ఏకాంబరేశ్వర దేవాలయం

భారతదేశంలో హిందు దేవాలయం

ఏకాంబరేశ్వర దేవాలయం (తమిళం: ஏகாம்பரநாதர் கோயில்) లేదా ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడు నందలి కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి.[1] ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి [2]

ఏకాంబరేశ్వర దేవాలయం
భౌగోళికాంశాలు :12°50′51″N 79°42′00″E / 12.84750°N 79.70000°E / 12.84750; 79.70000
పేరు
ప్రధాన పేరు :అరుల్మిగు కంచి ఏకాంబరనాథర్ తిరుకొయిల్
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తమిళనాడు
ప్రదేశం:కాంచీపురం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఏకాంబరనాథర్ (శివుడు)
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రావిడ నిర్మాణ శైలి
ఇతిహాసం
సృష్టికర్త:పల్లవులు, చోళరాజులు
మామిడి వృక్షం కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచిన ఫొటో

కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కైంద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు.ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునిలథింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి ఉన్నది. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్ని ని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువు ను ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తరువాత శివుడు పార్వతి మీదకు గంగ ను ప్రవహింప జేయగా, పార్వతి గంగను ప్రార్థించి, వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువు ను వామనమూర్తిగా పూజిస్తారు.

పంచ భూత స్థలాలు

మార్చు

పంచ భూతములనగా 1.నింగి 2.నేల 3. గాలి 4. నీరు 5. నిప్పు.ఈ అయిదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచ భూత క్షేత్రాలు. ఈ అయిదింటిలో నాలుగు తమిళనాడులోనూ ఒకటి ఆంధ్ర రాష్ట్రం లోనూ గలవు. అవి:

  1. నింగి---ఆకాశ లింగం-- చిదంబరం--తమిళనాడు
  2. నేల--పృథ్వీ లింగం--కంచి--తమిళనాడు
  3. గాలి---వాయులింగం--శ్రీకాళహస్తి--ఆంధ్రప్రదేశ్
  4. నీరు--జలలింగం--తిరువానైక్కావల్ జంబుకేశ్వర కోవెల--తిరుచిరాపల్లి--తమిళనాడు
  5. నిప్పు--అగ్నిలింగం--తిరువణ్ణామలై--తమిళనాడు

సాహిత్యం-సంగీతం

మార్చు

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముద్దుస్వామి దీక్షితులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూర్వికల్యాణి రాగం లో ఏకామ్రనాథం భజేహం మఱియు భైరవి రాగం లో చింతయమా కంద మూల కందం అను కృతులను రచియించిరి.

ఆలయ వేళలు

మార్చు

ఉదయం 6 గంటలు మొదలు మధ్యాహ్నం 12.30 వఱకు సాయంత్రం 4 గంటలు మొదలు రాత్రి 8.30 వఱకు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Let's Go 2004, p. 584
  2. Sajnani 2001, pp. 305
  • Alexander, Jane (2009), The Body, Mind, Spirit Miscellany: The Ultimate Collection of Fascinations, NY: Duncain Baird Publishers, ISBN 978-1-84483-837-0
  • Ayyar, P. V. Jagadisa (1991), South Indian shrines: illustrated, New Delhi: Asian Educational Services, ISBN 81-206-0151-3.
  • Bajwa, Jagir Singh; Kaur, Ravinder (2007), Tourism Management, New Delhi: S.B. Nangia, ISBN 81-313-0047-1.
  • Bhargava, Gopal K.; Bhatt, Shankarlal C. (2007), Land and people of Indian states and union territories. 25. Tamil Nadu, Delhi: Kalpaz Publications, ISBN 81-7835-381-4.
  • Bradnock, Roma; Dawson,, Patrick (2009), Footprint India, USA: Patrick Dawson, ISBN 1-904777-00-7{{citation}}: CS1 maint: extra punctuation (link).
  • Hancock, Mary Elizabeth (2008), The politics of heritage from Madras to Chennai, IN, USA: Indiana University Press, ISBN 978-0-253-35223-1.
  • Knapp, Stephen (2005), The Heart of Hinduism: The Eastern Path to Freedom, Empowerment and Illumination, NE: iUniverse, ISBN 978-0-595-35075-9.
  • Let's Go (2004), Let's Go India & Nepal 8th Edition, NY: Let's Go Publications, ISBN 0-312-32006-X
  • M.K.V., Narayan (2007), Flipside of Hindu Symbolism: Sociological and Scientific Linkages in Hinduism, California: Fultus Corporation, ISBN 1-59682-117-5.
  • Ramaswamy, Vijaya (2007), Historical dictionary of the Tamils, United States: Scarecrow Press, INC., ISBN 978-0-470-82958-5
  • Rajaiah, Ratna (2010), How the Banana Goes to Heaven, Chennai: Manipal Press Limited, ISBN 978-93-8065-860-5[permanent dead link]
  • Rao, P.V.L. Narasimha (2008), Kanchipuram - Land of Legends, Saints & Temples, New Delhi: Readworthy Publications (P) Ltd., ISBN 978-93-5018-104-1
  • Sajnani, Dr. Manohar (2001), Encyclopedia of tourism resources in India, Volume 2, Delhi: Kalpaz Publications, ISBN 81-7835-014-9.
  • Schreitmüller, Karen (2009), India, Germany: Karl Baedeker Verlag.
  • V., Vriddhagirisan (1995), Nayaks of Tanjore, New Delhi: Asian Educational Services, ISBN 81-206-0996-4.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.