అస్సామీ భాష

(అస్సామీ నుండి దారిమార్పు చెందింది)
Assamese (অসমীয়া)
మాట్లాడే ప్రదేశం: భారత దేశము, బంగ్లాదేశ్, భూటాన్
ప్రాంతం: ఆసియా
మాట్లాడే వారి సంఖ్య: 20,000,000
స్థానం: 65
అనువంశిక వర్గీకరణ: ఇండో-యూరోపియన్

 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   Eastern Zone
    Assamese      Assamese

అధికార స్థాయి
అధికార భాష: అస్సాం
నియంత్రణ: not regulated
భాష కోడ్‌లు
ISO 639-1 as
ISO 639-2 asm
SIL ASM
చూడండి: భాషప్రపంచ భాషలు

Assamese (অসমীয়া) or Asamiya or Oxomiyaగా పేరొందిన ఈ భాష ఈశాన్య భారత దేశంలో గల అస్సాం రాష్ట్రంలో మాట్లాడే భాష. ఇది అస్సాం రాష్ట్ర భాష. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో, మరికొన్ని ఈశాన్య భారత దేశంలోని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఈ భాష ఉపయోగంలో ఉంది. కొంతమంది అస్సామీలు భూటాన్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు. ప్రవాసులు తమతో భాషను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. ఇండో యూరోపియన్ భాషలలో అత్యంత తూర్పులో మాట్లాడే భాష అస్సామీనే. ఈ భాష సుమారుగా 2 కోట్ల మంది మాట్లాడుతారు

అస్సామీ కూర్పు

మార్చు
 
రుద్ర సింఘా హయాంలో అసామీస్ ఇంకా సంస్కృత భాషలతో ముద్రించిన నాణేలు

మగధి ప్రాకృతము ఏకాదిగా అస్సామీ, బెంగాలీ, ఒరియా భాషలు అవిర్భవించాయి. మగధి ప్రాకృతము అపభ్రంశ భాషకు తూర్పు శాఖ. అస్సామీ లిపిలో లభ్యమైన మొట్ట మొదటి వ్రాత ప్రతులు ఆరు లేక ఏడవ శతాబ్దానికి చెందినవి. అప్పుడు కామరూప వర్మన్ రాజుల పరిపాలనలో ఉండేది. (ఇప్పటి అస్సాం రాష్ట్రం లోని చాలా భాగం అప్పటి కామరూప రాజ్యంలో భాగమై ఉండేది). అస్సామీ భాష గుర్తులు 9 వ శతాబ్ధానికి చెందిన 'చర్యపద' లో కనిపిస్తాయి. చర్యపద బౌద్ధ శ్లోకాలు 1911 లో నేపాల్లో కనుగొనబడ్డాయి, ఇవి అపభ్రంశ కాలంతమున వచ్చినవి. అస్సామీ భాష తొలి ఉదాహరణలు కమత రాజైన దుర్లభ నారాయణ కాలం 14 వ శతాబ్ధ తొలి రోజుల్లో కనిపిస్తాయి. చర్యపద తర్వాత అస్సామీ భాష పై టిబెటో-బర్మన్, ఆస్ట్రిక్ భాషా కుంటబాల ప్రభావంతో, ఆ భాషకు characteristic expressiveness మరియూ రమణీయతనును సమకూర్చాయి.

లేఖనా సంప్రదాయం

మార్చు

అస్సామీలో బలమైన లేఖనా సంప్రదాయము చరిత్రలో చాల ముందునుంచీ గమనించబడింది. ఉదాహరణలు, శాసనములలోను, భూమి పట్టాలలోను, మధ్య యుగ రాజులు వేయించిన రాగి ఫలకాలలోను కనుగొనవచ్చు. అస్సాంలో ధార్మిక, చారిత్రక గ్రంథాలు, కామరూపి గ్రంథాలు సాంచీ చెట్టు యొక్క బెరడు మీద వ్రాయబడినవి. అస్సామీ లిపికి, నగరిలిపితో దగ్గరి సంబంధాలు కనిపిస్తాయి. నగరి, హిందీ భాష ఉపయోగించే తొలి రూపలలోనిది. ప్రస్తుత ప్రమాణీకరించబడిన అస్సామీ లిపి ప్రమాణిక బెంగాలీ లిపిని కొద్దిపాటి మార్పులతో తీసుకోబడింది. అస్సామీ పూర్తిగా ధ్వన్యానుగుణంగా వ్రాయబడే భాష కాదు. కానీ రెండవ అస్సామీ నిఘంటువు అయిన హెమ్ కొహ్, అక్షరాలను వ్రాసే విధం (స్పెల్లింగ్) ను సంస్కృతాధారంగా ప్రమాణీకరించింది.

