ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (ఐఐటి తిరుపతి), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఏర్పరచబడిన స్వయంప్రతిపత్తి కలిగిన సాంకేతిక విద్యాసంస్థ. భారతదేశం ప్రభుత్వం చేత జాతీయ ప్రాధాన్యతా సంస్థగా గుర్తింపు పొందినది. తిరుపతి నగరంలోని చదలవాడ నగర్ లో ఉన్న కృష్ణతేజ విద్యాసంస్థలలో ఉన్న తాత్కాలిక ప్రాంగణంలో, 2015 ఆగస్టు 5 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది.[1]2015-16 విద్యాసంవత్సరంలో, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగు విద్యలలో 30 సీట్లతో బి.టెక్ కోర్సులను చేపట్టింది.[2]
भारतीय प्रौद्योगिकी संस्थान तिरुपति | |
రకం | విద్య, పరిశోధనల సంస్థ |
---|---|
స్థాపితం | 2015 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 120 |
స్థానం | తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం 13°37′52″N 79°28′25″E / 13.63111°N 79.47361°E |
కాంపస్ | ప్రధాన ఆవరణ - మేరలపాక వద్ద, తాత్కాలిక ఆవరణ - కృష్ణతేజ విద్యాసంస్థలు |
సంక్షిప్తనామం | ఐఐటి తిరుపతి |
ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పర్యవేక్షణలో ఉన్నది. ఈ పర్యవేక్షణ ప్రణాళికలో భాగంగా, ఐఐటి మద్రాస్ నుండి అధ్యాపకుల బృందం, ఐఐటి తిరుపతిలో విద్యాబోధన సాగిస్తుంది.
ప్రాంగణం
మార్చుఐఐటి-తిరుపతి శాశ్వత ఆవరణ రేణిగుంట, శ్రీకాళహస్తి మధ్యనున్న ఏర్పేడులో 532 ఎకరాలలో ఏర్పాటు చేయబడింది. విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు, విద్యాభ్యాసానికి అవసరమైన తరగతి గదులు, పరిశోధనాశాలలు, క్రీడా ప్రాంగణాలు అన్ని ప్రస్తుతానికి ఏర్పరచబడినవి. నూతన బోధనా భవనాల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతుంది. సమీపంలోని తిరుపతి విమానాశ్రయం కూడా అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతున్నది.
విద్య
మార్చుఐఐటి-తిరుపతి లో జాతీయస్థాయిలో జరిగే ఐఐటీ సంయుక్త ప్రవేశ పరీక్ష (IIT-JEE)ద్వారా విద్యార్థులు, 10+2 అనంతరం చేరతారు. ఐఐటి తిరుపతి 4 ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నది. [3]
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజనీరింగ్
- ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్