ఏడు చేపల కథ (2019 సినిమా)

ఏడు చేపల కథ 2019లో విడుదలైన తెలుగు సినిమా. చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై శేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ జె చైతన్య దర్శకత్వం వహించాడు. అభిషేక్ పచ్చిపాల, అయేషా సింగ్, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 7 నవంబర్ 2019లో విడుదలైంది.[1][2]

ఏడు చేపల కథ
(2019 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్యామ్ జె చైతన్య
నిర్మాణం జీవిఎన్ శేఖర్ రెడ్డి
తారాగణం అభిషేక్ పచ్చిపాల, అయేషా సింగ్, భానుశ్రీ
సంగీతం కవి శంకర్
ఛాయాగ్రహణం ఆర్లీ
నిర్మాణ సంస్థ చరిత సినిమా ఆర్ట్స్
విడుదల తేదీ 7 నవంబర్ 2019
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి) తలస్సేమియా వ్యాధితో బాధపడుతుంటాడు. అతడు ఆరోగ్యంగా జీవించాలంటే నెలకి ఒకసారి కొత్త రక్తం ఎక్కించుకోవాలి. రవికి ఈ రక్త సంబంధిత వ్యాధితో పాటు మరో జబ్బు కూడా ఉంటుంది. ఎవరైనా అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే చాలు టెంప్ట్ అయిపోతుంటాడు. అలాంటి రవి ఒక ఏడుగుర్ని చూసి టెంప్ట్ అవడం, రవి ఎవరినైతే చూసి టెంప్ట్ అవుతాడో వాళ్ళంతట వాళ్ళే వచ్చి రవితో రాత్రి గడిపి వెళుతుంటారు. అయితే అది కలా, నిజమా అనే విషయంలో రవికి క్లారిటీ ఉండదు. అసలు రవి టెంప్ట్ అయితే అమ్మాయిలు అలా ఇంటికి ఎలా వచ్చేస్తారు? రవి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేదే మిగతా కథ.[3][4]

నటీనటులు మార్చు

  • అభిషేక్ పచ్చిపాల - టెంప్ట్ రవి
  • అయేషా సింగ్ - భావన
  • భానుశ్రీ
  • మేఘన చౌదరి
  • సునీల్ కుమార్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్:చరిత సినిమా ఆర్ట్స్
  • దర్శకత్వం : శ్యామ్ జె చైతన్య
  • నిర్మాత: జీవిఎన్ శేఖర్ రెడ్డి
  • సంగీతం: కవి శంకర్
  • సినిమాటోగ్రఫర్ : ఆర్లీ

మూలాలు మార్చు

  1. 10TV (3 May 2019). "ఇది టీజర్ కాదు బాబోయ్." 10TV (in telugu). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Republic World (8 November 2019). "Yedu Chepala Katha: All about the movie's cast and box office reviews". Republic World (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  3. Andhra Bhoomi (9 November 2019). "ఎండు చేపల కథ! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. News18 Telugu (8 November 2019). "ఏడు చేపల కథ ఎలా ఉందంటే.. బూతో బూతస్య బూతభ్య:." News18 Telugu. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)