ఏడిద గోపాలరావు ఆకాశవాణి ప్రయోక్త. ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తా విభాగంలో తెలుగు న్యూస్ రీడరుగా, రంగస్థల కళాకారునిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి.[1] అతను 1966 నుంచి 1996 వరకూ న్యూస్‌ రీడర్‌గా ఆకాశవాణిలో సేవలందించాడు.

జీవిత విశేషాలు

మార్చు

గోపాలరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కొత్తపేట. అతని భార్య సుమలత సాంఘిక సంక్షేమ శాఖ విశ్రాంత ఉద్యోగిని.అతని కుమారుడు శ్యాంరాజా, కుమార్తె మెహర్.

ఉద్యోగ జీవితం

మార్చు

అతను రేడియో వాఖ్యాతగా మాత్రమే కాకుండా రంగస్థల కళాకారునిగా కూడా తన సేవలనందించాడు. రంగస్థల నటునిగా మహాత్మా గాంధీ వేషం వేసి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నాడు. ‘నేతాజీ’, ‘బాపు చెప్పినమాట’ నాటికల్లోని బాపూజీ పాత్ర అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. గాంధీ ఏకపాత్రాభినయంలో గోపాలరావు వందకుపైగా ప్రదర్శనలిచ్చాడు. అతనికి సాంస్కృతిక కళకపై ఇష్టం ఎక్కువ. అందువలన ఢిల్లీలో వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు మధ్య ఒక వారధిగా పనిచేసాడు. ఆ ఇండియాలో ఉద్యోగం చేస్తూనే ప్రజా సేవకు కూడా తన సమయాన్ని కేటాయించేవాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీలో ఏదైనా పని పడితే అలా వచ్చిన వారికి తన ఇంటిలో ఆశ్రయం కల్పించేవాడు. అతను సోషలిస్టు రష్యాలోని మాస్కో రేడియోలోనూ నాలుగేళ్లు పనిచేశాడు.[2] 12 గంటలపాటు నిర్విరామంగా ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకెక్కాడు. రేడియో వాఖ్యాతగా పదవీవిరమణ పొందిన తరువాత హైదరాబాదులో స్థిరపడ్డాడు. అతని రెండవ తమ్ముడు సినిమా నిర్మాత అయిన ఏడిద నాగేశ్వరరావు[3].అతను కరుణామయుడు సినిమాలో నటించాడు. "సరస నవరస సాంస్కృతిక సంస్థ"ను నెలకొల్పి, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలలో జాతీయ నాటకోత్సవాలను నిర్వహించాడు. తన అనుభవాల సమాహారం ‘అరవై వసంతాల ఏడిద గోపాలరావు’, ‘గోపాలతరంగాలు’ కవితా సంకలనం తదితర పుస్తకాలు రచించాడు.[4] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నంది అవార్డుల స్ర్కీనింగు కమిటీ సభ్యుడిగానూ ఉన్నాడు. చినజీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఢిల్లీ కేంద్రానికి గోపాలరావు కొంతకాలం బాధ్యుడిగానూ వ్యవహరించాడు. అతను 2020 నవంబరు 12న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. ""వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు" ఇక లేరు". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-21. Retrieved 2020-12-13.
  2. Codingest. "రేడియో న్యూస్ రీడర్ మృతి : సీఎం కేసీఆర్‌ సంతాపం". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2020-12-13.[permanent dead link]
  3. "ఆకాశవాణి న్యూస్‌రీడర్‌ ఏడిద గోపాలరావు ఇక లేరు". www.andhrajyothy.com. Retrieved 2020-12-13.
  4. "ఆకాశవాణి న్యూస్‌రీడర్‌ ఏడిద గోపాలరావు ఇక లేరు - Andhrajyothy". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-12-13.