ఆస్ట్రోశాట్

(ఏస్ట్రోశాట్ నుండి దారిమార్పు చెందింది)

ఆస్ట్రోశాట్ అనేది భారతదేశం ఖగోళ పరిశోధన కోసం మొట్టమొదటిసారిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చే పీఎస్‌ఎల్‌వీ సీ-30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 2015 సెప్టెంబరు 28 న ప్రయోగించిన ఉపగ్రహం.

ఆస్ట్రోశాట్
మిషన్ రకంSpace observatory
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2015-052A Edit this at Wikidata
SATCAT no.40930
మిషన్ వ్యవధి5 సంవత్సరాలు
Elapsed : 9 సంవత్సరాలు, 1 నెల, 18 రోజులు
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌకAstrosat
లాంచ్ ద్రవ్యరాశి1,513 కి.గ్రా. (3,336 పౌ.)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీసెప్టెంబరు 28, 2015 (2015-09-28)[1][2]
రాకెట్PSLV-C30
లాంచ్ సైట్సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్, శ్రీహరికోట
కాంట్రాక్టర్ISRO
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్భూమధ్యరేఖ-సమీప
సెమీ మేజర్ ఆక్సిస్7020 km
Perigee altitude643.5 km
Apogee altitude654.9 km
వాలు6.0°
వ్యవధి97.6 min
Main
తరంగ దైర్ఘ్యములుదూరపు అతినీలలోహిత నుండి X- రే
Instruments
UltraViolet imaging telescope (UVIT)
Soft X-ray telescope (SXT)
LAXPC
CZTI
 

ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన పదేళ్ల కృషి ఫలితమే భారత తొలి ప్రయోగ ఖగోళ అధ్యయన ఉపగ్రహం ఆస్ట్రోశాట్. దీనిని విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్ వంటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం మన గెలాక్సీ అవతలి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ప్రయోగించారు. దీనిని ' మినీ హబుల్ ' గా పరిగణిస్తారు.

ఈ ఉపగ్రహంలో అమర్చిన ఉపకరణాలు

మార్చు

ఈ ఉపగ్రహంలో మొత్తం 750 కిలోల ద్రవ్యరాశి కలిగిన ఆరు సాధనాలను అమర్చారు.

  • అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (The UltraViolet Imaging Telescope - UVIT)
  • సాఫ్ట్ ఎక్స్-రే ఇమేజింగ్ టెలిస్కోప్ (Soft X-ray imaging Telescope - SXT)
  • LAXPC ఇన్స్ట్రుమెంట్ (The LAXPC Instrument)
  • కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్ (Cadmium Zinc Telluride Imager - CZTI)
  • స్కానింగ్ స్కై మానిటర్ (Scanning Sky Monitor - SSM)
  • ఆవేశ కణ మానిటర్ (Charged Particle Monitor - CPM)

ఆస్ట్రోశాట్ లో అమర్చిన ఈ ఉపకరణాల విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు మరో నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ ఉపగ్రహ జీవితకాలాన్ని ఐదు సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు.

మూలాలు

మార్చు
  • 28-08-2015 సాక్షి దినపత్రిక - (ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ - ఖగోళ పరిశోధనల కోసం తొలి ప్రయత్నం)
  1. s, Madhumathi D. (2015-05-19). "India's eye on universe ready for tests". The Hindu. Retrieved May 20, 2015.
  2. "ASTROSAT: A Satellite Mission for Multi-wavelength Astronomy". IUCAA. 2012-04-20. Archived from the original on 2013-04-22. Retrieved 2013-09-07.