మాండలీకాలు

మార్చు

ప్రస్తుత కాలంలో ఉపయోగించే అస్సామీస్ వేర్లు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ పట్టణానికి చెందిన భాషలో ఉన్నాయి (1872లో బ్రిటిష్ రాజ్ ఆస్సామీని రాష్ట్ర అధికార భాషగా ప్రకటించింది), కానీ ఈ శతాబ్ధ ఆరంభంలో అన్ని కార్య కలాపాలు సిబసాగర్ నుండి గౌహతికి మార్పు చెందడంతో ప్రస్తుత భాష మీద గౌహతీ ప్రాభావం కూడా చాలా ఉంది.

ప్రస్తుతము పాఠశాలలో చెప్పే, వార్తా పత్రికలలో ప్రచురించే అస్సామీ భాష వివిధ మండలీకాల కూర్పు అని చెప్పవచ్చు. బణికాంత కకతి భాషను రెండు మాండలీకాలుగా విభజించెను (1) తూర్పు మాండలీకము (2) పడమర మాండలీకము. కానీ ఈమధ్యనే జరిపిన linguistic studies నాలుగు మాండలీకాలను గుర్తించాయి[1] (Moral 1992), ఈనాలుగు మాండలీకాలను తూర్పు నుంచి పడమర వైపుగా కింద పొందుపరచబదడినవి:

  • తూర్పు మాండలీకం, సిబసాగర్ చుట్టు పక్క జిల్లాలో మాట్లడుతారు
  • మధ్య మాండలీకము, నవగాంవ్ మరియి చుట్టు పక్కల జిల్లాలలో మాట్లాడుతారు
  • కామరూపి, ఈ మాండాలీకాన్ని కామరూప్, నల్బరి, బార్పేట, దర్రంగ్, కొక్రాఝార్, బొంగైగాంవ్ జిల్లాలలో మాట్లాదుతారు.
  • గువాల్ పరియ, ఈ మాండాలీకాన్ని గువాల్ పర, ధుభ్రి, కొక్రాఝార్, బొంగైగాంవ్ జిల్లాలలో మాట్లాడుతారు

చరిత్ర

మార్చు

అస్సామీ భాషా చరిత్రను స్థూలంగా మూడు కాలాలుగా విభజించవచ్చు.

తొలి కాల అస్సామీ (6 నుండి 15 వ శతాబ్ధం)

మార్చు

ఈ కాలాన్ని మళ్ళీ రెండు భాగాలుగా విభజించవచ్చు (1) Pre–Vaishnavite and (2) Vaishnavite ఉప కాలాలు. మనకు తెలిసినంత వరకు అస్సామీ తొలి రచయిత హేమా సరస్వతి, ఈయన 'ప్రహరాద చరిత' అనె చిన్న పద్యాన్ని రచించారు. ఇంద్ర నారాయణ రాజు కాలానికి (1350-1365) చెందిన కవి హరిహర విప్ర 'అశ్వమేధ పర్వ' రచించాడు. అదే కాలానికి చెందిన 'కవిరత్న సరస్వతి' 'జయ్ద్రధ వధ' ని రచించాడు. ఇంకొక కవి రుద్ర కందలి 'ద్రోణ పర్వ'ను అస్సామీలో అనువదించాడు. Vaishnavite ఉప కాలంలో ప్రసిద్ధి కెక్కిన కవి మాధవ కందలి. ఈయన పూర్తి రామాయణాన్ని అస్సామీలో అనువదించాడు. మాధవ కందలికి జయంతపుర కచారీ రాజైన మహా మాణిక్య అండదండలు ఉండేవి. హేమా సరస్వతి తన రచనలలో తనని కామరూపలో జన్మించిన వైష్ణవగా పరిచయం చెసుకున్నాడు. ఈయన ఉపయోగించిన భాష కామరూపి. మాధవ కందలి కూడా కామరూపినే ఉపయోగించాడు.

మధ్య కాల అస్సామీ (17 నుండి 19 వ శతాబ్ధం)

మార్చు

ఈ కాలము అహొం సభలలోని చారిత్రక వ్యాసాలకు సంబంధించింది. అహొంలు వారితో పాటు చరిత్రను లిఖించే ఒక ఆచారాన్ని కూడా పట్టుకొచ్చారు. మొదట అహొం సభలలో చారిత్రక గ్రంథాలను వారి 'టిబెటొ -చైనీస్' భాషలోనే రచించారు, కానీ అస్సామీను సభలో ఉపయోగించే భాషగా చేసినప్పటి నుండి, ఈ చారిత్రక గ్రంథాలను కూడా అస్సామీ భాషలోనే రచించేవారు. 17 వ శతాబ్ద ఆరంభం నుండి ఈ చారిత్రక గ్రంథాలు అధిక సంఖ్యలో రచించబడ్డాయి. వీటిని బురంజీ అని అస్సమీలో అంటారు. బురంజీలు ధార్మిక గ్రంథాలు రాసే శైలినుండి పూర్తి విరుద్ధంగా ఉండేవి. వయాకరణము, స్పెల్లింగులలో ఎవో కొద్దిపాటి మార్పులు తప్ప ఆధునిక భాషనే వాడారు.

