ఐడహొ (ఆంగ్లం: Idaho) అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఉంది. బోయిస్ ఈ రాష్ట్ర రాజధాని, అతి పెద్ద నగరం. ఈ రాష్ట్రం జూలై 3, 1890 న అమెరికాలో 43వ రాష్ట్రంగా చేరింది. ఆ రాష్టానికి సరిహద్దులలో వాషింగ్టన్, ఆరెగాన్, నెవాడా, యూటా, మోంటానా, వ్యోమింగ్ రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రంలో సమృద్ధిగా లభ్యమయ్యే సహజవనరులవలన ఈ రాష్ట్రానికి జెమ్ స్టేట్ (రాష్ట్ర రత్నం అని అనువదించవచ్చును) అన్న ముద్దు పేరు వచ్చింది.

Map of USA ID.svg

చరిత్రసవరించు

ఐడహొలో మానవులు 14,500 సంవత్సరాలనుండి నివాసమున్నారనడానికి ఆధారాలున్నాయి. 1959లో జంట జలపాతాల దగ్గరలోని విల్సన్ బుట్టె గుహలో జరిగిన తవ్వకాలలో అనేక అవశేషాలు లభ్యమయాయి. అమెరికా దేశావిర్భావపు తొలినాళ్ళలో ఐడహొ తమదని అమెరికా, బ్రిటన్ కలహించుకున్నాయి. ఈ పోరు 1846 వరకు కొనసాగింది. 1846లో ఈ ప్రాంతంపై అమెరికా నిర్దుష్టమైన అధికారం సంపాదింఛుకోగలిగింది.

పేరు వెనుక కథసవరించు

1860 తొలినాళ్ళలో అమెరికా ప్రభుత్వం రాకీ పర్వతప్రాంతంలో ఒక కొత్త స్థలం సమీకరింఛుకోవాలని యోచించింది. ఆ సమయంలో తలతిక్క మనిషిగా పేరు పడ్డ జార్జ్ విల్లింగ్ ఐడలహొ అన్న పేరు సూచించాడు. ఆ మాట షోషోని భాష నుండి వచ్చిందని, "పర్వతాల మధ్యన సూర్యోదయం" అన్నది ఆ మాటకు అర్ధమని అతను పేర్కొన్నాడు. అది నిజం కాదని అతను ఆ తరువాత అంగీకరింఛాడు. అటుపై అమెరికా కాంగ్రెసు ఈ భాగానికి కొలొరాడో ప్రాంతమని పేరు ఖరారు చేసింది. కానీ ఐడహొ అన్న పేరు నిలచిపోయింది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఐడహొ&oldid=3913556" నుండి వెలికితీశారు