కక్ష్య వాలు అంటే ఖగోళ వస్తువు చుట్టూ పరిభ్రమించే వస్తువు పరిభ్రమణ కక్ష్య యొక్క వంపు. రిఫరెన్స్ తలానికి, కక్ష్యా తలానికీ మధ్య ఉండే కోణమే కక్ష్య వాలు.

కక్ష్య వాలును i (ముదురు ఆకుపచ్చ) సూచిస్తుంది. ఇతర కక్ష్య పరామితులమ్ను కూడా చూడవచ్చు.

భూమి చుట్టూ సరిగ్గా భూమధ్యరేఖకు ఎదురుగా తిరిగే ఉపగ్రహపు కక్ష్యాతలం భూమధ్యరేఖా తలంతో సమతలంగా ఉంటుంది. ఆ ఉపగ్రహపు కక్ష్య వాలు 0°. వృత్తాకార కక్ష్య సాధారణంగా కొంత వాలుతో ఉండి, సగం కక్ష్య ఉత్తరార్ధగోళం పైన, మిగతా సగం దక్షిణార్ధగోళం పైనా ఉంటుంది. కక్ష్య 20° ఉత్తర అక్షాంశానికి, 20° దక్షిణ అక్షాంశానికీ మధ్య తిరుగుతుంటే, దాని కక్ష్య వాలు 20° అవుతుంది.

కక్ష్యలు

మార్చు

కక్ష్య వాలు అనేది ఖగోళ వస్తువు చుట్టూ పరిభ్రమించే వస్తువు పరిభ్రమణ కక్ష్య యొక్క వాలు కొలత. ఇది రిఫరెన్స్ తలానికీ, కక్ష్యాతలానికీ మధ్య ఉన్న కోణం.

సూర్యుని భూమధ్యరేఖ లేదా ఇన్‌వేరియబుల్ తలం (సౌర వ్యవస్థ కోణీయ వేగాన్ని సూచించే తలం - సుమారుగా ఇది గురు గ్రహ కక్ష్యా తలం) వంటి మరొక తలం రిఫరెన్సుగా కూడా వాలును కొలవవచ్చు.

సహజ, కృత్రిమ ఉపగ్రహాలు

మార్చు

సహజ లేదా కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యల వాలు అవి దేని కక్ష్యలో ఉన్నాయో ఆ కేంద్ర వస్తువు భూమధ్యరేఖాతలాన్ని రిఫరెన్సుగా తీసుకుని కొలుస్తారు. భూమధ్యరేఖ తలం అనేది కేంద్ర వస్తువు యొక్క భ్రమణాక్షానికి లంబంగా ఉండే తలం.

30° వాలును 150° కోణాన్ని ఉపయోగించి కూడా వివరించవచ్చు. సాంప్రదాయికంగా, సాధారణంగా కక్ష్యను ప్రోగ్రేడ్ కక్ష్యగా ( గ్రహం తిరిగే దిశలోనే ఉన్న కక్ష్యగా ) భావిస్తారు. 90° కంటే ఎక్కువ వాలు తిరోగమన కక్ష్యలను (రెట్రోగ్రేడ్) వివరిస్తాయి. కాబట్టి

  • 0° వాలు అంటే కక్ష్యలో ఉన్న వస్తువు, గ్రహం భూమధ్యరేఖపై ప్రోగ్రేడ్ కక్ష్యను కలిగి ఉంటుంది.
  • 0° కంటే ఎక్కువ, 90° కంటే తక్కువ వాలు కూడా ప్రోగ్రేడ్ కక్ష్యను వివరిస్తుంది.
  • భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాలను వివరించేటప్పుడు 63.4° వాలును తరచుగా క్రిటికల్ వాలు అని అంటారు. ఎందుకంటే వాటి అపోజీ డ్రిఫ్ట్ సున్నా ఉంటుంది.[1]
  • సరిగ్గా 90° వాలు ఉంటే అది ధ్రువ కక్ష్య. దీనిలో అంతరిక్ష నౌక గ్రహపు ధ్రువాల మీదుగా వెళుతుంది.
  • 90° కంటే ఎక్కువ, 180° కంటే తక్కువ వాలు ఉంటే అది రెట్రోగ్రేడ్ (తిరోగమన) కక్ష్య.
  • సరిగ్గా 180° వాలు ఉంటే అది రెట్రోగ్రేడ్ భూమధ్యరేఖా కక్ష్య.

వేరే అర్థం

మార్చు

గ్రహాలు తదితర తిరిగే ఖగోళ వస్తువుల విషయంలో, కక్ష్యా తలానికి సంబంధించి భూమధ్యరేఖా తలం ఉండే కోణాన్ని కూడా కొన్నిసార్లు వాలు అనే అంటారు. అయితే మరింత స్పష్టంగా ఉండాలంటే దీన్ని అక్షపు వంపు అంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు