ఏటిగట్టు
నదులు, ఏరులు వంటి పెద్ద నీటి ప్రవాహాలకు కల గట్టును ఏటిగట్టు అంటారు. ఏటిగట్టుకు నదులకు మధ్య చాలా దూరం ఉంటుంది. ఈమధ్య ప్రాంతమును లంక లేదా లంకభూమిగా వ్యవహరిస్తారు.
ఏటిగట్టు నిర్మాణము
మార్చుఏటిగట్ల నిర్మాణమునకు ఎత్తుగా మట్టిని పోస్తూ పోతారు. అలా అది త్రిభుజాకారముగా పొడవుగా ఉంటుంది. దాన్ని చదును చేసి, పైన ఎర్రకంకర వేసి రహదారిగా మారుస్తారు. నీటి ప్రవాహ వడి ఎక్కువగా ఉండు చోట్ల పెద్ద రాతి, కంకర లాంటి వాటితో పేర్చుకొంటూ దానిపై ఆ రాళ్ళు జారిపోకుండా తీగ వలను ఏర్పాటు చేస్తారు.
ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండే చోట చేసే మరో రకమైన నిర్మాణాలు కరకట్టలు. వీటినీ రాళ్ళతో కడతారు. ఏటి గట్టుతో సహా రాళ్ళ పేర్పుతో వీటిని కడతారు. మిగతా ఏటి గట్టు భాగం అంతా రకరకాల మొక్కలు పెంచి పటిష్ఠంగా ఉంచుతారు.
ఏటిగట్టు ఉపయోగాలు
మార్చుఏటి గట్టు నిర్మాణము యొక్క ప్రధాన ఉద్దేశము వరద ఉధృతి నుండి రక్షణ. కొన్ని ప్రాంతాలలో వరదలు విపరీతంగా వచ్చి ఊళ్ళు మునిగిపోయినపుడు అక్కడి వారు ఏటిగట్టుపై రక్షణ పొందుతారు.