ఈ పాటని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు. రమేష్ నాయుడు గారు సంగీతం అందించారు. 1977లో రావు బాలసరస్వతీ దేవి గానం చేయగా ఆకాశవాణిలో ప్రసారమయింది

రాగం: కాపి, పీలు

తాళం: ఖండచాపు

ఏనాటికీ రాడు ఏలాటి ప్రియుడే
ఈ లాగు వేచి నేనెన్నాళ్ళు సైచేనే ॥

తానే కదా వలపు లోన రేపేనే
ఉండుండి నా మనసు ఊయలూపేనే
సారెసారెకులోన సందేహాలాయె
ఊరకే ఏవేవో ఊహలోచ్చాయే ॥

తానూ వచ్చే దారి నా ప్రేమ చల్లి
ద్వారాన చూపుల తోరణాలల్లి
ఎన్నాళ్ళు నా కళ్ళూ ఎదురు చూసేనే
ఏలాగులూ విరహ బాధ మోసేనే ॥