ఆధునిక అస్సామీ

మార్చు

మిషనరీల ప్రభావం

మార్చు

అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీలు 1819 లో అస్సామీలో ప్రచురించిన బైబిలుతో ఆధునిక అస్సామీ యుగము మొదలైనదని చెప్పవచ్చును. బణికాంత కకతి పుస్తకంలో "Assamese, its Formation and Development" (1941, Published by Sree Khagendra Narayan Dutta Baruah, LBS Publications, G.N. Bordoloi Road, Gauhati-1, Assam, India) – " చెప్పినట్టుగా మిషనరీలు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ ను తమ కార్య కలాపాలకు కెంద్రంగా చేసుకున్నయి. అదే విధంగా తూర్పు మాండలీకాన్ని వారి సాహిత్య ప్రయోజనాలకి ఉపయోగించుకున్నయి. 1836 లో మొట్ట మొదటి అచ్చు యంత్రన్ని ఈ మిషనరీలు సిబసాగర్ లో ప్రతిష్టించారు. 1846 లో అరునోదయ్ అనే మాస పత్రికను ఆరంభించారు. 1848 లో అస్సామీ వ్యాకరణం పై నాథన్ బ్రౌన్ వ్రాసిన ప్ుస్తకాని ప్రచురించారు. ఎం. బ్రాన్ సన్ కూర్చిన మొట్ట మొదటి అస్సామీ - ఆంగ్ల నిఘంటువు 1867 లో మిషనరీలు ప్రచురించయి.

బ్రిటిష్ పాలనా ప్రభావం

మార్చు

1826 లో అస్సామీ రాష్ట్రాన్ని ఆక్రమించుకున్న తర్వాత, బ్రిటీషు ప్రభుత్వం బెంగాలీ భాషను అస్సాంపై రుద్దింది. కానీ ఆ తర్వాత జరిగిన వ్యతిరెక ఉద్యమాల వల్ల 1872 లో రాష్ట్ర భాషగా చేశారు. అప్పట్లో ప్రింటింగు, భాషా కార్యక్రమాలు తూర్పు అస్సాంలో ఎక్కువగా ఉండడం వల్ల తూర్పు మాండలీకం, పాఠశాలలోను, కార్యాలయలలోను, కచేరీలలోను ఉపయోగించబడి ప్రమాణీక అస్సమీగా గుర్తించబడినది. కానీ అ తర్వాత గౌహతి పెరుగుదలతో ప్రామాణిక అస్సమీ తూర్పు మండలీకం నుంచి మార్పు చెందుతూ ఉంది.

ఆధునిక సాహిత్యం - ఆరంభం

మార్చు

1889 అస్సామీ పత్రిక జొనాకి ప్రచురణతో ఆధునిక సాహిత్య కాలం ఆరంభం అయింది. జొనాకి లొ 'లక్ష్మీనాథ్ బెజ్ బరువా' రాసిన చిన్న కథలు ప్రచురితమయ్యెవి. 1894 లొ రజనీకాంత బొర్దలొయ్ రాసిన మొట్ట మొదటి నవల 'మిరి జియోరి' ప్రచురితమైంది. జ్యోతీ ప్రసాద్ అగర్వల్లా,హేమ్ బరువా తదితరులు అధునిక అస్సామీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

1917 లో అస్సామీ భాషా సాహిత్యాలను అభివృద్ధి చేయడానికి అహొం సాహిత్య సభను ఏర్పాటు చేసారు. అస్సామీ అనెది ఆంగ్ల ప్రభావం వలన వచ్చిన పదం, కానీ అసొం ప్రజలు అసోమియా (అహోమియా) భాషగ పిలుస్తారు.

ISO 639-1: as
ISO 639-2: asm

కొన్ని సామాన్యంగా వాడే వాక్యాలు

మార్చు
తెలుగు వాక్యం తెలుగు లిపిలో అస్సామీ వాక్యం అస్సామీ లిపిలో అస్సామీ వాక్యం
నమస్కారం, బాగున్నారా? నమొస్కార్, భాల్నె? নমস্কাৰ, ভাল নে।
మీ పేరు ఏమిటి? అపునార్ నామ్ కీ? আপোনাৰ নাম কি?
ఆ హోటలుకి ఎలా వెళ్తారు? హెయ్ హోటెల్ లోయ్ కెనెకె జాయ్? সেই হোটেল লৈ কেনেকে যাই?
నా పేరు పవన్ మూర్ నామ్ పవన్ মোৰ নাম পৱন
అస్సామీస్ నాకు తెలియదు అహొమియా మోయ్ నజాను. অসমিয়া মই নাযানো
అస్సామీస్ నాకు కొంచెం కొంచెం తెలుసు అహొమియా మోయ్ అలోప్ అలోప్ జాను অসমিয়া মই অলপ অলপ যানো
మీకు హిందీ వచ్చా? అపుని హిందీ జానేనె? অপুনি হিন্দি যানেনে।

బయటి లింకులు

మార్చు