్రదీప్ కుమార్.ఎం |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సతీష్ మాసం |
కూర్పు | జేపీ |
సంగీతం | పీఆర్ (పెద్దపల్లి రోహిత్) |
నిర్మాణ సంస్థ | ప్రభాత్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 6 అక్టోబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- భరత్
- విషికా లక్ష్మణ్
- కాశీ విశ్వనాథ్
- తోటపల్లి మధు
- రవి వర్మ
- ప్రేమ్ సాగర్
- సమీర్
- విజయ్
- చిత్తూరు కుర్రాడు తేజ
కథ
మార్చురామాపురం గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ఆ ఉరి ప్రజలు హడలిపోతుంటారు. దాంతో ఆ ఊరి సర్పంచ్ పెద్దారెడ్డి (తోటపల్లి మధు) తో పాటు ఊరి పెద్దలైన సుధాకర్ రెడ్డి (రవి వర్మ) రామచంద్రా రావు(కాశీ విశ్వనాథ్)లు గ్రామ ప్రజల ఎదుట పంచాయితీ పెడతారు. రామాపురం లోనే యస్. ఐ కావాలని ప్రయత్నం చేస్తున్న అభి (భరత్) ని ఈ ఊరికి కాపలా పెట్టగ, ఈ క్రమంలో ఊరి పెద్ద రామాంచంద్ర రావు ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఎంక్వ్వైరీ కి వెళ్లిన అభికి రామాంచంద్ర రావు కూతురు యమున (విషికా లక్ష్మణ్ )తో ప్రేమలో పడతాడు. పుంగనూరు ఏం.ఎల్.ఏ నందకిశోర్ రామాపురం పెద్దలను పిలిపించి రాబోయే ఎన్నికల కోసం ఊరి బాగు కోసం మూడుకోట్లు ఇవ్వగా అవి చోరీకి గురవగా అభిని అరెస్ట్ చేస్తారు. అసలు ఆ మూడు కోట్లు ఎవరు దొంగతనం చేశారు? ఊరికి సంబందించిన మూడు కోట్లు రికవరీ చేశాడా లేదా ? చివరకు యస్. ఐ కావాలనే డ్రీమ్ ను అభి నెరవేర్చుకున్నాడా ? అనేదే మిగతా సినిమా కథ.
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ప్రభాత్ క్రియేషన్స్
- నిర్మాత: ప్రదీప్ కుమార్.ఎం
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గంగాధర.టి
- సంగీతం: పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
- సినిమాటోగ్రఫీ: సతీష్ మాసం
- ఎడిటర్: జేపీ
- మాటలు: వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఏమో ఏమో[4]" | పెద్దపల్లి రోహిత్ (పీఆర్) | అనురాగ్ కులకర్ణి | 4:46 |
2. | "తలిచే తలిచే" | రామావత్ శ్రీకృష్ణ | సునీత ఉపద్రష్ట | 3:57 |
3. | "కథ కాదు" | పెద్దపల్లి రోహిత్ (పీఆర్) | చిత్ర | 4:33 |
మూలాలు
మార్చు- ↑ Eenadu (2 October 2023). "ప్రేమ పంచాయితీ". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
- ↑ 10TV Telugu (14 September 2023). "ఎమోషనల్‌గా సాగే 'ఏందిరా ఈ పంచాయితీ' టీజర్" (in Telugu). Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhra Jyothy (27 September 2023). "అంతా సిద్ధం.. ఇక పంచాయితీనే." Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ 10TV Telugu (1 September 2023). "'ఏందిరా ఈ పంచాయితీ' మూవీ నుంచి 'ఏమో ఏమో' సాంగ్ విడుదల." (in Telugu). Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)