ఏకాంకిక

(ఏకాంకికలు (పుస్తకం) నుండి దారిమార్పు చెందింది)

ఏకాంకిక అనేది దృశ్యకావ్యమనబడే నాటకాల్లో ఒక ప్రక్రియ.

ఈ ప్రక్రియలో పలువురు ప్రఖ్యాత రచయితలు చేసిన రచనలను సంకలనం చేసి ఏకాంకికలు అనే గ్రంథంగా ప్రచురించారు.[1] పీఠికలో తెలుగునాట నాటకాల చరిత్ర మొదలుకొని ఏకాంకికల ఆవిర్భావ వికాసాల వరకూ సవివరంగా చర్చించడం విశేషం.

దీనికి శ్రీ శివ శంకరశాస్త్రి రచించి, నోరి నరసింహ శాస్త్రి గారికి అంకితమిచ్చారు. దీనికి గౌరవ సంపాదకులు: శ్రీ తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గౌరవ సహాయ సంపాదకులు : జనమంచి కామేశ్వర రావు, సంపాదకుడు : బాలాంత్రపు సత్యనారాయణ రావు. దీని తొలికూర్పు నవంబరు 1943 లో ముద్రించబడింది.

ఇందులోని ఏకాంకికలు

మార్చు
  1. సముద్ర తీరము - నూతక్కి రామ శేషయ్య
  2. మాయ పెళ్ళి - కొడవటిగంటి వెంకట సుబ్బయ్య
  3. గజ్జెల మొలతాడు - నోరి నరసింహ శాస్త్రి
  4. పరివర్తనము - శ్రీనివాస శిరోమణి
  5. శ్రీ కృష్ణుడు - చింతా దీక్షితులు
  6. అపవాదు - ముద్దు కృష్ణ
  7. ప్రభు వాక్యము - శివ శంకర శాస్త్రి
  8. సౌందర్యోపాసి - తల్లావజ్ఝల కృత్తివాస తీర్థులు
  9. గ్రీష్మ ఋతువు - బాలాంత్రపు రజనీకాంతరావు
  10. మొక్కుబడి - మొక్కపాటి నరసింహ శాస్త్రి
  11. శిల్ప నిద్ర - పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి
  12. మధుర ప్రియ - వావిలాల సోమయాజులు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకాంకిక&oldid=2989775" నుండి వెలికితీశారు