ఐదేయు
ఐదేయు (బిహైండ్ ది స్క్రీన్), 2007లో విడుదలైన అస్సామీ సినిమా. త్రినయన్ మీడియా ఫౌండేషన్ నిర్మించిన ఈ సినిమాకు అరూప్ మన్నా దర్శకత్వం వహించాడు. 2007, ఫిబ్రవరి 8న ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా తొలిసారిగా ప్రదర్శించబడింది.[1] పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఢిల్లీ హాబిటాట్ ఫిల్మ్ ఫెస్ట్, 25వ మ్యూనిచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శనలు జరుపుకుంది.[1] రూ. 1,600,000 బడ్జెట్‌తో 16ఎంఎం ఫార్మాట్ లో ఈ సినిమా చిత్రీకరించబడింది.[2]
ఐదేయు | |
---|---|
దర్శకత్వం | అరూప్ మన్నా |
నిర్మాత | నబామికా బర్తకూర్ |
తారాగణం | ఐదేయు హాండిక్ ప్రశాంత కుమార దాస్ చందన శర్మ నబామికా బర్తకూర్ |
ఛాయాగ్రహణం | అరూప్ మన్నా |
సంగీతం | మనాష్ హజారికా |
నిర్మాణ సంస్థ | త్రినయన్ మీడియా ఫౌండేషన్ |
విడుదల తేదీ | 8 ఫిబ్రవరి 2007 |
సినిమా నిడివి | 81 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | అస్సామీ |
బడ్జెట్ | 16 లక్షలు |
కథా సారాంశం
మార్చుఅస్సామీ సినిమారంగంలో మొదటి నటి ఐదేయు హాండిక్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. 1935లో వచ్చిన జోయ్మోతి సినిమా ద్వారా హాండిక్ సినిమారంగంలోకి ప్రవేశించింది. 2002లో మరణించింది.[1]
నటవర్గం
మార్చు- ఐదేయు హాండిక్ (ఐదేయు హాండిక్)
- ప్రశాంత కుమార దాస్ (జ్యోతిప్రసాద్ అగర్వాలా)
- చందన శర్మ (ఐదేయు హాండిక్)
- నబామికా బర్తకూర్ (ఐదేయు తల్లి)
- సోపుంటి బోర్డోలోయ్ (డింబో గోహైన్)
- పితురాజ్ గోస్వామి (ఐదేయు తమ్ముడు కేశబ్)
అవార్డులు
మార్చుఐదేయు సినిమా భారతదేశ 54వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అస్సామీలో ఉత్తమ చలనచిత్రం కొరకు నామినేట్ చేయబడి, అవార్డును అందుకుంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Aideu, the story of Assam's first actress". Indian Express. Retrieved 15 February 2022.
- ↑ Santanava Hazarika. "Reel Reality". bipuljyoti.in. Archived from the original on 4 March 2016. Retrieved 15 February 2022.
బయటి లింకులు
మార్చు- చాలా ఆలస్యంxe గుర్తింపు, ది హిందూలో సంగీతా బరూహ్ పిషారోటీ.